Black Fungus: బ్లాక్ ఫంగస్.. ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి.. తస్మాత్ జాగ్రత్త.!

|

May 19, 2021 | 4:12 PM

Black Fungus Symptoms: ఒకవైపు దేశాన్ని కరోనా వైరస్ మహమ్మారి వణికిస్తుంటే.. మరోవైపు ‘బ్లాక్ ఫంగస్’ లేదా ‘మ్యుకర్ మైకోసిస్’..

Black Fungus: బ్లాక్ ఫంగస్.. ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి.. తస్మాత్ జాగ్రత్త.!
Black Fungus
Follow us on

Black Fungus Symptoms: ఒకవైపు దేశాన్ని కరోనా వైరస్ మహమ్మారి వణికిస్తుంటే.. మరోవైపు ‘బ్లాక్ ఫంగస్’ లేదా ‘మ్యుకర్ మైకోసిస్’ అనే వ్యాధి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో అసలు బ్లాక్ ఫంగస్ ఎవరికి సోకుతుంది.? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి.? గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

బ్లాక్ ఫంగస్.. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు..

  • బ్లాక్ ఫంగస్ అనేది అంటువ్యాధి కాదు
  • ఎక్కువగా షుగర్ లెవెల్స్ ఉన్నవారికి, కిడ్నీ వ్యాధులు, గుండె జబ్బులున్నవారికి.. కరోనా తగ్గి ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవారికి, అలాగే కరోనా చికిత్సలో అధికంగా స్టెరాయిడ్స్ వాడిన వారికి ఈ వ్యాధి రావొచ్చు

తీసుకోవాల్సిన జాగ్రత్తలు…

  • షుగర్ లెవెల్ పరగడుపున 125, భోజనం చేశాక 250 ఉండేలా చూసుకోండి.
  • డైట్‌లో పౌష్టికాహారం, పీచు పదార్ధాలు, సిట్రస్ జాతి పండ్లు ఉండేలా చూసుకోండి.
  • గుడ్డులోని తెల్ల భాగాన్ని తినాలి
  • ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్నవారు.. కరోనా లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించాలి.

బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఇవే…

  • కంటి కింద నొప్పి
  • ముఖంలో ఒకపక్క వాపు
  • తలనొప్పి
  • జ్వరం, ముక్కు దిబ్బడ
  • పాక్షికంగా దృష్టి లోపం.. ఇవి ప్రారంభంలో కన్పించే లక్షణాలు
  • ఇన్ఫెక్షన్ ముదిరితే.. కంటి చుట్టూ ఉండే కండరాలను స్తంభింపజేసి.. అంధత్వం వచ్చే ప్రమాదం
  • ఇన్ఫెక్షన్‌ మెదడుకు పాకితే మెనింజైటిస్(మజ్జ రోగం)కు దారితీస్తుందని నిపుణుల హెచ్చరిక
  • ప్రారంభదశలోనే బ్లాక్ ఫంగస్ ను గుర్తించకుంటే ప్రాణాపాయానికి దారి తీస్తుందని వైద్యులు అంటున్నారు.

Also Read: 

ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూ టైమింగ్ మారిందా.? ఇందులో నిజమెంత.!

ఈ ఫోటోలో ఎరను వేటాడేందుకు సింహం దాగి ఉంది.. ఎక్కడ ఉందో గుర్తుపట్టండి చూద్దాం.!