Blood Sugar: మధుమేహ వ్యాధిగ్రస్తులు స్వీట్లు ఎందుకు తినకూడదు? ఇందులో నిజం ఏంటో తెలుసుకోండి..

మధుమేహ వ్యాధికి సరైన సమయంలో చికిత్స తీసుకుంటే మంచిది. లేకుంటే శరీరం రోగాల కుప్పగా మారిపోతుంది. కాబట్టి మధుమేహం గురించి అసలు సంగతి తెలుసుకుందాం..

Blood Sugar: మధుమేహ వ్యాధిగ్రస్తులు స్వీట్లు ఎందుకు తినకూడదు? ఇందులో నిజం ఏంటో తెలుసుకోండి..
Type 2 Diabetes
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 10, 2022 | 1:27 PM

ఈ మధ్యకాలంలో చాలా మంది వారి జీవనశైలి కారణంగా మధుమేహంతో బాధపడుతున్నారు. మధుమేహం ప్రధానంగా సరైన ఆహారం, రోజువారీ జీవనశైలి కారణంగా వస్తుంది. వైద్య భాషలో చక్కెర స్థాయిని పెంచే ప్రక్రియను హైపర్గ్లైసీమియా అంటారు. డయాబెటిస్‌లో రోగి రక్తంలో గ్లూకోజ్ పరిమాణం పెరుగుతుంది. అదనంగా ప్రపంచవ్యాప్తంగా డయాబెటిక్ రోగుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. భారతదేశాన్ని డయాబెటిస్ రాజధాని అని కూడా పిలుస్తున్నారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహారంపై శ్రద్ధ వహించాలి. వైద్యులు చెప్పిన నియమాలను కూడా అనుసరించడం చాలా ముఖ్యం. మధుమేహం గురించి ప్రజలకు చాలా అపోహలు ఉన్నాయి. ఆ అపోహలను చాలా మంది నమ్ముతున్నారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు అనుసరించాల్సిన.. తెలుసుకోవలసిన అనేక విషయాలు ఉన్నాయి. అలాగే, మధుమేహం వెనుక అనేక అపోహలు, వాస్తవాలు ఉన్నాయి.

కృత్రిమ స్వీటెనర్ ఉపయోగం..

మధుమేహం (బ్లడ్ షుగర్) ఉన్నవారు కృత్రిమ చక్కెరను వాడతారు. ఇది వారికి మరింత ప్రమాదకరం. చాలా మంది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి చక్కెరకు బదులుగా కృత్రిమ స్వీటెనర్లను ఉపయోగిస్తారు. నిజానికి షుగర్ కంటే ఈ షుగర్ ఫ్రీ డైట్, ఆర్టిఫిషియల్ స్వీటెనర్ తీసుకోవడం ఎక్కువ ప్రయోజనకరమని వారు భావిస్తున్నారు. అయితే, నిపుణుల అభిప్రాయం ప్రకారం, కృత్రిమ స్వీటెనర్లు లేదా చక్కెర లేని స్వీటెనర్లను ఉపయోగించడం వల్ల ఇన్సులిన్ నిరోధకత మరింత దిగజారుతుంది.

స్వీట్లు తింటే మధుమేహం వస్తుందా?

చక్కెరతో కూడిన ఆహారాలు మధుమేహాన్ని పెంచే అవకాశం ఉంది. మధుమేహం పేరు చెప్పగానే ప్రజలకు ముందుగా గుర్తుకు వచ్చేది తీపి ఆహారం. మధుమేహానికి చక్కెర ఒక్కటే కారణం కాదు. ఊబకాయం కూడా మధుమేహానికి దారి తీస్తుంది. స్వీట్లు తినడం వల్ల కూడా బరువు పెరుగుతారు. అందుకే తీపిని ఎక్కువగా తినకూడదని.. లేకుంటే మధుమేహం వస్తుందని అంటారు.

సన్నగా ఉన్నవారికి మధుమేహం రాదా?

సన్నటి శరీరాకృతి కలిగిన వారికి మధుమేహం రాదని కొందరిలో సాధారణ నమ్మకం. కానీ అలా కాదు. సన్నగా ఉన్నవాళ్లకు కూడా మధుమేహం వస్తుంది. కానీ చాలా మందికి శరీరంలోని కొవ్వు బయటి నుంచి కనిపించదు. లోపలి నుంచి కూడా ఉంటుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం