
Bottle Gourd Juice Benefits: ఉరుకులు పరుగుల జీవితంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ప్రస్తుత కాలంలో యూరిక్ యాసిడ్ సమస్య చాలా మందిని వేధిస్తోంది. యూరిక్ యాసిడ్ సమస్యకు ప్రధానంగా అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు.. పేలవమైన జీవనశైలి కారణమని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. యూరిక్ యాసిడ్ అనేది ఒక రకమైన శరీర వ్యర్థం.. ఇది కీళ్ల నొప్పులు, నడకలో సమస్యలు, పాదాలలో వాపు వంటి వాటికి కారణమవుతుంది. అయితే ఆహారంలో కాస్త మార్పులు చేసుకుంటే.. ఈ సమస్యను అధిగమించవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.. ఇలాంటి పరిస్థితుల్లో మీ ఆహారంలో సొరకాయ రసాన్ని చేర్చుకోవాలి.. ఇది యూరిక్ యాసిడ్ సమస్యను అరికడుతుందని పేర్కొంటున్నారు.
సొరకాయలో విటమిన్ బి, విటమిన్ సి, ఐరన్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. కావున సొరకాయ రసం తాగితే యూరిక్ యాసిడ్ నియంత్రణలో బాగా సహాయపడుతుంది. దీని కోసం, సొరకాయ పొట్టు తీసి, చిన్న ముక్కలుగా కట్ చేసి గ్రైండర్లో వేసి మిక్స్ చేయాలి. ఆ తర్వాత వడగట్టి ఈ జ్యూస్‌లో కొంచెం నల్ల ఉప్పు కలిపి రోజూ ఉదయం పూట తాగితే కీళ్ల నొప్పులు, ఎముకల వాపు నుంచి ఉపశమనం లభిస్తుంది.
డయాబెటిస్‌లో మేలు చేస్తుంది..
మధుమేహ వ్యాధిగ్రస్తులు సొరకాయను క్రమం తప్పకుండా తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిని చాలా వరకు నియంత్రించడంలో సహాయపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది..
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగినప్పుడు అధిక రక్తపోటు, గుండెపోటు, కరోనరీ ఆర్టరీ వ్యాధి, ట్రిపుల్ వెస్సెల్ డిసీజ్ వ్యాధులు లాంటివి వచ్చే ప్రమాదం ఉంది. దీనిని నివారించడానికి, క్రమం తప్పకుండా సొరకాయ రసం తీసుకోవడం మంచిది.
బరువును తగ్గిస్తుంది..
ప్రస్తుత కాలంలో బరువు పెరగడం అనేది అందరిలో పెద్ద సమస్యగా మారుతోంది. అటువంటి పరిస్థితిలో సొరకాయ రసం మీ నడుము, పొట్ట కొవ్వును తగ్గించడంలో చాలా వరకు సహాయపడుతుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం..