AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fertility: వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారా..? సంతానోత్పత్తి స్థాయి పడిపోతుంది!

ఆరోగ్యంగా ఉండటానికి ఆహారం పాత్ర మనందరికీ తెలుసు. మనం తినే, తాగేవి మన శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. తల్లి లేదా తండ్రి అయ్యే ఆనందాన్ని దూరం చేసే కొన్ని..

Fertility: వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారా..? సంతానోత్పత్తి స్థాయి పడిపోతుంది!
ఉరుకులు పరుగుల జీవితం, ఒత్తిడి, శారీర శ్రమ తగ్గడం, అనారోగ్యకరమైన ఆహారం.. ఇలా పలు కారణాలు పురుషులు, మహిళల్లో సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా జరిపిన పరిశోధనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Subhash Goud
|

Updated on: Oct 26, 2022 | 11:09 AM

Share

ఆరోగ్యంగా ఉండటానికి ఆహారం పాత్ర మనందరికీ తెలుసు. మనం తినే, తాగేవి మన శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. తల్లి లేదా తండ్రి అయ్యే ఆనందాన్ని దూరం చేసే కొన్ని అంశాలు ఉన్నాయి.  సంతానం కలుగాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడున్న రోజుల్లో సంతానోత్పత్తి స్థాయి చాలా వరకు తగ్గిపోతుంది. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు తదితర కారణంగా సంతానం కలుగడం లేదు. దీంతో ఎంతో మంది దంపతులు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ విషయాల వల్ల సంతానోత్పత్తి స్థాయిని తగ్గించడానికి గల కారణాలు, ఇతర నష్టాల గురించి తెలుసుకోండి.

శీతల పానీయాలు:

సోడా వంటి శీతల పానీయాల ఆరోగ్యానికి హానికరమనే వార్తలు ఎన్నో్ విన్నాము. వీటిని తీసుకోవడం వల్ల తల్లిదండ్రులు అయ్యే అవకాశాలు చాలా తక్కువ. నివేదికల ప్రకారం.. హార్మోన్ల సమతుల్యతను ప్రభావితం చేసే కృత్రిమ స్వీటెనర్లను వీటిలో కలుపుతారు. ఈ కృత్రిమ స్వీటెనర్ల వల్ల సంతానలేమి, గర్భస్రావం వంటి పరిస్థితులు తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు. అస్పార్టిక్, ఫెనిలాలనైన్ ఆమ్లాలు, అమైనో ఆమ్లాలు అని కూడా పిలుస్తారు. ఈ పానీయాలలో ఉపయోగిస్తారు. మనం వీటిని తిన్నప్పుడల్లా అవి ఇతర అమైనో ఆమ్లాలతో కలసి మన ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. వీటి వల్ల కణాలు చనిపోతాయని, స్పెర్మ్ నాణ్యత దెబ్బతింటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది:

నిరంతరం శీతల పానీయాలు, సోడాతో చేసిన పానీయాలు తాగే వ్యక్తి స్పెర్మ్ కౌంట్ తగ్గిపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. సోడాను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలోని పీహెచ్ స్థాయి మారుతుందని నిపుణులు చెబుతున్నారు. pH స్థాయిలో మార్పులు శరీరంలో పోషకాల కొరతను కూడా సూచిస్తాయి. అలాంటివి తాగడం మానుకోవడం మంచిదని సూచిస్తున్నారు. వీటికి బదులుగా పండ్ల రసాన్ని రోజు తాగడం మంచిది.రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా మారుతుంది. చక్కెరతో తయారుచేసిన ఈ రకమైన సోడాతో కూడిన శీతల పానీయం తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి కూడా బలహీనపడుతుంది. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నప్పుడు, జలుబు మరియు దగ్గు మాత్రమే కాకుండా, మీరు సంతానోత్పత్తికి సంబంధించిన సమస్యలను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నప్పుడు, గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం