Health Tips: చిన్న వయసులోనే కీళ్ల నొప్పులా..? ఈ ఆహారాలను తీసుకున్నారంటే సమస్యలన్నీ దూరం..

|

Sep 14, 2023 | 7:21 AM

Health Tips: గంటల తరబడి కుర్చోనే పనిచేయడం.. శారీరక చురుకుదనం లేకపోవడం కీళ్ల నొప్పులకు మరో కారణం. ఇక కీళ్ల నొప్పులతో బాధపడేవారు ఈ సమస్య నుంచి బయట పడాలంటే ఆహారంపై శ్రద్ధ వహించాలని, అలాగే ఎముకలను బలోపేతం చేయడంలో ఉపయోగపడే ఆహారాలను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే కొన్ని రకాల ఆహారాలను నిత్యం తీసుకోవాలని, వాటి ద్వారా నొప్పుల నుంచి బయట పడవచ్చని సూచిస్తున్నారు. మరి కీళ్ల నొప్పుల నుంచి..

Health Tips: చిన్న వయసులోనే కీళ్ల నొప్పులా..? ఈ ఆహారాలను తీసుకున్నారంటే సమస్యలన్నీ దూరం..
Arthritis
Follow us on

Health Tips: శరీరానికి కావాల్సిన పోషకాహారం తీసుకోకపోవడం, సరిపడని జీవనశైలి కారణంగా ప్రస్తుతం చాలా మంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. గతంలో కీళ్ల నొప్పులు రిటైర్ అయ్యే వయసు ఉన్నవారిలో మాత్రమే కనిపించేవి. కానీ ఇప్పుడు చిన్న వయసులోనే కీళ్ల నొప్పులతో బాధపడుతున్నవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. తీసుకునే ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం, పొటాషియం, ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్ లేకపోవడం కూడా ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. అలాగే గంటల తరబడి కుర్చోనే పనిచేయడం.. శారీరక చురుకుదనం లేకపోవడం కీళ్ల నొప్పులకు మరో కారణం. ఇక కీళ్ల నొప్పులతో బాధపడేవారు ఈ సమస్య నుంచి బయట పడాలంటే ఆహారంపై శ్రద్ధ వహించాలని, అలాగే ఎముకలను బలోపేతం చేయడంలో ఉపయోగపడే ఆహారాలను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే కొన్ని రకాల ఆహారాలను నిత్యం తీసుకోవాలని, వాటి ద్వారా నొప్పుల నుంచి బయట పడవచ్చని సూచిస్తున్నారు. మరి కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కోసం ఏయే ఆహారాలను తీసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం..

పాలకూర: పాలకూర శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలను కలిగిన ఒక సూపర్ ఫుడ్. ముఖ్యంగా పాలకూరలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, విటమిన్ డి, కాల్షియం అధికంగా ఉన్నందున, ఇది శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే బచ్చలికూర యువకుల్లోని ఆస్టియో ఆర్థరైటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

చేప: సముద్రపు చేపలలో ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నందున ఇవి వాపుతో పోరాడటానికి, కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి. అదనంగా ఎముకల ఆరోగ్యాన్ని అవసరమైర విటమిన్ డి కూడా సముద్రపు చేపల నుంచి లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

బాదం పప్పు: ఉదయాన్నే ఒక గుప్పెడు బాదం పప్పు తీసుకోవడం వల్ల వీటిల్లోని కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ ఇ, ప్రోటీన్, ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ నొప్పిని తగ్గిస్తాయి. అలాగే ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడతాయి.

వెల్లుల్లి: వెల్లుల్లిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వెల్లుల్లి శరీరంలో దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులను తగ్గించడంలో ఉపయోగపడతాయి. అలాగే ఆస్టియో ఆర్థరైటిస్ లక్షణాలను కూడా తగ్గిస్తాయి.

సిట్రస్ పండ్లు: శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి సిట్రస్ పండ్లు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. వీటిల్లోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఆర్థరైటిస్ వాపు, కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి.

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..