డయాబెటిస్ బాధితులకు అలర్ట్.. క్యారెట్లతో డయాబెటిస్‌కు చెక్
డయాబెటిస్‌ను క్యారెట్లతో సమర్థంగా నియంత్రించవచ్చని తాజా అధ్యయనంలో తేలింది. క్యారెట్లు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతాయి. క్యారెట్లలోని విటమిన్ A, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి శక్తి, ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఇవి పేగు బ్యాక్టీరియాను ఆరోగ్యంగా ఉంచి జీవక్రియను మెరుగుపరుస్తాయి. ఎలుకలపై నిర్వహించిన ప్రయోగాల్లో క్యారెట్ పొడి డయాబెటిస్ నియంత్రణకు సహాయపడినట్లు నిర్ధారించారు.
డయాబెటిస్ తో బాధపడుతున్న వారికి శుభవార్త. టైప్-2 డయాబెటిస్ నియంత్రణకు క్యారెట్ లు కీలక పాత్ర పోషిస్తాయనే విషయం తాజా అధ్యయనంలో వెల్లడైంది. డెన్మార్క్‌లోని సదరన్ డెన్మార్క్ యూనివర్సిటీ పరిశోధకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ అధ్యయనంలో రోజూ క్యారెట్ లు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు సమతుల్యంగా ఉండే అవకాశం ఉందని గుర్తించారు. క్యారెట్ లు తమలో ఉన్న సహజ పోషకాలు, శక్తితో డయాబెటిస్ నియంత్రణలో సహాయపడతాయని నిపుణులు తెలిపారు.
ప్రతి రోజూ క్యారెట్ లను ఆహారంలో భాగం చేయడం వలన బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను నియంత్రించడంలో మంచి ఫలితాలు పొందవచ్చని అధ్యయనంలో తేలింది. క్యారెట్ లు కేవలం చక్కెర స్థాయిలను సమతుల్యంగా ఉంచడమే కాకుండా.. పేగుల్లోని ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాల సంక్షేమాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. ఆరోగ్యకరమైన జీవక్రియను కొనసాగించడంలో క్యారెట్ లకు కీలక పాత్ర ఉందని పరిశోధకులు పేర్కొన్నారు.
ఈ పరిశోధన ఎలుకలపై నిర్వహించిన ప్రయోగాలలో ఈ అంశాలను స్పష్టంగా చూపించింది. క్యారెట్ పొడి తిన్న ఎలుకలు డయాబెటిస్ ప్రభావాలను గణనీయంగా తగ్గించగలిగినట్టు గుర్తించారు. ఇది డయాబెటిస్‌తో పోరాడే సహజ మార్గంగా క్యారెట్లను పరిశీలించడానికి ఓ మంచి సూచనగా ఉంది. క్యారెట్లలోని పోషకాల వల్ల దుష్ఫలితాలు లేని చికిత్సగా ఉపయోగపడవచ్చని నిపుణులు వెల్లడించారు.
అదనంగా క్యారెట్ లు విటమిన్ A, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లతో నిండిపోయి ఉండటంతో శరీరంలోని వివిధ వ్యవస్థల పనితీరును మెరుగుపరుస్తాయట. ఈ క్యారెట్లను ప్రతిరోజూ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి పెంపొందించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ఎంత ముఖ్యమో తెలిపింది. డయాబెటిస్ తో బాధపడుతున్న వారు తమ ఆహారంలో క్యారెట్లను చేర్చడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.