చేదుగా ఉందని చులకనగా చూడకండి.. ఆ సమస్యలకు వరం.. రోజూ ఓ గ్లాసు జ్యూస్ తాగితే..

|

Jun 11, 2024 | 3:29 PM

ప్రస్తుత కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.. అలాంటి సమస్యల్లో మధుమేహం ఒకటి.. మధుమేహ వ్యాధిగ్రస్తుల మాదిరిగానే యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగిపోతుందని వైద్య అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అయితే.. ఈ రెండు సమస్యలకు కాకారకాయ దివ్య ఔషధమని నిపుణులు చెబుతున్నారు.

చేదుగా ఉందని చులకనగా చూడకండి.. ఆ సమస్యలకు వరం.. రోజూ ఓ గ్లాసు జ్యూస్ తాగితే..
Bitter Gourd Juice
Follow us on

ప్రస్తుత కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.. అలాంటి సమస్యల్లో మధుమేహం ఒకటి.. మధుమేహ వ్యాధిగ్రస్తుల మాదిరిగానే యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగిపోతుందని వైద్య అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అయితే.. ఈ రెండు సమస్యలకు కాకారకాయ దివ్య ఔషధమని నిపుణులు చెబుతున్నారు. అయితే, కాకరకాయను ఎప్పుడు, ఎలా తీసుకోవాలి..? అనే విషయాలను తెలుసుకోవడం ముఖ్యమంటున్నారు ఆరోగ్య నిపుణులు..

మీరు యూరిక్ యాసిడ్ తోపాటు మధుమేహంతో బాధపడుతున్నట్లయితే, మీ ఈ సమస్యలకు ఉత్తమ ఔషధంగా కాకరకాయ పనిచేస్తుంది. దీనిలోని ఔషధగుణాలు, పోషకాలు పలు సమస్యలను నివారించడంలో సహాయపడతాయి.

కాకరకాయలో కాల్షియం, బీటా కెరోటిన్, పొటాషియంతో పాటు ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల, మధుమేహం, యూరిక్ యాసిడ్‌ను నియంత్రించడానికి కాకరకాయ ఉత్తమ ఔషధంగా పరిగణిస్తారు.

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కేవలం ఒక గ్లాసు కాకరకాయ రసం తాగడం వల్ల యూరిక్ యాసిడ్ తగ్గుతుంది. గ్లాసు కంటే తక్కువైన పర్లేదు కానీ.. ఎక్కువ మాత్రం తాగొద్దంటున్నారు ఆరోగ్య నిపుణులు..

విటమిన్ ఎ, సి, బీటా-కెరోటిన్, ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల, కాకరకాయ మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇన్సులిన్‌గా పనిచేస్తుంది. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.

కాకరకాయలో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కొవ్వు శాతాన్ని తగ్గించి, బరువు తగ్గడానికి సహకరిస్తాయి. ఇంకా కంటి సమస్యలను తగ్గిస్తాయి..

ఉదర సమస్యలకు, అజీర్ణం, కడుపులో మంట వంటి సమస్యలకు కాకరకాయ రసానికి మించిన సంజీవని లేదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

ఇన్ని పోషకాలు కలిగిన కాకరకాయను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే చాలా మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

(గమనిక: ఈ వార్తలో ఇచ్చిన సమాచారం సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.. దీనిని స్వీకరించే ముందు వైద్యుల సలహా తీసుకోండి. మేము దీనిని ధృవీకరించడం లేదు)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..