భారతీయులు ఎక్కువగా ఉపయోగించే మసాలా దినుసుల్లో నల్ల యాలకులు కూడా ఒకటి. ఇవి చూడటానికి చిన్నగా కనిపించినా.. మంచి సువాసనను కలిగి ఉంటాయి. ముఖ్యంగా వీటిని ఆహారంలో రుచిని పెంచుకోవడానికి ఉపయోగిస్తారు. వీటిని స్వీట్ల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. సాధారణంగా అందరూ పచ్చ యాలకులనే ఉపయోగిస్తారు. కానీ నల్ల యాలకులు కూడా ఉన్నాయన్న సంగతి ఎవరికీ తెలీదు. ప్రస్తుతం మార్కెట్లో నల్ల యాలకులు కూడా విరివిగా లభ్యమవుతున్నాయి. ఇందులో చాలా రకాల పోషకాలతో పాటు ఔషధ గుణాలు కూడా ఉంటాయి. వీటిని ప్రతి రోజూ వినియోగించడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
తరచుగా నల్ల యాలకులను ఆహారంతో పాటు తీసుకోవడం వల్ల శరీరంలో వచ్చే నొప్పులు తగ్గుతాయి. అందులోనూ ప్రస్తుతం శీతా కాలంలో చాలా బాడీ పెయిన్స్ తో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి వారు నల్ల యాలకులతో తయారు చేసే టీ తాగినా, ఆహారం తిన్నా చాలా మంచిది. అంతే కాకుండా శరీరంపై వచ్చే వాపులు కూడా తగ్గుతాయి.
నల్ల యాలకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఉదయం గ్రీన్ టీతో పాటు నల్ల యాలకుల పొడిని మిక్స్ చేసుకుని తాగితే శరీరంలో ఫ్రీ రాడికల్స్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
ప్రస్తుతం ఇప్పుడు మారుతున్న లైఫ్ స్టైల్ కారణంగా చాలా మంది గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. సడెన్ గా హార్ట్ స్ట్రోక్ వచ్చి చిన్న వయసులోనే మరణిస్తున్నారు. ఇలాంటి గుండె సమస్యలతో బాధ పడేవారు నల్ల యాలకులతో తయారు చేసిన ఆహారాన్ని తినడం వల్ల ఆ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
నల్ల యాలకులతో తయారు చేసే ఆహారం తరుచుగా తినడం వల్ల నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది. అలాగే నోటి ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది.
నల్ల యాలకులను ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్త ప్రసరణ కూడా మెరుగు పడుతుంది. దీని వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.
గొంతు నొప్పితో ఇబ్బంది పడే వారు సైతం నల్ల యాలకులతో తయారు చేసిన టీ తాగడం వల్ల ఆ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. దగ్గు ఉన్న వారు కూడా నల్ల యాలకుల పొడిని తీసుకుంటే తగ్గుతుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.