AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిల్లల ఆరోగ్యంపై ఫ్యాటీ లివర్ ఎఫెక్ట్.. డాక్టర్ ఏం చెబుతున్నారో తెలుసా..?

ప్రస్తుత రోజుల్లో పిల్లల్లో ఫ్యాటీ లివర్ సమస్య ప్రీ బుకింగ్ చేసుకున్నట్లుగా వేగంగా పెరుగుతోంది. ఇది కేవలం పెద్దలకే వస్తుందనుకుంటే పొరపాటే అని వైద్యులు గట్టిగా చెబుతున్నారు. స్వీట్ డ్రింక్స్, ప్యాక్డ్ ఫుడ్స్ ఎక్కువగా తినడం, కూర్చున్న చోటు నుంచే కదలకుండా ఉండటం మెయిన్ రీసన్స్. అయితే మన లైఫ్ స్టైల్‌లో చిన్న చిన్న మార్పులు చేస్తే ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టవచ్చని నిపుణులు అంటున్నారు. మరి మన పిల్లల లివర్‌ను సూపర్ హెల్దీగా ఉంచేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పిల్లల ఆరోగ్యంపై ఫ్యాటీ లివర్ ఎఫెక్ట్.. డాక్టర్ ఏం చెబుతున్నారో తెలుసా..?
Fatty Liver Issues In Kids
Prashanthi V
|

Updated on: Aug 11, 2025 | 1:48 PM

Share

ప్రతి ముగ్గురిలో ఒకరికి ఫ్యాటీ లివర్ సమస్య ఉందని మీకు తెలుసా..? ఇది ఇప్పుడు పెద్దలకే కాకుండా.. పిల్లలకు కూడా వస్తోంది అని డాక్టర్ కారుణ్య హెచ్చరిస్తున్నారు. పిల్లల్లో ఈ సమస్య పెరగడానికి గల కారణాల గురించి డాక్టర్ కారుణ్య ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎప్పుడూ స్క్రీన్లకే అతుక్కుపోవడం, కదలకుండా ఉండటం, అలాగే మార్కెట్లో దొరికే స్వీట్ డ్రింక్స్, ప్రాసెస్డ్ స్నాక్స్ ఎక్కువగా తినడం వంటి అలవాట్లు లివర్‌ పై ఒత్తిడి పెడతాయని డాక్టర్ కారుణ్య చెబుతున్నారు. ఈ ఆహారంలో ఉండే అధిక ఫ్రక్టోజ్, హానికరమైన కొవ్వులు లివర్‌లో పేరుకుపోయి.. భవిష్యత్తులో ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని డాక్టర్ కారుణ్య విశ్లేషిస్తున్నారు.

అయితే మంచి విషయం ఏంటంటే.. సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ పరిస్థితిని పూర్తిగా రివర్స్ చేయవచ్చని డాక్టర్ కారుణ్య అంటున్నారు. ఈ మార్పుల గురించి డాక్టర్ కారుణ్య కొన్ని సూచనలు ఇచ్చారు. ఆ సూచనల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

  • డ్రింక్స్.. సోడాలు, బాటిల్ డ్రింక్స్ బదులు ఇంట్లో తయారు చేసిన ఆరోగ్యకరమైన డ్రింక్స్ లేదా మంచినీళ్లు ఇవ్వాలని డాక్టర్ కారుణ్య సలహా ఇస్తున్నారు.
  • ఫుడ్.. బయట ఫాస్ట్‌ ఫుడ్‌కు బదులుగా ఇంట్లో చేసిన తాజా భోజనానికి ప్రాధాన్యత ఇవ్వమంటున్నారు.
  • వ్యాయామం.. రోజూ కనీసం 30 నిమిషాలు ఆడుకోవడానికి లేదా శారీరక వ్యాయామం చేయడానికి పిల్లలను ప్రోత్సహించాలని డాక్టర్ చెబుతున్నారు.
  • స్క్రీన్ టైమ్.. వీడియో గేమ్స్, టీవీ చూడటం వంటి వాటికి బదులు శారీరక శ్రమతో కూడిన ఆటల్లో పాల్గొనేలా చేయమంటున్నారు.

ఈ చిన్న మార్పులు వారి లివర్‌ ను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా.. వారి భవిష్యత్తును కూడా సురక్షితంగా మారుస్తాయని డాక్టర్ కారుణ్య చెబుతున్నారు.