AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fruits for Diabetics: షుగర్ బాధితులు ఎలాంటి పండ్లు తినాలి.. ఆ పండ్ల జోలికి మాత్రం వెళ్లకండి..

Fruits To Avoid In Diabetes: మరీ ముఖ్యంగా రక్తంలో చెక్కర స్థాయిని పెంచే ఆహార పదార్థాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తద్వారా చక్కెర స్థాయిని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. అయితే..

Fruits for Diabetics: షుగర్ బాధితులు ఎలాంటి పండ్లు తినాలి.. ఆ పండ్ల జోలికి మాత్రం వెళ్లకండి..
Fruits For Diabetics
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 29, 2022 | 12:10 PM

Diabetic Diet: డయాబెటిక్ రోగులకు వారి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుకోవడం అతిపెద్ద సవాలు. రక్తంలో షుగర్‌ పెరగడం ద్వారా మధుమేహాన్ని ఎప్పుడూ అదుపులో ఉంచుకోలేరు. ఈ వ్యాధి గురించి తెలుసుకున్న తర్వాత.. మొదట చేయవలసిన పని డైట్ కంట్రోల్ చేయడం. మరీ ముఖ్యంగా రక్తంలో చెక్కర స్థాయిని పెంచే ఆహార పదార్థాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తద్వారా చక్కెర స్థాయిని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులకు వారు తీసుకునే ఆహారం విషయంలో పలు సందేహాలు ఉంటాయి. పండ్లను తింటున్నప్పుడు వారు చాలా గందరగోళానికి గురవుతారు. చాలా మంది అవగాహన లేకపోవడం వల్ల అనేక రకాల పండ్లను తింటూ అనారోగ్యానికి గురవుతారు. మరి డయాబెటిక్ రోగులు ఎలాంటి పండ్లను తీసుకోవాలి..? ఎలాంటి పండ్లను తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

అధిక చక్కెర కలిగిన పండ్లు..

మధుమేహం రావడానికి ప్రధాన కారణం శరీరంలో చక్కెర స్థాయి పెరగడం. ఆహారం ద్వారా శరీరంలో చక్కెర అధికంగా ఉంటే శరీరంలో చక్కెర స్థాయిని నియంత్రించలేము. అటువంటి పరిస్థితిలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్న పండ్లను ఎక్కువగా తినకూడదు. ఒక పండు గ్లైసెమిక్ ఇండెక్స్ స్థాయి 70,100 మధ్య ఉంటే.. అటువంటి పండ్లు, కూరగాయలలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. మీకు మధుమేహం లేదా లక్షణాలు కనిపిస్తే అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న పండ్లను తినకూడదు.

ఏ పండ్లు తినకూడదు?

పుచ్చకాయ, ఎండిన రేగు, పైనాపిల్, పండిన అరటి, నారింజ, ఎండుద్రాక్ష, ద్రాక్ష, ఖర్జూరం వంటి తీపి పండ్లలో అధిక గ్లైసెమిక్ సూచిక ఉంటుంది. ఇది చక్కెర స్థాయిలను పెంచుతుంది. ఇలాంటి  పండ్లను అస్సలు తినకండి.

ఏ పండ్లు తినవచ్చు?

రేగు, కివీస్, జామూన్‌లు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ స్థాయిలను కలిగి ఉంటాయి.

మీరు ఏ పరిమాణంలో పండ్లు తినవచ్చు?

సాధారణంగా పండ్లు చక్కెర స్థాయిని పెంచుతాయని అనుకుంటాం. వాటిని పూర్తిగా పక్కన పెడుతాం. కానీ ఇది నిజం కాదు. అధిక చక్కెర ఉన్న పండ్లను సరైన పరిమాణంలో తింటే, అవి హాని చేయవు. అయితే, ఇది మీ షుగర్ స్థాయిపై కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి డయాబెటిస్‌లో ఇలాంటి ఆహారం తీసుకునే ముందు ఒక్కసారి వైద్యుడిని సంప్రదించండి.

వీటిని కూడా తీసుకోకండి

ఈ పండ్లతో పాటు, మధుమేహ వ్యాధిగ్రస్తులు శీతల పానీయాలు, వైట్ బ్రెడ్, వైట్ రైస్, బంగాళదుంపలలో గ్లైసెమిక్ ఇండెక్స్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే గ్లైసెమిక్ ఇండెక్స్‌తో పాటు.. అధిక కార్బోహైడ్రేట్ స్థాయిలు కలిగిన పండ్లు, కూరగాయలు, ఆహారాలు కూడా డయాబెటిస్ ఉన్నవారికి ప్రమాదాన్ని తెచ్చపెడుతాయి. మామిడి, ద్రాక్ష, యాపిల్, అరటిపండ్లలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం