AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jaundice: వేసవిలో ఎక్కువగా అలసిపోతున్నారా..? ఈ వ్యాధి కావచ్చు.. జాగ్రత్త.. ఎలా నివారించాలి..?

Jaundice: ఈ వేసవి కాలంలో కామెర్లు (Jaundice) ఎక్కువగా కనిపిస్తుంటాయి. కాలేయం (Liver)పై జాండిస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కామెర్లు హెపటైటిస్, లివర్ సిర్రోసిస్, ..

Jaundice: వేసవిలో ఎక్కువగా అలసిపోతున్నారా..? ఈ వ్యాధి కావచ్చు.. జాగ్రత్త.. ఎలా నివారించాలి..?
Subhash Goud
|

Updated on: Apr 30, 2022 | 7:19 AM

Share

Jaundice: ఈ వేసవి కాలంలో కామెర్లు (Jaundice) ఎక్కువగా కనిపిస్తుంటాయి. కాలేయం (Liver)పై జాండిస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కామెర్లు హెపటైటిస్, లివర్ సిర్రోసిస్, ఫ్యాటీ లివర్ వంటి వ్యాధులకు కూడా దారితీయవచ్చు. సాధారణంగా కామెర్ల లక్షణాలు సులభంగా గుర్తించవచ్చు. కానీ చాలా సందర్భాలలో ప్రజలు కూడా నిర్లక్ష్యంగా ఉంటారు. దీని కారణంగా ఈ వ్యాధి తీవ్రంగా మారి కాలేయాన్ని దెబ్బతీస్తుంది. ఈ సీజన్‌లో జాండిస్‌ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితిలో ఈ వ్యాధిని నివారించడం ఎంతో అవసరం.

సీనియర్ వైద్యుడు డాక్టర్ కవల్జిత్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. కాలేయంలో బిలిరుబిన్ ఎక్కువగా మారడం ప్రారంభమైనప్పుడు ఇది ఒక రకమైన వ్యర్థ పదార్థం శరీరం నుండి బయటకు వెళ్లదు. దీని కారణంగా శరీరం పసుపు రంగులోకి మారడం మొదలవుతుంది. జాండిస్‌తో జ్వరం వస్తుంది. ఈ సందర్భంలో మీ చర్మం, కళ్ళు పసుపు రంగులోకి మారుతాయి. శరీరం అలసిపోయినట్లు అనిపిస్తుంది. దురద మొదలవుతుంది. మూత్రం రంగు మరింత పసుపు రంగులోకి మారుతుంది. ఆకలి కూడా తగ్గుతుంది. అనేక సందర్భాల్లో రోగి కడుపులో తీవ్రమైన నొప్పి, వాపు వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఈ లక్షణాలన్నీ ఎవరికైనా కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం చేస్తే కాలేయం దెబ్బతింటుంది. ఎందుకంటే కాలేయం, కామెర్లకు సంబంధం ఉంటుంది. కామెర్లు వచ్చినట్లయితే అది మీ కాలేయాన్ని బలహీనపరుస్తుంది. కొన్నిసార్లు కాలేయం బలహీనత వల్ల కూడా కామెర్లు వస్తాయి.

కామెర్లు సాధారణంగా ఏడు నుండి 10 రోజులలో నయమవుతాయి. అయితే దీని కోసం దానిని గుర్తించి సకాలంలో చికిత్స చేయడం ఎంతో అవసరం. కామెర్ల లక్షణాలు ప్రారంభంలో గుర్తించినట్లయితే అది మందుల ద్వారా సులభంగా నయం చేసుకోవచ్చు. కానీ పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల సమస్య పెద్దదై ప్రాణాల మీదకే వస్తుంది. చాలా సందర్భాలలో ఈ కామెర్ల బారిన పడిన సమయంలో వైద్యులను సంప్రదించుకుండా సొంతంగా మందులు వేసుకోవడం ప్రారంభిస్తారు. కానీ అలా చేయకూడదు. ఎందుకంటే ఇది కాలేయానికి మరింత హాని కలిగించవచ్చు. కామెర్లు కారణంగా కాలేయంలో సమస్య ప్రారంభమైతే పరిస్థితి కూడా తీవ్రమవుతుంది.

 వేసవిలో ఈ విషయాలను గుర్తుంచుకోండి:

☛ బయట తినడం మానుకోండి

☛ వేయించిన ఆహారాలు, నిల్వ ఉన్న ఆహారాలను తినవద్దు

☛ స్వచ్ఛమైన నీరు తాగాలి

☛ హెపటైటిస్ వ్యాక్సిన్ పొందండి

☛ పరిశుభ్రతపై శ్రద్ధ వహించండి. చేతులు కడుక్కున్న తర్వాత మాత్రమే ఆహారం తీసుకోండి.

☛ అతిగా మద్యం సేవించవద్దు

(గమనిక: ఇందులోని అంశాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. వైద్య నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Eyes Care Tips: ఈ సమస్యలు కంటిచూపు కోల్పోయేందుకు కారణం కావచ్చు

Skin Cancer: అధిక సూర్యకాంతి వల్ల చర్మ క్యాన్సర్‌.. లక్షణాలు ఏమిటి? రక్షించుకునేందుకు చిట్కాలు!