Recession: ముంచుకొస్తున్న ఆర్థిక మాంద్యం.. మానసిక ఆరోగ్యంపై ప్రభావం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..

|

Nov 20, 2022 | 5:33 PM

ఉద్యోగాల తొలగింపు వార్తలు ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. దిగ్గజ ఐటీ కంపెనీలు అమెజాన్‌, ట్విట్టర్‌, మెటా కంపెనీలు వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్నాయి. టెక్‌ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు గణాంకాలను ట్రాక్ చేసే వెబ్‌సైట్ Layoffs.fyi ప్రకారం...

Recession: ముంచుకొస్తున్న ఆర్థిక మాంద్యం.. మానసిక ఆరోగ్యంపై ప్రభావం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Global Recession
Follow us on

ఉద్యోగాల తొలగింపు వార్తలు ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. దిగ్గజ ఐటీ కంపెనీలు అమెజాన్‌, ట్విట్టర్‌, మెటా కంపెనీలు వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్నాయి. టెక్‌ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు గణాంకాలను ట్రాక్ చేసే వెబ్‌సైట్ Layoffs.fyi ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 1.20 లక్షల మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయారు. వేర్వేరు కంపెనీలు వేర్వేరు కారణాల వల్ల ఉద్యోగులను తొలగించాయి. ఈ తొలగింపుల వెనక ఉన్న ఏకైక కారణం కంపెనీలు ఆర్థిక నష్టాలు ఎదుర్కోవడమే. ఇదిలా ఉంటే ఆర్థిక మాంద్య పరిస్థితులు కేవలం ఆర్థిక రంగంపైనే కాకుండా ప్రజల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయనడంలో సందేహం లేదు .

ఈ విషయంపై ఫోర్టిస్ హెల్త్‌కేర్‌లోని మెంటల్ హెల్త్ అండ్ బిహేవియరల్ సైన్సెస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ మెంటల్ హెల్త్ హెడ్ డాక్టర్ కామ్నా చిబ్బర్ టీవీ9తో మాట్లాడారు. భవిష్యత్తుపై అనిశ్చితి, అభద్రత చాలా వేగంగా పెరుగుతోందని ఆయన అన్నారు. ‘మానసిక ఆరోగ్యానికి సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయి. ఉద్యోగం కోల్పోవడం కూడా ఇందులో ఒకటి. ఇది తీవ్రమైన మానసిక అనారోగ్యానికి కారణమవుతుంది. నిరుద్యోగం కారణంగా ఆందోళన, నిరాశ, సంతృప్తికరమైన జీవితాన్ని కోల్పోవడం వంటి సమస్యలు ఏర్పడుతాయని ఇప్పటి వరకు చేసిన ఎన్నో పరిశోధనల్లో తేలింది. ఈ విషయమై డాక్టర్ చిబ్బర్ మాట్లాడుతూ.. ‘ఉద్యోగం కోల్పోయిన తర్వాత ఏర్పడే అనిశ్చితి ఆందోళనకు దారి తీసే అవకాశం ఉంటుంది’ అని చెప్పుకొచ్చారు.

ఉద్యోగం కోల్పోవడం వల్ల భవిష్యత్తులో డిప్రెషన్, నిద్రలేమి, శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే పెద్ద సమస్యలు రావచ్చని మానసిక నిపుణులు చెబుతున్నారు. కాలక్రమేణ ఇది శారీరక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. ఇక కేవలం ఉద్యోగాన్ని కోల్పోయిన వారిపైనే కాకుండా ఉద్యోగాల్లో ఉన్న వారు కూడా ఒత్తిడికి గురవుతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగాలను తొలగిస్తున్న కంపెనీల్లో ఉద్యోగులు తమను కూడా ఎప్పుడైనా తొలగించవచ్చనే ఆందోళన ఉంటారు. ఈ సమయంలో ఈ కంపెనీల్లో పనిచేస్తున్న వారు ఈ ఘటనలను ఇంకా పరిశీలిస్తూనే ఉంటారు. దీంతో తమ స్థానాన్ని పదిలం చేసుకునే క్రమంలో ఒత్తిడి పెరుగుతుందని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఉద్యోగుల మానసిక ఆరోగ్యం ఆఫీసు వాతావరణంపై ఆధారపడి ఉంటుందని ఓ అధ్యయనంలో తేలింది. నాసిరకం వర్క్ కల్చర్ వల్ల ఉద్యోగులు డిప్రెషన్‌లోకి వెళ్లే ప్రమాదం మూడు రెట్లు ఎక్కువని అధ్యయనంలో తేలింది. సుదీర్ఘ పని గంటలు, పేలవమైన సంస్థాగత మానసిక భద్రతా వాతావరణం కారణంగా డిప్రెషన్‌ ఏర్పడవచ్చని అధ్యయనంలో తేలింది. ఎక్కువ పని గంటలు కారణంగా ఉద్యోగుల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..