Lemon water: ప్రతి రోజూ ఒక గ్లాస్‌ లెమన్‌ వాటర్‌.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..

|

May 05, 2022 | 4:07 PM

Summer Tips: నిమ్మకాయలతో ఎలాంటి ప్రయోజనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వంటకాలకు రుచిని అందించే వీటిని షింక్‌ జీ, లెమన్‌ సోడా తదితర హెల్దీ డ్రింక్స్‌ల్లో కూడా వినియోగిస్తుంటారు.

Lemon water: ప్రతి రోజూ ఒక గ్లాస్‌ లెమన్‌ వాటర్‌.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..
Lemon
Follow us on

Summer Tips: నిమ్మకాయలతో ఎలాంటి ప్రయోజనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వంటకాలకు రుచిని అందించే వీటిని షింక్‌ జీ, లెమన్‌ సోడా తదితర హెల్దీ డ్రింక్స్‌ల్లో కూడా వినియోగిస్తుంటారు. అంతేకాదు నిమ్మకాయలోని పోషకాలు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి. ఇక వేసవిలో నిమ్మరసం (Lemon Water) వేడిమి నుంచి ఉపశమనం ఎంతో అందిస్తోంది. ఇందులోని విటమిన్లు సి, బి, ఇ, ఐరన్‌, క్యాల్షియం తదితర పోషకాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ముఖ్యంగా సి- విటమిన్‌ శరీరంలోని ఫ్రీ రాడికల్స్ దెబ్బతినకుండా కణాలను రక్షిస్తుంది. అదేవిధంగా రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది. ఇది స్ట్రోక్, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడతాయి. అయితే కేవలం వేసవిలోనే కాదు ప్రతిరోజూ తగినంత నిమ్మరసం తీసుకుంటే బోలెడు ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు.. మరి అవేంటో తెలుసుకుందాం రండి.

బరువు తగ్గొచ్చు..

ప్రతిరోజూ కాస్త నిమ్మరసం తీసుకోవడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇది జీవక్రియను వేగవంతం చేస్తుంది. కాబట్టి వేగంగా బరువు తగ్గచ్చు. ఇందులో పెక్టిన్ అనే పీచు పదార్థం ఉంటుంది. ఇది మీకు తక్కువ ఆకలిని కలిగిస్తుంది. దీని వల్ల చాలా సేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. కాబట్టి బరువు తగ్గి స్లిమ్‌ అవ్వాలనుకునేవారికి లెమన్‌ వాటర్‌ మంచి ప్రత్యామ్నాయం.

ఇవి కూడా చదవండి

డీహైడ్రేషన్‌ దూరం

వేసవిలో మనం ఎక్కువగా డీహైడ్రేషన్‌కు గురవుతుంటాం. ఇటువంటి పరిస్థితుల్లో లెమన్‌ వాటర్‌ మనల్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. అంతేకాదు శరీరానికి హాని కలిగించే వ్యర్థపదార్థాలను, ట్యాక్సిన్లను బయటకు పంపించడంలో బాగా తోడ్పడుతుంది.

జీర్ణక్రియ రేటు..

ఉదయాన్నే కాస్త నిమ్మరసం తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది. మలబద్దకం, అజీర్తి సమస్యలు కూడా తొలగిపోతాయి. గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు.

మేని మెరుపు కోసం..

నిమ్మరసంలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది శరీరం నుండి విష పదార్థాలను తొలగిస్తుంది. అంతేకాదు చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది.

ఇమ్యూనిటీని పెంచుతుంది..

నిమ్మకాయలో విటమిన్ సి, పొటాషియం ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అందుకే నిమ్మరసం తీసుకుంటే చాలాసేపటి వరకు ఎనర్జిటిక్‌గా ఉంటారు. వేసవిలో నీరసం, అలసటను తొలగిస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Viral Video: ఇతనికి ఫిట్‌నెస్‌ అంటే ఎంత ప్రేమో.. కింద పడిపోయినా ఆపట్లేదుగా.. నెట్టింట్లో నవ్వులు పూయిస్తోన్న వీడియో..

Sarkaruvaari Paata: ఆర్‌ఆర్ఆర్‌, కేజీఎఫ్‌2 బాటలోనే సర్కారు వారి పాట.. మహేశ్‌ సినిమా ఎంతసేపు ఉండనుందంటే..

Viral Video: నాటు నాటు పాటకు పెళ్లికూతురు అదిరిపోయే డ్యాన్స్.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..