ఆహారం లేకుండా ఉంటారేమో కానీ.. సరైన నిద్ర లేకపోతే మాత్రం మనిషి మనిషిలో ఉండడు. సాధారణంగా ఒక రోజు సరిగ్గా నిద్ర లేక పోతేనే తల నొప్పి, కళ్లు తిరగడం, వికారంగా, నీరసంగా ఉంటుంది. అలాంటి కంటిన్యూగా నిద్ర సరిగ్గా పోకపోతే మాత్రం ఆ మనిషి ఎక్కువగా కాలం బ్రతకడని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎంతటి ఒత్తిడినైనా తట్టుకుని నిలబడాలంటే నిద్ర అవసరం. రోజంతా చేసిన శ్రమ, ఒత్తిడి, శరీరం రీయాక్టీవ్ అవ్వాలంటే ఖచ్చితంగా నిద్ర పోవాల్సిందే. నిద్ర పోవడం వల్ల శారీరకంగా, మానసికంగా పలు అనారోగ్య సమస్యల నుంచి దూరం చేసుకోవచ్చు.
8 గంటలు నిద్ర అవసరం:
రాత్రి అయినా పగలైన 8 గంటలు నిద్ర అవసరం అని అనుకుంటారు. దీంతో ఎప్పుడో ఒక కునుకు తీసి నిద్ర సమయాన్ని లెక్కిస్తారు. ఇది అస్సలు సరికాదంటున్నారు నిపుణులు. రాత్రిలో పడుకున్న నిద్రే అతి ముఖ్యమని చెబుతున్నారు. ఇదే రొటీన్ ని కొనసాగిస్తే మాత్రం దీర్ఘకాలికంగా పలు సమస్యల్ని
కళ్లు మూసుకుని రిలాక్స్ అవ్వొచ్చు:
సాధారణంగా అప్పుడప్పుడు కంటిన్యూగా వర్క్ చేసేటప్పుడు శరీరానికి, మనసుకు రెస్ట్ అవసరం. ఇలాంటప్పుడు కొంచెం సేపు కళ్లు మూసుకుని రిలాక్స్ అవ్వాలి. అయితే అది నిద్రకు సమానం కాదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే మనం నిద్రలో ఉన్నప్పుడు, మెలకువతో ఉన్నప్పుడు.. శరీర అవయవాల పని తీరు వేరు వేరుగా ఉంటుంది. సాధారణంగా విశ్రాంతి తీసుకోవడం కంటే నిద్రపోయినప్పుడు మన మెదడు మరింత రిలాక్స్ అయ్యి.. ఆలోచనా సామర్థ్యం, నిర్ణయాలు తీసుకునే సమర్థత పెరుగుతుందని నిపుణులు తెలుపుతున్నారు.
బెడ్ లైట్ లో నిద్ర పోవడం మంచిదేనా:
సాధారణంగా ఎవ్వరి ఇంట్లో అయినా బెడ్ లైట్ ఉండటం అనేది సర్వ సాధారణం. కొంత మందికి బెడ్ లైట్ ఉంటేనే నిద్ర పడుతుంది. బెడ్ లైట్ లో పడుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు అనుకుంటారు. కానీ వెలుతురులో పడుకోవడం వల్ల పదే పదే మెలకువ అనేది వస్తుంది. ఆ తర్వాత మళ్లీ నిద్ర పట్టక పోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అంతే కాకుండా టీవీ వెలుతురులో, లైట్ వెలుతురులో నిద్ర పోయే లేడీస్ క్రమంగా బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వీలైనంత వరకూ బెడ్ లైట్ లేకుండా నిద్ర పోవడమే మంచిదని అంటున్నారు.
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.