AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid-19: కరోనా అలర్ట్.. JN.1 వేరియంట్ అంత ప్రమాదకరమైనదా..? లక్షణాలు ఎలా ఉంటాయంటే..

భారతదేశంలోని అనేక రాష్ట్రాలలో కరోనావైరస్ జె.ఎన్. 1 వేరియంట్ వ్యాప్తి చెందుతోంది. ప్రస్తుతం మహారాష్ట్రలో 45 కొవిడ్‌ యాక్టివ్‌ కేసులు ఉండగా.. కర్నాటకలో 35, ఢిల్లీలో 27 కొవిడ్‌ యాక్టివ్‌ కేసులున్నాయి. ఢిల్లీలో నిన్న ఒక్కరోజే 23 కరోనా కేసులు నమోదయ్యాయి.. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కలకలం రేపింది.

Covid-19: కరోనా అలర్ట్.. JN.1 వేరియంట్ అంత ప్రమాదకరమైనదా..? లక్షణాలు ఎలా ఉంటాయంటే..
Covid 19 Jn.1 Variant
Shaik Madar Saheb
|

Updated on: May 24, 2025 | 4:05 PM

Share

కరోనా వైరస్.. 2020 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా అలజడి రేపింది.. కోట్లాది మంది ఈ వైరస్ బారిన పడగా.. లక్షలాది మంది మరణించారు.. ప్రతి ఒక్కరూ కోవిడ్ 19 విధ్వంసాన్ని దగ్గరగా చూశారు. అన్ని రంగాలు కుదేలయ్యాయి.. అయితే.. కోవిడ్ వైరస్ కేసులు నమోదుకావడం ప్రారంభమై ఐదు సంవత్సరాలు గడిచాయి.. కానీ అది ఇంకా ముగియలేదు.. తాజాగా.. కొత్త కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. సింగపూర్‌, చైనా, థాయిలాండ్‌లోనే కాదు.. భారత్‌లోనూ యాక్టివ్‌ కేసులు చాపకింద నీరులా పెరుగుతున్నాయి. భారతదేశంలోని అనేక రాష్ట్రాలలో కరోనావైరస్ జె.ఎన్. 1 వేరియంట్ వ్యాప్తి చెందుతోంది. ప్రస్తుతం మహారాష్ట్రలో 45 కొవిడ్‌ యాక్టివ్‌ కేసులు ఉండగా.. కర్నాటకలో 35, ఢిల్లీలో 27 కొవిడ్‌ యాక్టివ్‌ కేసులున్నాయి. ఢిల్లీలో నిన్న ఒక్కరోజే 23 కరోనా కేసులు నమోదయ్యాయి.. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కలకలం రేపింది. విశాఖ, కడపలో రెండు కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఓ ప్రైవేట్‌ డాక్టర్‌కు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే.. కరోనా కేసులు పెరగడానికి కారణం.. కోవిడ్ JN. 1 వేరియంట్ అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది కోవిడ్ కొత్త వేరియంట్ గా చెబుతున్నారు.. కానీ ఇది నిజంగా కొత్త వేరియంటా..? దాని గురించి భయపడాల్సిన అవసరం ఉందా? కరోనా కేసులు పెరగడంపై నిపుణులు ఏం చెబుతున్నారు..? ఈ వివరాలను తెలుసుకోండి..

దేశవ్యాప్తంగా జె.ఎన్. 1 వేరియంట్ కేసులు వెలుగులోకి వస్తున్నాయని ఢిల్లీ ఎయిమ్స్‌లో కమ్యూనిటీ మెడిసిన్ విభాగంలో ప్రొఫెసర్ డాక్టర్ సంజయ్ రాయ్ పేర్కొన్నారు. ఈ వైరస్ గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి.. కానీ ఇది కోవిడ్ కొత్త వేరియంట్ కాదు. ఇది దాదాపు ఏడాదిన్నర క్రితం గుర్తించిన పాత వేరియంట్.. ఇది ఓమిక్రాన్ సబ్ వేరియంట్.. దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు.. కానీ, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం.. ముఖ్యంగా రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ వ్యక్తులు వైరస్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.. అని చెప్పారు.

కోవిడ్ జెఎన్. 1 వేరియంట్ లక్షణాలు భిన్నంగా ఉన్నాయా?..

JN.1 వేరియంట్ అన్ని లక్షణాలు మునుపటిలాగే ఉన్నాయని.. దగ్గు, జలుబు, తలనొప్పి, తేలికపాటి జ్వరం లాంటి లక్షణాలు కనిపిస్తాయని డాక్టర్ సంజయ్ రాయ్ వివరించారు. రోగులలో శ్వాసకోశ సమస్యలు కనిపించడం లేదు. కరోనా ఒక వైరస్ అని.. వైరస్లు ఎప్పటికీ పూర్తిగా పోవు అని డాక్టర్ రాయ్ పేర్కొన్నారు. వైరస్ ఎప్పటికప్పుడు కనిపిస్తూనే ఉంటుందన్నారు.. వైరస్ తనను తాను సజీవంగా ఉంచుకోవడానికి పరివర్తన చెందుతూనే ఉంటుంది. ఈ క్రమంలో కొత్త వైవిధ్యాలు కూడా వస్తూనే ఉంటాయన్నారు. కానీ జె.ఎన్. 1 కొత్తది కాదు. ఇది పాత వ్యాధి.. దాని లక్షణాలు కూడా తేలికపాటివి. కోవిడ్ కేసులు పెరుగుతున్నప్పటికీ, లక్షణాలలో గణనీయమైన తేడా లేదని డాక్టర్ వివరించారు.

కొత్త వేవ్ వచ్చే అవకాశం ఉందా?

మునుపటిలాగా ఇప్పుడు కోవిడ్ నుండి తీవ్రమైన ప్రమాదం లేదని డాక్టర్ రాయ్ చెప్పారు. కొన్ని కేసులు వస్తూనే ఉంటాయి, కానీ వైరస్ వల్ల పెద్దగా ప్రమాదం ఉండదన్నారు. అయితే, ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.. ప్రత్యేకించి రద్దీగా ఉండే ప్రాంతాల్లో తమను తాము జాగ్రత్తగా చూసుకోవాలంటూ సూచించారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..