Clove Benefits: శీతాకాలంలో లవంగాలు తింటే డబుల్ బెనిఫిట్స్.. ఇంకా ఆ సమస్యల నుంచి ఉపశమనం..

వంటింట్లో ఉండే మసాలా దినుసుల్లో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాంటి మసాలా దినుసుల్లో లవంగాలు ఒకటి.. లవంగాలు ఆహారం రుచి, సువాసనను పెంచడమే కాకుండా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

Clove Benefits: శీతాకాలంలో లవంగాలు తింటే డబుల్ బెనిఫిట్స్.. ఇంకా ఆ సమస్యల నుంచి ఉపశమనం..
Cloves
Follow us

|

Updated on: Nov 12, 2022 | 6:53 AM

వంటింట్లో ఉండే మసాలా దినుసుల్లో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాంటి మసాలా దినుసుల్లో లవంగాలు ఒకటి.. లవంగాలు ఆహారం రుచి, సువాసనను పెంచడమే కాకుండా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు. లవంగాలు అనేక ఆరోగ్య సమస్యలకు దివ్యౌషధంగా పనిచేస్తాయని చెబుతున్నారు. లవంగాలను ఆహారంతోపాటు.. విడిగా కూడా తీసుకోవచ్చని చెబుతున్నారు. లవంగాలను నీటిలో మరిగించి, లేదా నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. లవంగాలలో ఫైబర్, మాంగనీస్, పొటాషియం, విటమిన్ సి లాంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే, వేడి స్వభావం ఉన్న లవంగాలను శీతాకాలంలో తీసుకుంటే.. చాలా మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు. చలికాలం లవంగాలను తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

లవంగాలను అనేక వంటలలో శాశ్వత మసాలాగా ఉపయోగిస్తారు. దీని రుచి వేడిగా ఉంటుంది. ఇది సీజనల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడానికి పనిచేస్తుంది.

జలుబు – దగ్గు: లవంగాలు యాంటీ వైరల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. చల్లగా ఉన్నప్పుడు లవంగాలతో చేసిన టీని తాగవచ్చు. ఇంకా అన్నం, కూరలో కూడా లవంగాలను చేర్చుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: కాలేయం మన శరీరంలో ముఖ్యమైన అవయవం. ఇది రక్తాన్ని నిర్విషీకరణ చేయడంలో, రక్తంలో చక్కెరను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. ఆహారంలో లవంగాలను తినడం వల్ల మీ కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పరిశోధన ప్రకారం.. లవంగాలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే కాలేయ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

బ్లడ్ షుగర్: లవంగాలను తీసుకోవడం వల్ల మీ బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతుంది. లవంగాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడే సమ్మేళనాన్ని కలిగి ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను సహజంగా నియంత్రించడంలో సహాయపడుతుంది.

దంతాలు – కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం: పంటి నొప్పి, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందేందుకు లవంగాలు సహాయపడతాయి. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందేందుకు మీరు లవంగం నూనెను ఉపయోగించవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..