AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

న్యాచురల్ బ్రహ్మాస్త్రం.. చిన్న ముక్క తిన్నా చాలు.. చింతలేకుంగా జీవించొచ్చట..

అల్లంలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలు, పోషకాలు దాగున్నాయి.. అందుకే దీనిని సహజ ఔషధంగా పేర్కొంటారు. అల్లం వంట రుచిని పెంచడంతోపాటు.. ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మసాలా దినుసైన అల్లం చిన్న ముక్కను పచ్చిగా నమలి తినొచ్చు..

న్యాచురల్ బ్రహ్మాస్త్రం.. చిన్న ముక్క తిన్నా చాలు.. చింతలేకుంగా జీవించొచ్చట..
Ginger Health Benefits
Shaik Madar Saheb
|

Updated on: May 24, 2025 | 2:55 PM

Share

అల్లంలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలు, పోషకాలు దాగున్నాయి.. అందుకే దీనిని సహజ ఔషధంగా పేర్కొంటారు. అల్లం వంట రుచిని పెంచడంతోపాటు.. ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మసాలా దినుసైన అల్లం చిన్న ముక్కను పచ్చిగా నమలి తినొచ్చు.. ఇంకా అల్లం నీటిని త్రాగడం లేదా హెర్బల్ టీ, మామూలు టీతో రెగ్యులర్ గా తీసుకోవచ్చు.. వాస్తవానికి మసాలా దినుసు అల్లం మన వంటగదిలో ఒక ముఖ్యమైన భాగం.. అల్లం సహాయంతో అనేక రకాల వంటకాల రుచిని పెంచవచ్చు.. ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు.. శరీరాన్ని రిపేర్ చేసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు వివరిస్తున్నారు. అల్లం తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి..? ఆయర్వేద నిపుణులు ఏం చెబుతున్నారు..? ఈ కథనంలో తెలుసుకోండి..

అల్లంలో ఎన్నో పోషకాలు..

అల్లంలో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. అల్లంలో జింజెరాల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాల మంది.. దీంతోపాటు విటమిన్ బి3, విటమిన్ బి6, విటమిన్ సి, ఐరన్, పొటాషియం, ఫోలేట్, రిబోఫ్లేవిన్, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్, నియాసిన్ వంటి పోషకాలు కూడా ఉన్నాయి..

అల్లం తినడం వల్ల కలిగే ప్రయోజనాలివే..

  • అల్లంలో ఉండే ఎంజైమ్‌లు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి.. దీని కారణంగా జీర్ణక్రియ ప్రక్రియ సజావుగా సాగడంతోపాటు.. గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను నివారిస్తుంది.
  • అల్లం విటమిన్ సి కి మంచి మూలం.. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ఇది వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతుంది.
  • అల్లంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. అలాగే చర్మాన్ని ఆరోగ్యంగా, మెరిసేలా చేస్తాయి.
  • అల్లం క్రమంగా తినడం వల్ల.. ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.
  • అల్లం వేడిని ఉత్పత్తి చేసి.. జలుబు, దగ్గును నివారించడంలో సహాయపడుతుంది.
  • అల్లం రెగ్యులర్ గా తీసుకోవడం మంచిది.. ఇది మధుమేహ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది.
  • అల్లంలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఆర్థరైటిస్ రోగులకు ఉపశమనం కలిగిస్తాయి. నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
  • అల్లం తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.. ఇది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అల్జీమర్స్ వంటి మానసిక వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది.

ఉదయాన్నే అల్లం లేదా అల్లం నీటిని తీసుకోవడం చాలా మంచిది

అయితే.. అల్లం ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు.. ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే.. అల్లం తీసుకునే ముందు వైద్య నిపుణులను సంప్రదించండి..

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జియో కేవలం రూ.1748 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌
జియో కేవలం రూ.1748 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌
ఘాటైన చూపుతో చంపేస్తున్న రాశి ఖన్నా.. బ్యూటిఫుల్ ఫొటోస్
ఘాటైన చూపుతో చంపేస్తున్న రాశి ఖన్నా.. బ్యూటిఫుల్ ఫొటోస్
కుప్పకూలిన "సునామీ స్వింగ్", ఒకరు మృతి, 13మందికి సీరియస్!
కుప్పకూలిన
శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక వాట్సాప్‌లో దర్శనం టిక్కెట్లు!
శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక వాట్సాప్‌లో దర్శనం టిక్కెట్లు!
మీ కాలేయంలోని కొవ్వును వెన్నలా కరిగించే పానియం ఇది.. తయారీ ఇలా..
మీ కాలేయంలోని కొవ్వును వెన్నలా కరిగించే పానియం ఇది.. తయారీ ఇలా..
ప్రేమలో ఉన్న ప్రతి కుర్రాడు పాడుకునే ఏకైక సాంగ్..
ప్రేమలో ఉన్న ప్రతి కుర్రాడు పాడుకునే ఏకైక సాంగ్..
చిరంజీవి రిజెక్ట్ చేసిన కథతో పవన్ కల్యాణ్ సినిమా.. కట్ చేస్తే..
చిరంజీవి రిజెక్ట్ చేసిన కథతో పవన్ కల్యాణ్ సినిమా.. కట్ చేస్తే..
కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆదుకున్న సూర్య..అమెరికా టార్గెట్ 162
కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆదుకున్న సూర్య..అమెరికా టార్గెట్ 162
ఇదేం పిచ్చిరా బాబా.. రీల్‌ రీక్రియేట్ చేస్తుండగా జారీన ఛైర్..
ఇదేం పిచ్చిరా బాబా.. రీల్‌ రీక్రియేట్ చేస్తుండగా జారీన ఛైర్..
రోజూ ఓ గ్లాస్‌ రెడ్‌ వైన్‌ తాగితే గుండె ఆరోగ్యానికి మంచిదా?
రోజూ ఓ గ్లాస్‌ రెడ్‌ వైన్‌ తాగితే గుండె ఆరోగ్యానికి మంచిదా?