Health Tips: మనలో చాలా మందికి టీ అంటే ఎంతో ఇష్టం ఉంటుంది. వీరిలో కొందరికి రోజు మొత్తంలో కనీసం 5 సార్లు అయినా టీ తాగకుండా తాగినట్లు అనిపించదు. అయితే టీ తాగే విషయంలో కొన్ని రకాల నియమాలు పాటించాల్సి ఉంది. టీ అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. అధిక మొత్తంలో టీ తాగడం వల్ల నిద్రలేమి, డీహైడ్రేషన్, దంత సమస్యలు ఎదురవుతాయి. ఇదే కాదు, టీ తాగే సమయంలో కొన్ని రకాల ఆహారాలను అసలు తీసుకోకూడదు. వాటిని టీ తాగే సమయంలో తింటే ఆరోగ్య సమస్యల బారిన పడాల్సి ఉంటుందని ప్రముఖ పోషకాహార నిపుణురాలు దిశా సేథీ సూచిస్తున్నారు. దిశా సేథీ సూచనల మేరకు ఏయే ఆహారాలను టీతో పాటు తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
నట్స్: దిశా సేథి ప్రకారం టీ తాగే సమయంలో జీడిపప్పు, బాదం, శనగలు వంటి గింజలను తీసుకోవడం మంచిది కాదు. టీలో ఉండే టానిన్ల కారణంగా.. విత్తనాల్లో ఉండే ఐరన్ శోషణను శరీరం నిరోధిస్తుంది. ఇలా ఐరన్ శోషణ జరగకపోతే శరీరంలో రక్తహీనత ఏర్పడుతుంది.
ఆకు కూరలు: బచ్చలికూర, మెంతి కూరతో చేసిన పకోడీలు టీతో కలిపి తాగడానికి రుచిగా అనిపించవచ్చు. కానీ అవి ఆరోగ్యానికి హాని చేస్తాయని సేథీ అంటున్నారు. నట్స్ మాదిరిగానే ఆకుకూరల్లో కూడా టానిన్లు ఉంటాయి, అవి శరీరం ఐరన్ శోషణను నిరోధించేలా చేస్తాయి. ఫలితంగా రక్తహీనత కలుగుతుంది.
పసుపు: భారతీయ వంట గదుల్లో పసుపు ప్రధానమైన పదార్థం. అయితే పసుపుతో చేసిన ఆహారాలను టీతో పాటు తాగకూడదు. ఇలా చేస్తే జీర్ణ వ్యవస్థపై చెడు ప్రభావం పడుతుంది.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లి క్ చేయండి..