ఇంట్లో చంటి పిల్లలు ఉంటే.. ఇల్లు ఇల్లుగా ఉండదు. ఇల్లు పీకి పందిరి వేస్తారు. ఏ వస్తువూ పెట్టిన చోట ఉండదు. ఒక్కటి వారికి ఏది నచ్చితే వాటితోనే ఆడుతూంటారు. అందులోనూ ఇక నడిచే పిల్లలు ఉంటే వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంట్లోని వంట సామానుతో ఆడుకుంటూ నానా రచ్చ చేస్తారు. పిల్లలు ఎక్కువగా కిచెన్ సామానుతోనే ఆడుకుంటూ ఉంటారు. ప్లేట్లు, గ్లాసులు, కూరగాయలు ఇలా ఏది వారి కంటికి బాగా కనిపిస్తుంటే వాటితోనే ఆడుతూ చిందరవందరగా చేస్తారు. అయితే కొంత మంది తల్లిదండ్రులు మాత్రం పిల్లల చేతిలో నుంచి వారి చేతిలో నుంచి బలవంతంగా లాగేసుకుంటారు. కానీ పిల్లలు కిచెన్ వస్తువులతో ఆడితేనే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి పిల్లలు కిచెన్ వస్తువులతో ఆడితే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
పిల్లలు కిచెన్ కి సంబంధించిన సామాన్లు, వస్తువులు, కూరగాయలతో ఆడుతూ ఉంటే వారిలో.. కమ్యునికేషన్ స్కిల్స్ అనేవి బాగా పెరుగుతాయి. కిచెన్ లోని పాత్రల పేర్లు చెప్పడం వల్ల వారికి త్వరగా మాటలు రావడమే కాకుండా.. వాటి గురించి కూడా తెలుసుకుంటారు.
చిన్నారులు కిచెన్ పాత్రలు, వస్తువులతో ఆడుకోవడం వల్ల వారిలో మోటార్ స్కిల్స్ పెరుగుతాయి. మోటార్ స్కిల్స్ అంటే.. పిల్లల చేతులు, మణికట్టులోని చిన్న కండరాలు కూడా కదులుతాయి. వీటి వల్ల పిల్లల కండరాలు దృఢంగా మారతాయి. కాబట్టి చిన్నారిలో మోటార్ నైపుణ్యాలు మెరుగు పరచడం చాలా ముఖ్యం.
చిన్న పిల్లలు కిచెన్ పాత్రలు, వస్తువులతో ఆడటం వల్ల.. భవిష్యత్తులో అవి వారి చదువులో సహాయ పడుతుందని నిపుణులు అంటున్నారు. అంతే కాకుండా పిల్లలు ఫిజిక్స్, సైన్స్, మ్యాథ్స్ వంటి సబ్జెక్ట్స్ స్కిల్స్ ను కూడా నేర్చుకునేందుకు సహాయ పడతాయి. కాబట్టి పిల్లల్ని కిచెన్ సామానుతో ఆడుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.
చిన్న పిల్లలు కిచెన్ సామాన్లతో ఆడుకోవడం వల్ల.. వారిలో ఇంద్రియాలు కూడా అభివృద్ధి చెందుతాయి. వారి చేతులతో వివిధ రకాల పాత్రలు, వస్తువులు, లోహాలు తాకినప్పుడు వారిలో ఇందియ అభివృద్ధికి హెల్ప్ చేస్తుంది. అంతే కాకుండా వాటి గురించి చెప్పడం వల్ల కూడా పిల్లలు వాటిని చక్కగా గుర్తు పెట్టుకుంటారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.