ఆకలిగా అనిపించడం లేదా ? అయితే ఈ చిట్కాలతో ఆకలిని పెంచుకోవచ్చు.. ఎలాగంటే..

|

Aug 03, 2021 | 1:11 PM

సాధారణంగా చాలా మందికి ఎక్కువగా ఆకలి వేయదు. ఆహారం తిని గంటలు గడుస్తున్న ఆకలి అనిపించదు. మారిన జీవనశైలీతోపాటు.

ఆకలిగా అనిపించడం లేదా ? అయితే ఈ చిట్కాలతో ఆకలిని పెంచుకోవచ్చు.. ఎలాగంటే..
Health Tips
Follow us on

సాధారణంగా చాలా మందికి ఎక్కువగా ఆకలి వేయదు. ఆహారం తిని గంటలు గడుస్తున్న ఆకలి అనిపించదు. మారిన జీవనశైలీతోపాటు.. సమయానికి ఆహారం తినాలనిపించదు. వాసన, ఆహారాన్ని చూసిన తర్వాత కూడా చాలామందికి ఆకలి అనిపించదు. దీంతో కడుపు సమస్యలు, అసిడిటీ.. బలహీనత వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇందుకోసం ప్రతిసారి డాక్టర్‏ను సంప్రదించాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో ఉండే కొన్ని కొన్ని చిట్కాలతో ఈ సమస్యను అధిగమించవచ్చు. అవెంటో తెలుసుకుందామా.

త్రిఫల చూర్ణం..
త్రిఫల చూర్ణం అనేక సమస్యలకు దివ్యౌషధం. మలబద్దకం సమస్య ఉన్నవారు దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు. అలాగే ఆకలిగా అనిపించకపోతే.. త్రిఫల చూర్ణాన్ని తీసుకోవడం వలన ఫలితం కనిపిస్తుంది. గోరువెచ్చని పాలలో ఒక టీస్పూన్ త్రిఫల పొడిని కలిపి తీసుకోవడం వలన ఆకలి వేస్తుంది.

గ్రీన్ టీ..
ఆకలిని పెంచడానికి గ్రీన్ టీ మంచి హోం రెమెడీగా ఉపయోగపడుతుంది. దీనిని రోజూ తీసుకోవడం వలన అనేక వ్యాధులను నియంత్రించవచ్చు. ఉదయం, సాయంత్రం టీకి బదులుగా గ్రీన్ టీ తీసుకోవడం మంచింది. అలాగే చలికాలంలో ఎక్కువగా గ్రీన్ టీ తాగేందుకు ఆసక్తి చూపుతారు.

నిమ్మరసం
వేసవి కాలంలో శరీరానికి తగినంత పరిమాణంలో నీరు అవసరం. అలాగే ఇది ఆకలిని కూడా పెంచుతుంది, శరీరాన్ని హైడ్రేట్‏గా ఉంచుతుంది. నిమ్మరసం నీటిని రోజూ తీసుకోవడం వలన ఆకలిగా అనిపిస్తుంది.

విత్తనాలు..
విత్తనాల వలన ఆరోగ్యానికి ప్రయోజనాలు అధికంగానే ఉంటాయి. కడుపు సంబంధిత సమస్యలతోపాటు.. అజీర్ణం, ఆకలి వేయకపోవడం వంటి సమస్యలను నియంత్రిస్తాయి. వీటిని తీసుకోవడం వలన కడుపు నిత్యం శుభ్రంగా ఉంటుంది. ఆకలి అనిపించకోపోయినా.. రోజు ఒకటి రెండు సార్లు తినడం మంచిది.

జ్యూస్..
ఆకలి అనిపించకపోతే.. ఏమి తినాలని లేని సమయంలో ఏవైనా పండ్ల రసాలు తాగడం మంచిది. వీటిలో ఉప్పు, లేదా రాతి ఉప్పు వేసి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వలన కడుపు శుభ్రంగా ఉండడమే కాకుండా ఆకలిగా అనిపిస్తుంది.

Also Read:

Kalyani Menon: సినీ పరిశ్రమలో మరో విషాదం.. సింగర్ కళ్యాణి మీనన్ మృతి..

Aham Brahmasmi: ‘అహం బ్రహ్మస్మి’ కోసం రంగంలోకి మరో హీరో.. కీలక పాత్రలో అల్లరి నరేష్..

థియేటర్‏లలో మళ్లీ సినిమాల సందడి.. ఒకేరోజు ఐదు చిత్రాలు విడుదల..