AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Child Care: పిల్లలకు ఈ ఆహారాలు తినిపిస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త.. ఆరోగ్య సమస్యల బారిన పడొచ్చు..

పిల్లల ఆరోగ్యం, వారి ఎదుగుదల కోసం తల్లిదండ్రులు నిరంతరం ఆలోచిస్తూ ఉంటారు. దీనిలో భాగంగా తమ పిల్లలు తినే ప్రతి వస్తువును పెడతారు. ఈ సమయంలో పిల్లలకు పెట్టే ఆహారాల విషయంలో కొంత జాగ్రత్త వహించాలంటున్నారు వైద్య నిపుణులు. పిల్లలకు పెట్టకూడని ఆహారం పెడితే ఆరోగ్య..

Child Care: పిల్లలకు ఈ ఆహారాలు తినిపిస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త.. ఆరోగ్య సమస్యల బారిన పడొచ్చు..
Child Diet
Amarnadh Daneti
|

Updated on: Dec 09, 2022 | 6:30 AM

Share

పిల్లల ఆరోగ్యం, వారి ఎదుగుదల కోసం తల్లిదండ్రులు నిరంతరం ఆలోచిస్తూ ఉంటారు. దీనిలో భాగంగా తమ పిల్లలు తినే ప్రతి వస్తువును పెడతారు. ఈ సమయంలో పిల్లలకు పెట్టే ఆహారాల విషయంలో కొంత జాగ్రత్త వహించాలంటున్నారు వైద్య నిపుణులు. పిల్లలకు పెట్టకూడని ఆహారం పెడితే ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉంది. అందుకే పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు  తీసుకోవాలని సూచిస్తుంటారు. పిల్లల డైట్ విషయంలో ముఖ్యంగా ఆరోగ్య నిపుణులు సలహా కూడా తీసుకోవడం మంచిది. సాధారణంగా ప్రతి తల్లిదండ్రులు పిల్లల మానసిక అభివృద్ధికి అవసరమైన అన్ని పనులు చేస్తారు. అయితే పిల్లవాడు శిశువుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆహారం, స్నానం, నిద్ర, ఏడుపు కారణాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అయినప్పటికీ కొన్నిసార్లు తల్లిదండ్రులు తప్పులు చేస్తారు. వీటివల్ల శిశువుకు హాని కలుగుతుంది. కొంతమంది తల్లులు పసిపిల్లలకి కొన్ని ఆహారాలని తినిపిస్తారు. ఇది వారి ఆరోగ్యానికి మంచిది కాదు. అలాంటి కొన్ని ఆహారాల గురించి తెలుసుకుందాం.

కాల్చిన మాంసం

కాల్చిన మాంసం చిన్నపిల్లలకి అస్సలు తినిపించకూడదు. చిన్నపిల్లలే కాదు వృద్ధులు కూడా వీటిని తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు. కొన్నిసార్లు తల్లిదండ్రులు శిశువుకు ఇలాంటి మాంసాన్ని తినిపిస్తారు. ఇది వారి ఆరోగ్యానికి మంచిది కాదు. మీరు కావాలంటే ఉడికించిన మాంసాన్ని పిల్లలకి తినిపించవచ్చు.

చేపలు, రొయ్యలు

పిల్లలు రొయ్యలు, ఎండ్రకాయలు వంటి సముద్రపు ఆహారాన్ని తినకూడదు. వాస్తవానికి చేపల ఆహారంలో ప్రోటీన్, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయని చెబుతారు. కానీ ఈ రోజుల్లో చేపల్లో పాదరసం ఉన్నట్లు కనుగొన్నారు. కాబట్టి శిశువుకు ఇలాంటి ఆహారం ఇవ్వడం మంచిది కాదు.

ఇవి కూడా చదవండి

వేరుశెనగ వెన్న

ఇందులో ఒలేయిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మంచి కొలెస్ట్రాల్‌ని పెంచుతుంది. అయినప్పటికీ ఇది శిశువులకు మంచిది కాదు. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల బిడ్డకు అలర్జీ సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగా పిల్లలకు వేరుశెనగ వెన్న తినిపించవద్దని సలహా ఇస్తారు.

తీపి పదార్థాలు

తీపి పదార్థాలు, పంచదారతో తయారు చేసిన ఆహారాలని పిల్లలకు ఎక్కువగా తినిపించకూడదు. ప్రస్తుత కాలంలో పసిపిల్లలకి తల్లిదండ్రులు ఎక్కువగా చాక్లెట్లని అలవాటు చేస్తున్నారు. ఈ చాక్లెట్లు అద్భుతమైన రుచిని కలిగి ఉంటాయి. కానీ వీటిలో ఉండే రసాయనాలు శిశువుకు అనారోగ్యం కలిగిస్తాయి. తీపి విషయాలు పిల్లల శారీరక అభివృద్ధిపై మాత్రమే కాకుండా మానసిక అభివృద్ధిపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతాయని గుర్తుంచుకోండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..