Diet Plan: మీరు రోజూ ఏ సమయానికి భోజనం చేస్తున్నారు.. ఇలా చేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..

భోజనం విషయంలో చాలా మందికి ఓ సందేహం ఉంటుంది. మధ్యాహ్నం ఎక్కువ తినాలా, రాత్రి ఎక్కువ తినాలా అనే సందేహం కలగడం సహజం. సాధారణంగా డైటింగ్ చేసే వాళ్లు ఓ ప్లాన్ ప్రకారం ఆహారం తీసుకుంటారు. అయితే మిగిలిన వాళ్లు మాత్రం మంచి..

Diet Plan: మీరు రోజూ ఏ సమయానికి భోజనం చేస్తున్నారు.. ఇలా చేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..
Night Dinner
Follow us
Amarnadh Daneti

|

Updated on: Dec 09, 2022 | 9:40 PM

భోజనం విషయంలో చాలా మందికి ఓ సందేహం ఉంటుంది. మధ్యాహ్నం ఎక్కువ తినాలా, రాత్రి ఎక్కువ తినాలా అనే సందేహం కలగడం సహజం. సాధారణంగా డైటింగ్ చేసే వాళ్లు ఓ ప్లాన్ ప్రకారం ఆహారం తీసుకుంటారు. అయితే మిగిలిన వాళ్లు మాత్రం మంచి ఫుడ్ దొరికితే చాలు మద్యాహ్నం, రాత్రితో సంబంధం లేకుండా ఫుల్ గా లాంగిచేస్తారు. కాని రాత్రి సమయంలో మితంగా తినడమే మేలంటున్నారు డైటీషియన్స్. రాత్రి సమయాల్లో డిన్నర్ ను మితంగా తినడానికి ప్లాన్ చేసుకుంటే ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చని సూచిస్తున్నారు. రాత్రి సమయాల్లో ఎటువంటి ఆహారం తీసుకోవాలనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి. అయితే పిండి పదార్థాలను రాత్రి సమయాల్లో తినకపోవడమే మంచిది. అలాగే కొంతమంది బరువు తగ్గడం కోసం ప్రయత్నిస్తుంటారు. శారీరక వ్యాయామాలు చేసినా చాలా మంది బరువు తగ్గడం లేదని బాధపడుతుంటారు. ఒకవేళ మీరు వ్యాయమం, జిమ్ వంటివి చేస్తున్నా.. బరువు తగ్గడం లేదంటే మన డైట్ సరిగ్గా తీసుకోవడం లేదని అర్థం. డిన్నర్​ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే.. బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. బరువు మాత్రమే కాకుండా వివిధ ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే ప్రమాదముందంటున్నారు. రాత్రి పూట భోజనంలో క్రింది జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

స్వల్పంగా తీసుకోవాలి

అల్పాహారం, భోజనం కంటే రాత్రి భోజనం చాలా తక్కువుగా తీసుకోవాలి అంటున్నారు డైటీషన్లు. రాత్రి భోజనం లిమిట్​గా ఉండేలా చూసుకోమంటున్నారు. ఎందుకంటే రోజు చివరిలో మన జీవక్రియ చాలా మందగిస్తుంది కాబట్టి. ఈ సమయంలో అధిక కొవ్వు, ప్రోసెస్​ చేసిన ఆహారం తింటే.. అది జీర్ణమవ్వడానికి చాలా టైమ్ పడుతుంది. అంతేకాకుండా ఊబకాయం, షుగర్ వంటి వ్యాదుల బారిన పడే అవకాశం ఉంది.

వీలైనంత త్వరగా రాత్రి భోజనం

రాత్రి 8 గంటలకు ముందే డిన్నర్ చేయాలని చాలామంది డైటీషియన్లు సిఫార్సు చేస్తున్నారు. అంటే.. నిద్రపోవడానికి కనీసం 3 గంటల ముందు డిన్నర్ ముగించాలి. డిన్నర్ ఎప్పుడూ లైట్​గానే ఉండాలి. తొందరగా తినాలి కాబట్టి.. ముందుగానే ఫుడ్ రెడీగా ఉండేలా చూసుకోవాలి. ఆఫీస్​లో ఉన్నా.. ఇంట్లో ఉన్నా.. బయటకు వెళ్లినా తొందరగా డిన్నర్ ముగించేలా ప్లాన్ చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఎలాంటి ఆహారం తినాలి

రాత్రి భోజనంలో ఏమి తీసుకోవాలనే సందేహం చాలామందికి కలుగుతుంది. మొదటిది ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. వీలైతే వాటిని పూర్తిగా వదిలేయాలి. పిండి పదార్థాలను రాత్రి భోజనంలో తినకూడదు. పప్పులు, కూరగాయలు, తృణధాన్యాలు వంటి వాటిని తినవచ్చు. జున్ను, చేపలు, చికెన్ వంటి ప్రోటీన్లను తినవచ్చు. సలాడ్ కూడా తినొచ్చు. తద్వారా శరీరానికి ఫైబర్ అందుతుంది. ఇది పొట్టను శుభ్రంగా ఉంచడంలో సహాయంచేస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..