Health Tips: బెడ్ మీద నుంచే ఆఫీసు పనులు చేస్తున్నారా? ఎన్ని అనారోగ్య సమస్యలు వస్తాయో మీకు తెలుసా!

కరోనా వైరస్ ప్రభావంతో వర్క్ ఫ్రమ్ హోమ్స్ అనేవి ఎక్కువయ్యాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చాక చాలా మంది ఇళ్ల నుంచే పని చేయడాన్ని ఇష్ట పడుతున్నారు. ఆఫీసులో అయితే సపరేట్ గా కాబిన్ ఉంటుంది. కానీ ఎక్కువ మంది మంచం పై నుంచి వర్క్ చేస్తున్నారు. మంచి మీద నుంచి చేయడం సౌకర్య వంతంగా ఉన్నా కూడా.. దీంతో ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా కళ్ల సమస్యలు, మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశాలు..

Health Tips: బెడ్ మీద నుంచే ఆఫీసు పనులు చేస్తున్నారా? ఎన్ని అనారోగ్య సమస్యలు వస్తాయో మీకు తెలుసా!
Work From Bed

Edited By:

Updated on: Sep 26, 2023 | 11:30 PM

కరోనా వైరస్ ప్రభావంతో వర్క్ ఫ్రమ్ హోమ్స్ అనేవి ఎక్కువయ్యాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చాక చాలా మంది ఇళ్ల నుంచే పని చేయడాన్ని ఇష్ట పడుతున్నారు. ఆఫీసులో అయితే సపరేట్ గా కాబిన్ ఉంటుంది. కానీ ఎక్కువ మంది మంచం పై నుంచి వర్క్ చేస్తున్నారు. మంచి మీద నుంచి చేయడం సౌకర్య వంతంగా ఉన్నా కూడా.. దీంతో ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా కళ్ల సమస్యలు, మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. బెడ్ మీద నుంచి చేసేవారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మంచం మీద నుంచి వర్క్ చేస్తే ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

సౌకర్యవంతంగా ఉండకపోవడం:

బెడ్ మీద నుంచి వర్క్ చేస్తూంటారు కానీ.. సౌకర్యవంతంగా ఉందా.. లేదా.. అన్న విషయాన్ని గమనించరు. బెడ్ మీద ఉండి వర్క్ చేయాలంటే మెడ, నడుము భాగాలు వంచాల్సి ఉంటుంది. గంటలు గంటలు అలా ఉండి పనిచేయాలంటే చాలా కష్టం. దీని వల్ల నడుము నొప్పి, మెడ పట్టేయడం, తల నొప్పి వంటివి వస్తూంటాయి.

ఇవి కూడా చదవండి

కళ్ల సమస్యలు:

మంచ మీద నుంచి చేయడం వల్ల కళ్లు దగ్గరగా పెట్టి చూడాల్సి వస్తుంది. కళ్లపై ఒత్తిడి కూడా పెరుగుతుంది. దీంతో కళ్ల సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది:

మంచం మీద నుంచి పని చేయడం వల్ల వ్యక్తిగత జీవితంపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఎక్కువ సేపు పని మీద దృష్టి పెట్టడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. దీంతో శరీరానికి కావాల్సినంత రెస్ట్ దొరకదు. కాబట్టి మానసిక ఆరోగ్యంపై ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయి.

ఏకాగ్రత ఉండదు:

వర్క్ చేయడానికి సపరేటుగా స్పేస్ అంటూ ఉండాలి. బెడ్ మీద నుంచి వర్క్ చేయాలంటే ఏకాగ్రత నశిస్తుంది. ఇది కాస్త బద్ధకంగా మార్చేందుకు కారణం అవుతుంది. దీంతో వర్క్ లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా పని మధ్యలో నిద్ర పోయే అవకాశాలు ఉన్నాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.