వాతావరణం మారుతున్న కొద్దీ అనేక సమస్యలు కూడా మొదలవుతాయి. ఆగస్ట్ నెల వెళ్లి సెప్టెంబరు రాబోతోంది. అదేమిటంటే, కొన్ని రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో.. సీజనల్ ఫీవర్, జలుబు, ఫ్లూతో అంతా మంచ మెక్కారు. ఇక నుంచి కొంతమందికి జలుబు, జ్వరం వంటి సమస్యలు మొదలయ్యాయి. ఈ సీజనల్ సమస్యలు కాలక్రమేణా మాయమైనప్పటికీ.. అదనపు అప్రమత్తత తీసుకోవడం ద్వారా దీని తీవ్రతను తగ్గించుకోవచ్చు. ఈ సమయంలో సీజనల్ జలుబు చాలా ఇబ్బందులకు గురిచేస్తుంది. ఇందులో చిన్న పిల్లలు, పెద్దవారు అనే తేడా లేకుండా అందరికి ఇదే పరిస్థితి.ఈ సీజనల్ జలుబు లక్షణాలు ఏంటో తెలుసుకుందాం..
సీజనల్ ఫీవర్‌తో పాటు ఇన్‌ఫ్లుఎంజా వచ్చే ప్రమాదం కూడా ఎక్కువ ఉంటుంది. ఇన్ఫ్లుఎంజాలో అధిక జ్వరం 3-4 రోజులు ఉంటుంది. కొన్నిసార్లు వణుకు, చల్లని చెమట పడుతుంటాయి. తలనొప్పితో పాటు అలసట కూడా ఉంటుంది. ఇది కాకుండా, ఛాతీ, పొత్తికడుపు నొప్పి, తల తిరగడం, గందరగోళం, చురుకుదనం తగ్గడం, మూత్రవిసర్జన తగ్గడం, బలహీనత, తీవ్రమైన బాడీ పెయిన్స్, ఏ పని చేయడంలో ఉత్సాహం లేకపోవడం వంటి కొన్ని విభిన్న లక్షణాలు కూడా కనిపిస్తాయి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం