
డయాబెటిస్ అనేది ఇన్సులిన్ ఉత్పత్తికి అంతరాయం కలిగించే వ్యాధి. టైప్ 1 డయాబెటిస్‌లో ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ఉత్పత్తిని ఆపివేస్తుంది. అయితే టైప్ 2 డయాబెటిస్‌లో ప్యాంక్రియాస్ తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయదు. ఇన్సులిన్ తగినంతగా ఉత్పత్తి కాకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. రక్తంలో చక్కెర పెరిగినప్పుడు, దాని లక్షణాలు శరీరంలో కనిపించడం ప్రారంభిస్తాయి. తరచుగా మూత్రవిసర్జన, గాయం మానడం ఆలస్యం, ఆకలి పెరగడం, అధిక దాహం, బలహీనమైన కంటి చూపు మధుమేహం అత్యంత సాధారణ లక్షణాలు. మధుమేహం లక్షణాలు చర్మంపై కూడా కనిపిస్తాయి.
చర్మ సమస్యలు కొన్నిసార్లు ఒక వ్యక్తికి డయాబెటిస్ ఉన్న మొదటి సంకేతం. చర్మ సమస్యలు మధుమేహానికి సంకేతం మాత్రమే కాదు, ఇది సౌందర్య సమస్య కూడా కావచ్చు. చాలా వరకు చర్మ సమస్యలను ట్రీట్ మెంట్ ద్వారా సులువుగా నయం చేయవచ్చు కానీ మధుమేహం కారణంగా చర్మంపై కనిపించే సమస్యలను వెంటనే చికిత్స చేయడం సాధ్యం కాదు. రక్తంలో చక్కెర పెరిగినప్పుడు మధుమేహ వ్యాధిగ్రస్తుల చర్మంపై ఎలాంటి గుర్తులు కనిపిస్తాయో తెలుసుకుందాం.
మధుమేహం ఉన్న రోగులకు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, దురద వంటి కొన్ని చర్మ సమస్యలు ఉంటాయి. ఈ చర్మ సమస్యలు ఎవరికైనా సంభవించవచ్చు. అయితే డయాబెటిక్ రోగులలో చర్మాన్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్యలు ఉన్నాయి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం