Hair Growth Foods: ఊడిన చోట జుట్టు మళ్లీ రావాలంటే.. ఈ గింజలను తింటే సరి..

|

Nov 24, 2022 | 8:08 AM

తమ జుట్టు న‌ల్ల‌గా, ఒత్తుగా ఉండాల‌ని కోరుకోనివారుండరు. జుట్టును అందంగా ఉంచుకోవ‌డానికి మ‌నం చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ కూడా ఉండ‌దు. కానీ ప్ర‌స్తుత కాలంలో జుట్టు రాల‌డం, బ‌ట్ట‌త‌ల వంటి స‌మ‌స్య‌లు..

Hair Growth Foods: ఊడిన చోట జుట్టు మళ్లీ రావాలంటే.. ఈ గింజలను తింటే సరి..
Haireal Issues
Follow us on

తమ జుట్టు న‌ల్ల‌గా, ఒత్తుగా ఉండాల‌ని కోరుకోనివారుండరు. జుట్టును అందంగా ఉంచుకోవ‌డానికి మ‌నం చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ కూడా ఉండ‌దు. కానీ ప్ర‌స్తుత కాలంలో జుట్టు రాల‌డం, బ‌ట్ట‌త‌ల వంటి స‌మ‌స్య‌లు సర్వసాధారణంగా మారిపోయాయి. ఈ సమస్యలు ఎదురవడానికి అనేక కార‌ణాలు ఉంటాయి. అయితే ఈ సమస్యలతో బాధపడేవారికి కనీసం రోజుకు వంద వెంట్రుక‌లు రాలిపోతూ ఉంటాయి. రాలిపోయిన వెంట్రుక‌ల‌ను స‌మానంగా కొత్త వెంట్రుక‌లు రాన‌ప్పుడు జుట్టు ప‌లుచ‌బ‌డుతుంది. అదే కొంతకాలానికి బట్టతలగా మారుతుంది. లేదా వ‌య‌సు పెరిగే కొద్ది కొత్త వెంట్రుక‌లు రావ‌డం త‌గ్గుతూ వచ్చి కొంత కాలానికి కొత్త వెంట్రుక‌లు రావ‌డం పూర్తిగా ఆగిపోతుంది. అలా మరి కొంత కాలానికి జుట్టు అంతా ఊడిపోయి బట్టతలగా మారుతుంది తల. కొంత మందికి బ‌ట్ట‌త‌ల వంశ‌పార‌ప‌ర్యంగా కూడా వ‌స్తుంది. ఒక‌సారి బ‌ట్ట‌త‌ల వ‌చ్చిన త‌రువాత మ‌నం ఎటువంటి ఆహారాలు తీసుకున్నా రాలిన జుట్టు స్థానంలో కొత్త జుట్టు రాదు. సాధ్య‌మైనంత వ‌ర‌కు జుట్టు రాల‌కుండా, రాలిన జుట్టు స్థానంలో కొత్త జుట్టు వ‌చ్చేలా చూసుకోవాలి.

జుట్టు రాల‌డానికి ప్ర‌ధాన కార‌ణాల్లో చుండ్రు కూడా ఒక‌టి. చుండ్రు ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల జుట్టు ఎక్కువ‌గా రాలుతుంది. అలాగే పోష‌కాహార లోపం వ‌ల్ల కూడా జుట్టు రాలుతుంది. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే మ‌నం ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. కానీ చాలా మంది పోష‌కాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవ‌డం లేదు. దీంతో పోష‌కాలు స‌రిగ్గా అంద‌క జుట్టు ఎక్కువ‌గా రాలుతుంది. జుట్టు రాల‌డానికి కార‌ణ‌మ‌య్యే చుండ్రు స‌మ‌స్య నుండి మ‌నం చాలా సుల‌భంగా బ‌య‌టప‌డ‌వ‌చ్చు. త‌ల‌స్నానం చేసేట‌ప్పుడు మ‌న వేళ్ల‌తో మాడును బాగా రుద్దాలి. అలాగే ప్ర‌తిరోజూ త‌ల‌స్నానం చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల కొద్ది రోజుల్లోనే చుండ్రు స‌మ‌స్య నుండి మ‌నకు ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది.

మ‌నం స్నానం ఎలా అయితే ప్ర‌తిరోజూ చేస్తామో త‌ల‌స్నానం కూడా అలాగే ప్ర‌తిరోజూ చేయాలి. దీంతో బ్యాక్టీరియ‌ల్ ఇన్ఫెక్ష‌న్ లు రాకుండా ఉంటాయి. జుట్టు కుదుళ్లు బ‌లంగా త‌యార‌వుతాయి. దుర‌ద‌, చుండ్రు వంటి స‌మ‌స్య‌లు తలెత్త‌కుండా ఉంటాయి. ఇక జుట్టు బాగా రావాలంటే ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉండే ఆహారాల్లో సోయాబీన్స్ ఒక‌టి. ఈ సోయాబీన్స్‌ను 12గంట‌ల పాటు నాన‌బెట్టి మ‌నం రోజూ తయారు చేసే వంట‌ల్లో వేసి తీసుకోవ‌చ్చు. అలాగే మొల‌కెత్తిన విత్త‌నాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ప్రోటీన్స్ ల‌భిస్తాయి. త‌గిన‌న్ని ప్రోటీన్స్ అంద‌డం వ‌ల్ల జుట్టు రాల‌డం త‌గ్గ‌డంతో పాటు రాలిన జుట్టు స్థానంలో కొత్త జుట్టు కూడా వ‌స్తుంది.

ఇవి కూడా చదవండి

మొల‌కెత్తిన విత్తనాల‌ను తిన‌డం వ‌ల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. సోయా బీన్స్ ను తిన‌లేని వారు ఈ మొలకెత్తిన విత్తనాల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన ప్రోటీన్స్ తో పాటు ఇత‌ర పోష‌కాలు కూడా మ‌న‌కు ల‌భిస్తాయి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల జుట్టు కుదుళ్లు బ‌లంగా త‌యార‌వుతాయి. జుట్టు రాల‌డం త‌గ్గ‌డంతో పాటు రాలిన జుట్టు స్థానంలో కొత్త వెంట్రుక‌లు వ‌స్తాయి. ఈ విధంగా ప్ర‌తిరోజూ త‌ల‌స్నానం చేస్తూ, మొల‌కెత్తిన విత్తనాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల స‌మ‌స్య‌లు త‌గ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి