Diabetes: పసుపుతో డయాబెటిస్‌కు చెక్ పెట్టొచ్చు.. ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోండి..
పసుపు మధుమేహానికి మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు పసుపును తప్పనిసరిగా తీసుకోవాలి.
Benefits Of Turmeric: ప్రతి ఇంటిలో పసుపు సులభంగా దొరుకుతుంది. ఇది ఆరోగ్యానికి, చర్మానికి రెండింటికీ మేలు చేస్తుంది. పసుపు శరీరం రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది. అంతే కాదు పసుపు మధుమేహానికి మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు పసుపును తప్పనిసరిగా తీసుకోవాలి. డయాబెటిక్ పేషెంట్లు పసుపును ఎలా తీసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..
డయాబెటిస్ బాధితులకు పసుపు ఎలా ఉపయోగపడుతుంది?
డయాబెటిక్ రోగులకు పసుపు చాలా ఉపయోగకరంగా పరిగణిస్తారు. పసుపులో మంచి మొత్తంలో కర్కుమిన్ ఉంటుంది. దీని కారణంగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు పసుపు చాలా మంచిదని పేర్కొంటారు. డయాబెటిస్‌లో పసుపు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
పసుపును ఈ విధంగా తీసుకోవాలి
పసుపు – దాల్చిన చెక్క: మధుమేహ రోగులు పసుపు, దాల్చిన చెక్కను సులభంగా తీసుకోవచ్చు. ఒక గ్లాసు పాలలో పసుపు, దాల్చిన చెక్క పొడిని కలిపి వేడి చేసుకొని తాగవచ్చు. అదేవిధంగా ఈ పాలను అల్పాహారంలో కూడా తీసుకోవచ్చు. పసుపుతో పాటు దాల్చిన చెక్క కూడా రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది.
పసుపు – నల్ల మిరియాలు: పసుపుతో పాటు నల్లమిరియాలు తీసుకోవడం వల్ల డయాబెటిక్ పేషెంట్ల బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు పసుపు, నల్లమిరియాలను పాలతో కలిపి తీసుకోవచ్చు. దీనికోసం ఒక గ్లాసు పాలలో పసుపు, ఎండుమిరియాల పొడి వేసి వేడి చేసి తాగాలి.
పసుపు – ఉసిరి: పసుపుతో పాటు, ఉసిరి కూడా మధుమేహ రోగులకు ప్రయోజనకరంగా పరిగణిస్తారు. ఉసిరికాయలో విటమిన్ సి మంచి మొత్తంలో ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. దీని కోసం ఉసిరి పొడి, పసుపును మిక్స్ చేసి పాలలో కలిపి తీసుకోవచ్చు. ఈ మిశ్రమం మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)