Health Tips: ఈవంట నూనెలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు.. గుండె జబ్బుల నుంచి రక్షణతో పాటు..

Health Care Tips: శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పోషకాహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. అయితే నేటి యాంత్రిక జీవనంలో చాలామంది ఆయిల్‌ ఫుడ్స్‌, ఫ్రైడ్‌ ఫుడ్స్‌కు బాగా అలవాటు పడ్డారు. ఫలితంగా చిన్న వయసులోనే గుండె పోటు,

Health Tips: ఈవంట నూనెలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు.. గుండె జబ్బుల నుంచి రక్షణతో పాటు..
Cooking Oil
Follow us
Basha Shek

|

Updated on: Aug 01, 2022 | 1:50 PM

Health Care Tips: శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పోషకాహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. అయితే నేటి యాంత్రిక జీవనంలో చాలామంది ఆయిల్‌ ఫుడ్స్‌, ఫ్రైడ్‌ ఫుడ్స్‌కు బాగా అలవాటు పడ్డారు. ఫలితంగా చిన్న వయసులోనే గుండె పోటు, మధుమేహం, డయాబెటిస్ లాంటి ప్రమాదకర బ్యాధుల బారిన పడతారు. ముఖ్యంగా యువతలో గుండెపోటు సమస్యలు ఎక్కువగా తలెత్తుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం వంటల్లో ఉపయోగించే నూనెలు. గుండెపోటుకు ప్రధాన కారణం ఆహారంలో ఉపయోగించే వంట నూనె. గుండె ధమనుల్లో కొవ్వు పేరుకుపోవడానికి మనం తీసుకునే రకరకాల నూనెలే. ఇవి క్రమంగా గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతాయి.

  • నూనెను మోతాదుకు మించి వేడి చేయడం ఆరోగ్యానికి హానికరం. వంట నూనెలలో పలు పోషకాలు ఉంటాయి. అధిక ఉష్ణోగ్రతల వద్ద పోషకాలు నశించిపోతాయి. ఇది క్రమంగా హృదయ సంబంధిత సమస్యలకు దారి తీస్తుంది.
  • పొద్దుతిరుగుడు నూనెలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అయితే అధిక ఉష్ణోగ్రతలున్నప్పుడు సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను తక్కువగా ఉపయోగించుకోవాలి.
  • సోయాబీన్ నూనెలో పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ నూనెలు శరీరంలో కొవ్వు నిల్వలను తగ్గించడంలో సహాయపడుతాయి. అదేవిధంగా హృదయనాళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
  • ఆలివ్ నూనెలో విటమిన్ బి కాంప్లెక్స్‌ తో పాటు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇక వంటల కోసం శుద్ధి చేసిన లేదా స్వచ్ఛమైన ఆలివ్ నూనెను మాత్రమే ఉపయోగించాలి.
  • కనోలా ఆయిల్ శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా గుండెపోటు ప్రమాదాన్ని నియంత్రిస్తుంది.
  • అవకాడో నూనెలో గుండెకు ఆరోగ్యాన్ని అందించే మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ ఇ, విటమిన్ కె సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతాయి. తద్వారా గుండె జబ్బుల నుంచి రక్షణ అందుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి