COVID-19: కోవిడ్ భయంతో కంటి చికిత్స ఆలస్యం.. అంధత్వ సమస్యను ఎదుర్కొంటున్న ప్రజలు.. చూపుని కోల్పోతున్న వృద్ధులు

|

Jun 29, 2022 | 8:22 AM

చాలామంది చికిత్స తీసుకోవడంలో జాప్యం చేయడంతో ఇప్పుడు కంటిచూపుని కోల్పోతున్నారు. ఈ సంఖ్యల్లో ఎక్కువ మంది వృద్ధులే.

COVID-19: కోవిడ్ భయంతో కంటి చికిత్స ఆలస్యం.. అంధత్వ సమస్యను ఎదుర్కొంటున్న ప్రజలు.. చూపుని కోల్పోతున్న వృద్ధులు
Covid 19 Pandemic
Follow us on

COVID-19: చైనాలో రెండేళ్ల క్రితం వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్.. ప్రపంచ దేశాలను భయబ్రాంతులకు గురి చేస్తూనే ఉంది. గత రెండేళ్లుగా కరోనా వైరస్ దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం దేశం నాల్గో వేవ్ ముంగిట ఉందని సిబ్బంది ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో కొత్త కేసులు నమోదులో హెచ్చుతగ్గులున్నాయి.  అయితే ఈ వైరస్ సోకిన వ్యక్తుల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోంది. లక్షల మంది మరణించారు కూడా.  అయితే కరోనా భయంతో ఆసుపత్రికి వెళ్లని రోగులు తీవ్రమైన అనారోగ్యానికి గురవుతున్నారు. కరోనా రెండవ, మూడవ వేవ్ సమయంలో వైరస్ భయంతో రెగ్యులర్ చెకప్ సహా అత్యవసర చికిత్స కూడా తీసుకోని ప్రజలున్నారు. అయితే ఇప్పుడు చాలామంది రోగులు కంటికి సంబంధించిన చికిత్స తీసుకుంటున్నారు. చాలామంది చికిత్స తీసుకోవడంలో జాప్యం చేయడంతో ఇప్పుడు కంటిచూపుని కోల్పోతున్నారు. ఈ సంఖ్యల్లో ఎక్కువ మంది వృద్ధులే.

ఢిల్లీలోని సర్ గంగా రామ్ హాస్పిటల్‌లోని ఆప్తాల్మాలజీ విభాగం HOD, డాక్టర్ AK గ్రోవర్ Tv9 తో మాట్లాడుతూ.. “ప్రస్తుతం, OPDకి వచ్చే రోగులలో చాలా మంది దీర్ఘకాలంగా కంటి సంబంధిత సమస్యలు ఉన్నవారేనని అన్నాయి. అయితే గత రెండేళ్లుగా కరోనా భయంతో ఈ వ్యక్తులు ఆసుపత్రికి రావడం మానేశారు. వీరిలో గ్లకోమా సమస్య ఉన్న కొందరు రోగులు ఉన్నారు. ఈ రోగులు నిరంతరం ఫాలో-అప్‌లో ఉండాలి. దీని కారణంగా వ్యాధికి చికిత్స కొనసాగుతుంది. అయితే కరోనా భయంతో, ఈ వ్యక్తులు ఆసుపత్రికి రాలేకపోయారు. ఇప్పుడు కళ్లను పరిశీలించినప్పుడు.. వీరిలో చాలా మంది పూర్తిగా కంటి చూపు కోల్పోయారని చెప్పారు. బాధితుల్లో ఎక్కువ మంది ఆ సమయంలో చికిత్స , శస్త్రచికిత్స అవసరమైన వారని తెలిపారు.

గ్లకోమ కంటికి సంబంధించిన ప్రమాదకరమైన వ్యాధని డాక్టర్ గ్రోవర్ చెప్పారు.  ప్రపంచవ్యాప్తంగా అంధత్వానికి ఇది రెండవ అతిపెద్ద కారణమని తెలిపారు. ఈ వ్యాధిలో ఆప్టిక్ నరాల దెబ్బతింటుంది. గ్లకోమాకు వెంటనే చికిత్స అందించాలి. ఆలస్యం అయితే కంటి చూపు పూర్తిగా దెబ్బతింటుంది. ఈ సమస్య 50 ఏళ్ల తర్వాత ఎక్కువగా వస్తుంది. కరోనా సమయంలో వృద్ధులకు ఎక్కువ ప్రమాదం ఉంది కనుక ఇలాంటి పరిస్థితుల్లో సకాలంలో ఆస్పత్రికి రాకపోవడంతో ఇప్పుడు ఈ సమస్య తీవ్రమైంది. తీవ్ర ఆందోళనకు కారణమైంది.

ఇవి కూడా చదవండి

వయసు పెరుగుతున్న కొద్దీ కంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయని డాక్టర్ చెప్పారు. దీన్నే వయసు-సంబంధిత మచ్చల క్షీణత అంటారు. ఇందులో కళ్లు పొడిబారడం, రెటీనా బలహీనపడడం వంటి సమస్య వచ్చి కంటిచూపు మందగించడం మొదలవుతుంది. అటువంటి రోగులకు సకాలంలో చికిత్స అవసరం, కానీ కోవిడ్ సమయంలో చికిత్స లేకపోవడం వల్ల, అలాంటి వారిలో కొంతమంది కంటి చూపు కూడా కోల్పోయారు. ఈ సంఖ్యల్లో ఎక్కువ మంది వృద్ధులేనని అన్నారు.

OPDలో రోగుల సంఖ్య తక్కువగానే ఉంది
కరోనా మూడవ వేవ్ సమయంలో కూడా.. OPD లో రోగుల సంఖ్య చాలా తక్కువగా ఉందని, ఆ సమయంలో ఆసుపత్రులలో కరోనా రోగులు చాలా తక్కువగా ఉన్నారని చెప్పారు. ఈ వైరస్ భయంతో ప్రజలు కంటి శుక్లాల సమస్యతో బాధపడుతున్నారని డాక్టర్ చెప్పారు. ఆపరేషన్ కోసం కూడా రాలేదు. ఆ సమయంలో రాని పేషెంట్లు గత రెండు నెలలుగా ఫాలోఅప్ కోసం వస్తున్నారు. కానీ వారి కంటి వ్యాధి ఇప్పుడు ప్రమాదకర దశకు చేరుకుంది. శుక్లాలకు సకాలంలో చికిత్స అందకపోతే కంటి చూపు తగ్గిపోతుంది.

మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా సమస్యలను ఎదుర్కొంటున్నారు

చాలా మంది రోగులకు డయాబెటిక్ రెటినోపతి (కళ్లలోని రెటీనా కణజాలం దెబ్బతినడం) సమస్య కూడా ఉందని డాక్టర్ గ్రోవర్ వివరించారు. మధుమేహం వల్ల ఈ సమస్య వస్తుంది. ఈ వ్యాధికి సకాలంలో చికిత్స కూడా అవసరం.. ఈ సమస్య  కారణంగా కంటి చూపు కోల్పోవచ్చు. ఈ వ్యాధిగ్రస్తులు కూడా కరోనా సమయంలో చికిత్స పొందలేదు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నారు.

కరోనా సమయంలో టెలిమెడిసిన్ సౌకర్యం అందుబాటులో ఉంది. కానీ టెలిమెడిసిన్ ద్వారా కంటి చికిత్స సాధ్యం కాదు. కంటి వ్యాధిని నిర్ధారించడానికి, యంత్రాల సహాయంతో పరీక్షించడం చాలా ముఖ్యం. దీంతో ఆస్పత్రికి జనం రాలేదు. అటువంటి పరిస్థితిలో.. ఇప్పుడు కంటి సమస్యతో బాధపడుతున్న బాధితుల సంఖ్య పెరిగింది.

పిల్లల్లో కూడా సమస్యలు: 

డాక్టర్ గ్రోవర్ మాట్లాడుతూ, పిల్లలలో కూడా ఇలాంటి కేసులు కొన్ని వచ్చాయి. సకాలంలో పరీక్షలు చేయించుకోకపోవడంతో కంటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. బలహీనమైన కంటి చూపు ఉన్న పిల్లలు మూడు నుండి నాలుగు నెలల మధ్య కంటి పరీక్ష చేయించుకోవాలి. పిల్లలకు కంటి అద్దాలు వేస్తారు, కానీ కరోనా భయంతో పిల్లలు కూడా ఆసుపత్రికి రాలేదు. ప్రస్తుతం చికిత్స ఆలస్యం కావడంతో పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.

పిల్లలు మెల్ల కళ్ల సమస్యను ఎదుర్కొంటున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మెల్లకన్ను చికిత్స సాధ్యమే.. కానీ ఆలస్యం కారణంగా కంటి చూపు పోతుంది. చికిత్సను నిర్లక్ష్యం చేయవద్దని డాక్టర్ గ్రోవర్ సుచిస్తున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..