Milk Substitutes: పాలు తాగడం ఇష్టం లేదా..? అయితే.. ఈ ఏడు పదార్థాలను రెగ్యులర్‌గా తీసుకోండి..

|

Aug 01, 2022 | 6:38 AM

సాధారణంగా పాలు అంటే ఇష్టపడని వారు పెద్ద సంఖ్యలో కనిపిస్తారు. పాలు పిల్లలకు మాత్రమే అని కొందరు అనుకుంటారు.. కానీ పెద్ద వారికి కూడా అవసరమే.

Milk Substitutes: పాలు తాగడం ఇష్టం లేదా..? అయితే.. ఈ ఏడు పదార్థాలను రెగ్యులర్‌గా తీసుకోండి..
Milk
Follow us on

Calcium rich foods: ఆరోగ్యంగా ఉండేందుకు పలు రకాల ఆహార పదార్థాలను తప్పనిసరిగా తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తుంటారు. అలాంటి ఆహార పదార్థాలల్లో పాలు ఒకటి.. పాలలో ఎన్నో పోషకాలు దాగున్నాయి. ప్రొటిన్, కాల్షియం అధికంగా ఉన్నాయి. అయితే.. సాధారణంగా పాలు అంటే ఇష్టపడని వారు పెద్ద సంఖ్యలో కనిపిస్తారు. పాలు పిల్లలకు మాత్రమే అని కొందరు అనుకుంటారు.. కానీ పెద్ద వారికి కూడా అవసరమే. కారణం ఏదైనా కావొచ్చు.. కాల్షియం పదార్థాలను తీసుకుంటేనే శరీరానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. శరీరంలో కాల్షియం లోపం ఉంటే.. ఎముకలు బలహీనపడతాయి. ఇంకా ఎన్నో ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఇలాంటి సందర్భంలో పాలు ఇష్టం లేకపోతే కొన్ని పదర్థాలతో కాల్షియం లోపాన్ని తీర్చుకోవచ్చని పేర్కొంటున్నారు. అవేంటో చూడండి..

ఈ ఆహారాలు కాల్షియం లోపాన్ని తీరుస్తాయి

  • బాదం
  • నువ్వులు
  • సోయా పాలు
  • వోట్మీల్
  • ఆరెంజ్
  • బీన్స్
  • ఆకు కూరలు

ఏ వయస్సులో ఎంత కాల్షియం అవసరం?

ఇవి కూడా చదవండి
  1. వయస్సు, లింగం ప్రకారం ప్రతి వ్యక్తి శరీరంలో కాల్షియం అవసరం భిన్నంగా ఉంటుంది. ఇందులో ప్రధానంగా 500 నుంచి 2000 mg కాల్షియం అవసరం ఉంటుంది.
  2. పిల్లలు వారి రోజువారీ ఆహారం నుంచి మిల్లీగ్రాముల కాల్షియం పొందాలి.
  3. యువకుడికి ప్రతిరోజూ 700 నుంచి 100 mg కాల్షియం అవసరం.
  4. గర్భిణీ స్త్రీ అయితే ఆమెకు ప్రతి రోజు 1000 mg నుంచి 1200 mg కాల్షియం అవసరం అవుతుంది.
  5. అథ్లెట్లు, పాలిచ్చే మహిళలకు ప్రతిరోజూ 2000 mg కాల్షియం అవసరం.
  6. 50 ఏళ్లు దాటిన తర్వాత మహిళకు ప్రతిరోజూ 1000 నుంచి 1200 మిల్లీగ్రాముల కాల్షియం అవసరం.
  7. 70 ఏళ్ల తర్వాత పురుషులకు రోజుకు 1000 నుంచి 1200 మిల్లీగ్రాముల క్యాల్షియం అవసరం.
  8. వయస్సు, అవసరాన్ని బట్టి, ప్రతిరోజూ శరీరానికి పూర్తి మోతాదులో కాల్షియం ఇవ్వాలి.
  9. రోజువారీ ఆహారంతో దీనిని తీర్చలేకపోతే వైద్యుడిని సంప్రదించి కాల్షియం సప్లిమెంట్లను తీసుకోవచ్చు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి