Sea Fish Benefits: చెరువు చేపల కంటే.. సముద్రపు చేపలే బెటర్ అంట!

చేపలు ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. అందులోనూ కొన్ని రకాల చేపల్లో ఓమేగా - 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభ్యమవుతుంది. ఇది తీసుకోవడం వల్ల జుట్టు, చర్మ సమస్యలు, శరీర ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అయితే చాలా మంది చెరువు చేపలు తింటూ ఉంటారు. చెరువు చేపల కంటే సముద్రపు చేపలు తినడం వల్ల ఇంకా మంచిదని నిపుణులు చెబుతున్నారు. సముద్రపు చేపలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని అంటున్నారు. సముద్రపు చేపలు రుచిగా కూడా ఉంటాయి. ఇంకా సముద్రపు చేపలు తినడం..

Sea Fish Benefits: చెరువు చేపల కంటే.. సముద్రపు చేపలే బెటర్ అంట!
చేపలు: చేపలు, పౌల్ట్రీ, పంది మాంసం, సముద్రపు ఆహారంతో సహా అన్ని రకాల మాంసంలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీర కణజాలాలను నిర్మించడానికి మరియు మరమ్మతు చేయడానికి అవసరం.

Edited By:

Updated on: Dec 28, 2023 | 9:19 PM

చేపలు ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. అందులోనూ కొన్ని రకాల చేపల్లో ఓమేగా – 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభ్యమవుతుంది. ఇది తీసుకోవడం వల్ల జుట్టు, చర్మ సమస్యలు, శరీర ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అయితే చాలా మంది చెరువు చేపలు తింటూ ఉంటారు. చెరువు చేపల కంటే సముద్రపు చేపలు తినడం వల్ల ఇంకా మంచిదని నిపుణులు చెబుతున్నారు. సముద్రపు చేపలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని అంటున్నారు. సముద్రపు చేపలు రుచిగా కూడా ఉంటాయి. ఇంకా సముద్రపు చేపలు తినడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

కీళ్ల నొప్పులు తగ్గుతాయి:

చెరువు చేపల కంటే సముద్రపు చేపలు తినడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. సముద్రపు చేపల్లో విటమిన్ డి కూడా అధికంగా ఉంటుంది. దీని వల్ల ఎముకలు బలంగా, దృఢంగా ఉంటాయి. ముఖ్యంగా చిన్న పిల్లలకు సముద్రపు చేపలు తినిపించడం చాలా మంచిది.

రోగ నిరోధక శక్తి ఎక్కువ:

సముద్రపు చేపలు తినడం వల్ల రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. దీని వల్ల పలు రకాల వ్యాధులు, ఇన్ ఫెక్షన్లు దరి చేరకుండా ఉంటాయి. అలాగే సముద్రంలో ఉండే చేపలు, రొయ్యలు, పీతలు వంటి వాటిల్లో ఎక్కువగా జింక్ అధికంగా ఉంటుంది. జింక్ అధికంగా ఉండే వాటిని తినడం వల్ల ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

ఓమేగా – 3 ఫ్యాటీ యాసిడ్స్ శాతం ఎక్కువ:

చెరువు చేపల కంటే.. సముద్రపు చేపల్లో ఓమేగా – 3 ఫ్యాటీ యాసిడ్స్ లెవల్స్, సెలీనియం అధికంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఎన్నో రోగాల నుంచి కాపాడతాయి. అదే విధంగా మానసిక ఆరోగ్యాన్ని కూడా పెంచుతాయి. వీటిని తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది.

కంటిచూపు మెరుగు పడుతుంది:

కంటి చూపును మెరుగు పరిచే శక్తి సముద్రపు చేపలకు ఉంది. ఇందులో ఉండే ఓమేగా – 3 యాసిడ్స్, విటమిన్స్ కారణంగా కంటి చూపు మెరుగు పడుతుంది. అంతే కాకుండా వృద్ధాప్యంలో వచ్చే కంటి సమస్యలు కూడా దరి చేరకుండా ఉంటాయి.

డిప్రెషన్ దూరం:

మానసిక ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలతో బాధపడే వారు సముద్రపు చాపలు తినడం వల్ల ఈ సమస్యలు అదుపు అవుతాయి. ఈ చేపల్లో ఉండే పోషకాలు ఒత్తిడిని తట్టుకునే శక్తిని అందిస్తాయి. మెదడు పని తీరు కూడా మెరుగు పడుతుంది. మతి మరుపు తగ్గి.. జ్ఞాపక శక్తి పెరుగుతుంది.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..