- Telugu News Photo Gallery These are the health benefits of eating Bodakakara during the monsoon season
చిన్నగా ఉందనుకోకండి.. వర్షకాలంలో బోడకాకరతో బోలెడు లాభాలు!
బోడ కాకరకాయ తెలియని వారు ఎవరుంటారు చెప్పండి. వీటితో కర్రీ వండితే ఉండే టేస్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే బోడ కాకర కర్రీతో రుచి మాత్రమే కాదండోయ్, అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట. కాగా, వర్షాకాలంలో బోడకాకర కాయ తినడం వలన ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
Updated on: Jul 15, 2025 | 12:06 PM

ఈ కాయలో ఉండే ఫ్లావనాయిడ్లు, టానిన్లు శరీరంలో విషపదార్థాలను.. పూర్తిగా తొలగించడంలో సహకరిస్తాయి. అందుకే క్యాన్సర్ వంటి వ్యాధుల నుంచి కూడా ఈ కాయ తినడం ద్వారా నిరోధించుకోవచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కాయలో.. విటమిన్ C, ఐరన్, జింక్ లాంటి పోషకాలు అధికంగా ఉంటాయి. అలానే క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళకి.. ఈ కూరగాయ మంచి ఆప్షన్.

బోడ కాకరలో శరీరానికి కావాల్సిన అనేక పోషకాలు లభిస్తాయి. విటమిన్స్,అమైనో ఆమ్లాలు, ప్లేవనాయిడ్స్, పోటాషియం, ఫాస్పరస్, ఇవన్నీ ఉంటాయి. అందుకే వర్షకాలంలో తప్పకుండా వీటిని తినాలంటారు. అదే విధంగా డయాబెటీస్ ఉన్న వారు వర్షాకాలంలో బోడ కాకర కాయను తినడం వల ఇది రక్తంలోని చక్కర స్థాయిలను నియంత్రిస్తుందంట. ఇందులో గ్లైసెమిక్ ఎక్కువగా ఉండటం వలన ఇది డయాబెటీస్ రోగులకు చాలా మేలు చేస్తుందంట.

అదేవిధంగా బోడకాకరలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. అలాగే ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, ఫాస్పరస్ వంటివి ఎక్కువ మోతాదులో ఉంటాయి. అందు వలన బోడ కాకరను తినడం వలన క్యాన్సర్ వంటి సమస్యలు దరి చేరవంట. అంతే కాకుండా ఇది రక్త పోటు ప్రమాదాన్ని తగ్గించి, గుండె సమస్యలు రాకుండా చేస్తుందంట.

బోడ కాకరకాయ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.. ముఖ్యంగా ఇందులో ఉండే అధిక ఫైబర్ జీర్ణ క్రియను మెరుగుపరచడమే కాకుండా.. అజీర్తి గ్యాస్ లాంటి సమస్యలను మన నుంచి దూరం చేస్తుంది. ఈ కాయలో ఉండే పోటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాల వల్ల.. మన శరీరంలో రక్తపోటు స్థిరంగా ఉంచుతుంది. కాబట్టి హై బీపీ ఉన్నవాళ్లు ఈ కాయను కనీసం వారానికి మూడుసార్లు తినడం మంచిది.

బరువు తగ్గాలి అనుకునే వారికి కూడా బోడ కాకర చాలా మంచిదంట. దీనిని ప్రతి రోజూ తినడం వలన ఇది బరువును నియంత్రిస్తుందంట. ఎందుకంటే? బోడ కాకరలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. అందువలన దీనిని ప్రతి తీరోజూ తీసుకుంటే, ఇది కడుపు నిండిన భావన కలిగి అధిక ఆకలిని నియంత్రిస్తుంది. జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది.



