Diabetes: మీలో ఈ సంకేతాలు ఉంటే గ్లూకోజ్ స్థాయి తక్కువుగా ఉన్నట్లే.. వెంటనే ఇవి తీసుకోండి..
మధుమేహం వ్యాధి ఉన్న వారు జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. శరీరంలో షుగర్ లెవెల్స్ ఎక్కువైనా, తక్కువైనా ప్రమాదమే. చాలా సందర్భాల్లో శరీరంలో గ్లూకోజ్ స్థాయి తగ్గిపోతుంది. వెంటనే తేరుకోకపోతే..
Diabetes: మధుమేహం వ్యాధి ఉన్న వారు జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. శరీరంలో షుగర్ లెవెల్స్ ఎక్కువైనా, తక్కువైనా ప్రమాదమే. చాలా సందర్భాల్లో శరీరంలో గ్లూకోజ్ స్థాయి తగ్గిపోతుంది. వెంటనే తేరుకోకపోతే షుగర్ లెవెల్స్ పడిపోవడం ప్రాణానికే ప్రమాదంగా మారుతుంది. రక్తంలో చక్కెర స్థాయి 70 mg/dl కంటే తక్కువగా ఉంటే.. తక్షణమే సరైన చర్యలు తీసుకుని షుగర్ లెవల్స్ పెంచే ఆహారాన్ని తీసుకోవాలి. శరీరంలో గ్లూకోజ్ స్థాయి తగ్గితే ఎలా తెలుసుకోవాలో మీరు వెంటనే దాన్ని సరిచేయడానికి చర్యలు తీసుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుముఖం పట్టే సమయంలో శరీరంలో కొన్ని సంకేతాలు కనబడతాయి. అవి ఉంటే తక్షణమే గ్లూకోజ్ స్థాయి పెంచే చర్యలు తీసుకోవాలి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు చాలా తక్కువగా పడిపోతే, తీవ్రమైన ఆకలి, ఆందోళన, మానసిక స్థితి మార్పులు, ఏకాగ్రతలో ఇబ్బంది వంటి సంకేతాలు కనిపిస్తాయి. శరీరంలో షుగర్ లెవెల్స్ తగ్గినప్పుడు గ్లూకోజ్ మాత్రలు, మిఠాయి, పండ్ల రసం వంటి సాధారణ చక్కెర మూలాలు కలిగిన ఆహారం తీసుకోవాలి.
శరీరంలో షుగర్ లెవెల్స్ తగ్గితే ఎటువంటి లక్షణాలుంటాయో తెలుసుకుందాం.
విపరీతమైన ఆకలి: అకస్మాత్తుగా ఆకలి వేయడం రక్తంలో చక్కెర తగ్గుదలని సూచించే సంకేతంగా చెప్పుకోవచ్చు. అల్పాహారంతో 15 నుంచి 20 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. భోజనంలో 40 నుంచి 65 గ్రాముల వరకు కార్బోహైడ్రేట్లు ఉండే ఆహారం తీసుకోవాలి.
చికాగుగా ఉండటం: శరీరంలోని రక్తంలో గ్లూకోజ్ స్థాయి తక్కువగా పడిపోయినప్పుడు శరీరం ఎపినెఫ్రిన్, కార్టిసాల్ అనే హార్మోన్లను విడుదల చేస్తుంది. ఇదే సమయంలో ఎక్కువుగా టెన్షన్ పడేట్లు ఉంటే ఇది చక్కెర స్థాయి తగ్గుదలకు సంకేతంగా భావించాల్సి ఉంటుంది.
భావోద్వేగానికి గురి అవడం: షుగర్ లెవెల్స్ తగ్గినప్పుడు ప్రవర్తలోనూ మార్పులు కనిపిస్తాయి. ఆకస్మికంగా భావోద్వేగానికి గురువుతూ ఉండటం, చిరాకు, మొండితనం, నిరాశ వంటి భావాలు మనిషిలో కనిపిస్తే రక్తంలో చక్కెర స్థాయి తగ్గినట్లుగా భావించాల్సి ఉంటుంది.
ఏకాగ్రత లోపించడం: మెదడు శక్తి కోసం రక్తంలో చక్కెరపై ఆధారపడుతుంది, కాబట్టి గ్లూకోజ్‌లో తగ్గుదల ఉంటే, మీ మెదడు సరిగ్గా పనిచేయకపోవచ్చు. ఏకాగ్రత దెబ్బతినడం కారణంగా మనం చేయాల్సిన పనిపై దృష్టిపెట్టలేకపోవచ్చు. పైలక్షణాలు శరీరంలో కనిపిస్తే తక్షణమే వైద్యులను సంప్రదించి, రక్తంలో షుగర్ లెవల్స్ ఎలా ఉన్నాయో పరీక్షించుకోవాలి.
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం చూడండి..