ఆహారం తిన్న తర్వాత షుగర్ పెరిగిపోతుందా? మీ కోసం 10 రూపాయల చిట్కా
కొందరికి ఏదైనా ఆహారం తిన్న వెంటనే షుగర్ పెరిగిపోతూ ఉంటుంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఇప్పుడు ఓ చౌకైన పూర్వకాలం నాటి చిట్కాను తెలుసుకుందాం. సాధారణంగా ఉపయోగించే బాదం రెసిన్ శరీర వేడిని తగ్గించడంలో సహాయపడటంతోపాటు డయాబెటిస్‌ను నియంత్రిస్తుంది. సరైన రీతిలో ఈ పదార్థాన్ని తీసుకుంటే ఇన్సులిన్ పనితీరును నియంత్రిస్తుందని పోషకాహార నిపుణులు కూడా చెబుతున్నారు.

ఇటీవల కాలంలో డయాబెటిస్ (మధుమేహం) బారిన పడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా చాలా మంది ఈ వ్యాధి బారినపడుతున్నారు. దీంతో వైద్యులు సూచించిన మందులు, డైట్ ఫాలో అవుతుంటారు. అయితే, కొందరికి ఏదైనా ఆహారం తిన్న వెంటనే షుగర్ పెరిగిపోతూ ఉంటుంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఇప్పుడు ఓ చౌకైన పూర్వకాలం నాటి చిట్కాను తెలుసుకుందాం. సాధారణంగా ఉపయోగించే బాదం రెసిన్ శరీర వేడిని తగ్గించడంలో సహాయపడటంతోపాటు డయాబెటిస్‌ను నియంత్రిస్తుంది. సరైన రీతిలో ఈ పదార్థాన్ని తీసుకుంటే ఇన్సులిన్ పనితీరును నియంత్రిస్తుందని పోషకాహార నిపుణులు కూడా చెబుతున్నారు.
ఎలా తినాలి?
ప్రతి రాత్రి పడుకునే ముందు ఒకటి లేదా రెండు చిన్న బాదం రెసిన్ ముక్కల(బాదం పేస్ట్/గుజ్జు)ను ఒక గ్లాసు నీటిలో నానబెట్టాలి. ఉదయం లేచినప్పుడు బాగా తడిసిపోయి.. గిన్నె జెల్ లాగా నిండుగా ఉంటుంది. ఆ జెల్‌ను ఒక చెంచా తీసుకుని ఒక గ్లాసు నీటిలో కలిపి ఖాళీ కడుపుతో త్రాగండి.
మరిన్ని ప్రయోజనాలు.. బాదం రెసిన్ (బాదం పిసిన్ లేదా ఆల్మండ్ గమ్) అనేది బాదం చెట్టు బెరడు నుంచి లభించే సహజ జిగురు. దీనిని నానబెట్టి తింటే శరీరాన్ని చల్లబరుస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, ఎముకలను బలపరుస్తుంది, శక్తినిస్తుంది.
అలాగే, మధ్యాహ్నం, రాత్రి భోజనం ముందు 30 నిమిషాలకి ఇదే విధంగా తాగితే మంచి ఫలితం వస్తుంది. ఇది ఆహారంలోని చక్కెర రక్తంలోకి చేరే వేగాన్ని తగ్గిస్తుంది. కేవలం ఇది తీసుకోవడం మాత్రమే సరిపోదు. మన జీవనశైలిలో కూడా చిన్న మార్పులు చేయాలి. మనలో చాలా మంది భోజనం చేసిన వెంటనే సోఫా/కుర్చీలో కూర్చుంటారు. ఇది పెద్ద తప్పు.
ప్రతి భోజనం తర్వాత కనీసం 10 నిమిషాలు నడవాలి. భోజనం తర్వాత నడిస్తే రక్తంలో చక్కెర పెరుగుదలను 30% వరకు తగ్గించవచ్చు.
ఒత్తిడి (Stress) ని తగ్గించాలి
ఎన్ని మందులు తీసుకున్నా కూడా మనస్సు ప్రశాంతంగా లేకపోతే శరీరం కార్టిసాల్ విడుదల చేస్తుంది. దాని వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. ఉదయం లేదా రాత్రి ప్రాణాయామం / యోగా చేయడం చాలా అవసరం. ఇది మనస్సు ప్రశాంతంగా చేస్తుంది, మంచి నిద్ర కూడా ఇస్తుంది.
బాదం రెసిన్, నడక, యోగా వంటి సహజ మార్గాలను మన దైనందిన జీవితంలో భాగం చేసుకుంటే.. డయాబెటిస్ గురించి ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు. ముందుగా వైద్యులు సూచించిన మందులు తీసుకుంటూనే.. ఈ సహజ పద్ధతులు మీ ఆరోగ్యానికి అదనపు బలం ఇవ్వడంలో సహాయపడతాయి.
