AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిన్న చిన్న ఆకులు.. ఇవేం చేస్తాయ్ అనుకునేరు.. వందలాది వ్యాధులకు మొనగాడి మెడిసిన్

ప్రస్తుత కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు మంచి ఆహారాన్ని తీసుకోవడం, అలాగే.. ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంభించడం ముఖ్యం.. అయితే.. అలాంటి మంచి ఆహారాల్లో మన పెరట్లో పెరిగే మునగ ఒకటి.. మునగ చెట్టును ఇంటి ముందు.. చిన్న స్థలంలో కూడా సులభంగా పెంచుకోవచ్చు.. మునగ కాయ మాత్రమే కాదు.. దాని ఆకులు కూడా తినడానికి చాలా రుచికరంగా ఉంటాయి.

చిన్న చిన్న ఆకులు.. ఇవేం చేస్తాయ్ అనుకునేరు.. వందలాది వ్యాధులకు మొనగాడి మెడిసిన్
Drumstick Leaves Benefits
Shaik Madar Saheb
|

Updated on: Jul 15, 2025 | 3:37 PM

Share

ప్రస్తుత కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు మంచి ఆహారాన్ని తీసుకోవడం, అలాగే.. ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంభించడం ముఖ్యం.. అయితే.. అలాంటి మంచి ఆహారాల్లో మన పెరట్లో పెరిగే మునగ ఒకటి.. మునగ చెట్టును ఇంటి ముందు.. చిన్న స్థలంలో కూడా సులభంగా పెంచుకోవచ్చు.. మునగ కాయ మాత్రమే కాదు.. దాని ఆకులు కూడా తినడానికి చాలా రుచికరంగా ఉంటాయి. మునగ కాయతోపాటు.. మునగ ఆకుల్లో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. ముఖ్యంగా మునగ ఆకుల్లో యాంటీఆక్సిడెంట్లు, క్లోరోఫిల్, విటమిన్ సి, ప్రోటీన్, కాల్షియం మొదలైన శరీరానికి అవసరమైన అనేక పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి.. అందుకే.. ఈ ఆకులను పోషకాల నిధిగా పేర్కొంటారు..

మునగాకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఇది విటమిన్లు, ఖనిజాలు.. యాంటీఆక్సిడెంట్ల మంచి వనరు. మునగాకు రక్తపోటును నియంత్రించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుందని.. ఇంకా, ఇది నొప్పిని తగ్గించడానికి, చర్మం.. జుట్టును సంరక్షించడానికి కూడా ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

ఇలా.. అనేక పోషకాలతో నిండిన మునగాకులను మన రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల మధుమేహం, అధిక బిపి, గుండె జబ్బులు, కంటి సమస్యలు, ఆర్థరైటిస్ వంటి ఆరోగ్య సమస్యల నుండి మనల్ని దూరంగా ఉంచవచ్చని చెబుతున్నారు. అయితే.. మునగాకు ప్రధానంగా ఏ తీవ్రమైన ఆరోగ్య సమస్యల నుండి మనల్ని దూరంగా ఉంచుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

డయాబెటిస్:

మునగాకులను డయాబెటిస్ ఉన్నవారికి దేవుడిచ్చిన వరంలా భావిస్తారు. దీని యాంటీ-డయాబెటిక్ లక్షణాలు శరీరంలో రక్తంలో చక్కెరను తగ్గించడంలో.. చక్కెరను నియంత్రణలో ఉంచడంలో ప్రభావవంతమైన సహజ ఔషధంగా పనిచేస్తాయి.

అధిక రక్తపోటు:

మునగాకుల్లో పొటాషియం పుష్కలంగా లభిస్తుంది. ఇది రక్త నాళాలు సరిగ్గా పనిచేయడానికి సహాయపడటం ద్వారా అధిక రక్తపోటును నియంత్రించడంలో ప్రయోజనకరంగా ఉంటుందని నిరూపించబడింది.

క్యాన్సర్ వంటి తీవ్ర వ్యాధులను నియంత్రిస్తుంది:

పాలకూరలో యాంటీఆక్సిడెంట్లు, జింక్, విటమిన్ సి వంటి ముఖ్యమైన పోషకాలు ఉన్న మునగాకును తినడం వల్ల క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులను నివారించవచ్చు. క్యాన్సర్ రోగులు దీనిని తినడం ద్వారా క్యాన్సర్ కణాలతో సమర్థవంతంగా పోరాడవచ్చు.

జీర్ణవ్యవస్థ బాగుంటుంది:

మునగాకులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల, దాని వినియోగం జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది పొట్టలో పుండ్లు, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..