Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bitter Gourd Side Effects: ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కాకరకాయను అస్సలు తినొద్దు..

పచ్చి కూరగాయలు ఆరోగ్యానికి ఎల్లప్పుడూ చాలా మేలు చేస్తాయి. ఈ కారణంగా నిపుణులు ఎల్లప్పుడూ మీ ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలను చేర్చుకోవాలని సిఫార్సు చేస్తారు. చేదు ఈ కూరగాయలలో ఒకటి, ఇది రుచిలో చేదుగా ఉండవచ్చు, కానీ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే చాలా మంది పొట్లకాయ రుచి చూసి తినకుండా ఉంటారు.

Bitter Gourd Side Effects: ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కాకరకాయను అస్సలు తినొద్దు..
కాకరకాయ రసం మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుంది. దీని రసాన్ని అరకప్పు తీసుకుంటే శరీరంలో ఇన్సులిన్ పరిమాణం పెరుగుతుంది.
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 21, 2023 | 7:31 AM

ఆకుపచ్చ కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే నిపుణులు ఎల్లప్పుడూ ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలను చేర్చుకోవాలని సిఫార్సు చేస్తారు. ఇందులో కాకరకాయ ఒకటి. ఇది రుచికి చేదుగా ఉంటుంది. కానీ, ఆరోగ్యపరంగా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే, ఈ చేదు కారణంగానే చాలా మంది కాకరకాయను ఇష్టపడరు. తినరు. అదే సమయంలో దాని విస్తృత ప్రయోజనాల కారణంగా కాకరకాయను తమ ఆహారంలో భాగంగా చేసుకునేవారు కూడా ఉన్నారు. అయితే చేదు కొన్నిసార్లు మీకు హానికరం కూడా కలిగించొచ్చని చెబుతున్నారు నిపుణులు. అవును కాకరకాయతో కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉంటాయని చెబుతున్నారు. మరి ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

రక్తంలో చక్కెర స్థాయి తక్కువగా ఉంటే కాకరకాయను తినవద్దు. డయాబెటిక్ అయితే కాకరకాయ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే కాకరకాయ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో చాలా సహాయపడుతుంది. ఒకవేళ రక్తంలో చక్కెర స్థాయి తక్కువగా ఉంటే.. పొరపాటున కూడా కాకరకాయ తినొద్దు. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయి తగ్గే అవకాశం ఉంది. అలాగే, డయాబెటిస్‌లో దాని అధిక వినియోగం హిమోలిటిక్ అనీమియా ప్రమాదాన్ని పెంచుతుంది.

గర్భధారణ సమయంలో కాకరకాయ తినవద్దు. గర్భవతులకు కాకరకాయ హానీతలపెడుతుంది. కాకరకాయలోని మెమోర్చెరిన్ కంటెంట్ పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికి హానికరం. అటువంటి పరిస్థితిలో, గర్భధారణ సమయంలో కాకరకాయను వీలైనంత తక్కువగా తినడానికి ప్రయత్నించండి.

ఇవి కూడా చదవండి

కాలేయానికి హానికరం. కాలేయం మన శరీరంలో ముఖ్యమైన భాగం. అందుకే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజూ కాకరకాయ కూర తినడం, కాకరకాయ జ్యూస్ తాగడం చేస్తే.. కాలేయం ఆరోగ్యం దెబ్బతింటుంది. కాకరకాయలోని లెక్టిన్ కాలేయంలో ప్రోటీన్ల పరస్పర చర్యను నిరోధిస్తుంది. ఇది కాలేయ వ్యాధికి దారితీస్తుంది.

కాకరకాయను పదే పదే తీసుకోవడం వల్ల విరేచనాలు వస్తాయి. వాంతి సమస్యను పెంచుతుంది. అందుకే రోజూ కాకరకాయను తినొద్దు.

రోజూ కాకరకాయను తీసుకుంటే కడుపునొప్పి వస్తుంది. అంతే కాదు, కాకరకాయను ఎక్కువగా తీసుకోవడం వల్ల చాలా మందికి జ్వరం, తలనొప్పి వస్తుంది. మూత్రపిండాలు సైతం దెబ్బతింటాయి.

ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆది శంకరాచార్య కృతులు అధ్యయన తరగతులు.. ఎలా నేర్చుకోవాలంటే..
ఆది శంకరాచార్య కృతులు అధ్యయన తరగతులు.. ఎలా నేర్చుకోవాలంటే..
కదులుతూ కనిపించిన స్కూల్ బ్యాగ్.. ఏముందా అని చూడగా షాక్..
కదులుతూ కనిపించిన స్కూల్ బ్యాగ్.. ఏముందా అని చూడగా షాక్..
IPL 2025: ఆనాడు ధోనితో ఫొటో కోసం ఎదురుచూపులు.. కట్‌చేస్తే..
IPL 2025: ఆనాడు ధోనితో ఫొటో కోసం ఎదురుచూపులు.. కట్‌చేస్తే..
విమానం బాత్రూమ్ వ్యర్థాలు ఎక్కడికి వెళ్తాయి? నిజం తెలిస్తే..
విమానం బాత్రూమ్ వ్యర్థాలు ఎక్కడికి వెళ్తాయి? నిజం తెలిస్తే..
ఈవారం థియేటర్లలో/ ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఇవే..
ఈవారం థియేటర్లలో/ ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఇవే..
పెన్ను పట్టుకునే విధానం వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తుందని తెలుసా..
పెన్ను పట్టుకునే విధానం వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తుందని తెలుసా..
Astrology: కర్కాటక రాశిలోకి కుజుడు.. ఆ రాశుల వారు కాస్త జాగ్రత్త
Astrology: కర్కాటక రాశిలోకి కుజుడు.. ఆ రాశుల వారు కాస్త జాగ్రత్త
Video: ఇక మారవా పరాగ్.. ఫ్యాన్స్‌ ముందు ఇదేం యాటిట్యూట్
Video: ఇక మారవా పరాగ్.. ఫ్యాన్స్‌ ముందు ఇదేం యాటిట్యూట్
తెలంగాణలోని ఈ జిల్లాలకు రెయిన్ అలెర్ట్...
తెలంగాణలోని ఈ జిల్లాలకు రెయిన్ అలెర్ట్...
షారుఖ్ పాస్‌పోర్ట్ మెరూన్ రంగులో ఎందుకు ఉంది? పాస్‌పోర్ట్‌ రకాలు
షారుఖ్ పాస్‌పోర్ట్ మెరూన్ రంగులో ఎందుకు ఉంది? పాస్‌పోర్ట్‌ రకాలు