Health Tips: ఈ పండ్లను తొక్కతో కలిపి తింటే ఆరోగ్యానికి మంచిది.. అవెంటో తెలుసా..
మనం రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి.. ఆరోగ్యంగా ఉండేందుకు పండ్లు.. కూరగాయలు ఎక్కువగా తీసుకుంటాం. ప్రస్తుతం వేసవిలో ఎక్కువగా నీరు ఉండే పండ్లు..
మనం రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి.. ఆరోగ్యంగా ఉండేందుకు పండ్లు.. కూరగాయలు ఎక్కువగా తీసుకుంటాం. ప్రస్తుతం వేసవిలో ఎక్కువగా నీరు ఉండే పండ్లు.. కూరగాయాలు తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అయితే అందులో ఎక్కువగా తొక్క తీసి తింటుంటారు. అలాగే మరికొన్నింటిని తొక్క తియకుండానే తింటారు. కానీ.. కొన్ని రకాల ఆహార పదార్థాలకు తొక్కను తీసి తినడం వలన ఎన్నో పోషకాలను కోల్పోతాము. తొక్కతోనే పదార్థాలను తీసుకోవడం వలన ఆరోగ్యానికి అనేక రకాల పోషకాలు అందుతాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. పోషకాహార నిపుణుడు.. రుజుతా దివేకర్ తన సోషల్ మీడియా ఖాతాలో పండ్లు.. కూరగాయలు తొక్కలతో తీసుకుంటే అనేక ప్రయోజనాలున్నాయని తెలిపారు. కొన్ని పండ్లలో ఎక్కువగా పోషక విలువులు ఉన్నాయని..అలాంటి పండ్ల తొక్కలను సలాడ్స్ గా .. గ్రైండ్ చేసి పేస్ట్ గా తీసుకోవాలని సూచించారు. అయితే తొక్కతో ఎలాంటి పండ్లు, కూరగాయలు తీసుకోవాలో తెలుసుకుందామా.
పుచ్చకాయ.. పుచ్చకాయ తొక్క తినడం చాలా సురక్షితం. ఇందులో విటమిన్ సి, ఎ, సి, బీ6, పొటాషియం, జింక్ పుష్కలంగా ఉంటాయి. తొక్కను తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా.. రక్తపోటు తగ్గడం, బరువు తగ్గడం వంటివి జరుగుతుంటాయి.
మామిడి పండు.. మామిడి పండు తొక్కలో అనేక పోషకాలున్నాయి. ముఖ్యంగా పచ్చి మామిడి తొక్కలో శరీరానికి అవసరమైన విటమిన్ ఎ, సి, ఫైటోన్యూట్రియెంట్స్ ఉంటాయి. విటమిన్ ఎ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్ సి గాయాలను నయం చేయడంలో సహయపడుతుంది. ఈ మామిడి తొక్కలో ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఫైబర్ కంటెంట్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది, ఫైటోన్యూట్రియెంట్లు కొలెస్ట్రాల్, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
చిలగడ దుంప.. చిలగడ దుంప తొక్కలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఎ పుష్కలంగా ఉంటాయి. తొక్క కంటి చూపును మెరుగుపరచడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇందులో పొటాషియం, ఐరన్, విటమిన్లు సి, ఇ ఉన్నాయి. ఇవి శరీరాన్ని అనేక వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడతాయి.
దోసకాయ దోసకాయ తొక్కలో విటమిన్ కె, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అలాగే కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. విటమిన్ కె శరీరంలో ప్రోటీన్లను సక్రియం చేస్తుంది. ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీనితో పాటు ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.
ఆరెంజ్ ఆరెంజ్ తొక్కలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు సి, ఎ, ఫైబర్, పెక్టిన్‌లతో నిండి ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంపొందించడంతోపాటు శ్వాసకోశ వ్యవస్థను శుభ్రపరచడంలో ఉపయోగపడుతుంది.
నిమ్మకాయ నిమ్మకాయ తొక్కలో పొటాషియం, విటమిన్ సి, కాల్షియం ఉంటాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం నిమ్మ తొక్క తక్కువ కొలెస్ట్రాల్ స్థాయిలు, క్యాన్సర్‌తో పోరాడడం, ఎముకల ఆరోగ్యం, నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
బంగాళదుంప.. బంగాళదుంప తొక్కలో పొటాషియం, ఐరన్, నియాసిన్ పుష్కలంగా ఉంటాయి. పొటాషియం జీవక్రియను పెంచుతుంది. ఐరన్ ఎర్ర రక్త కణాలు సమర్థవంతంగా పనిచేయడానికి సహాయపడుతుంది. నియాసిన్ అకా విటమిన్ B-3 ఇంధనం కోసం పోషకాలను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది.
కివి.. కివి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహయపడుతుంది. అలాగే దాని పై తొక్కలో ఫైబర్, ఫోలేట్, విటమిన్ ఇ పుష్కలంగా ఉన్నాయి. ఇది గుండె, క్యాన్సర్, మధుమేహానికి మంచిది.
వంకాయ వంకాయ తొక్కలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. పీల్ తీసుకోవడం వల్ల ప్రేగు కదలికలు మెరుగుపడతాయి, బరువు నిర్వహణకు కూడా తోడ్పడుతుంది.
గమనిక:- ఈ కథనం కేవలం నిపుణుల అభిప్రాయాలు..నివేదికల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది.. దీనిని టీవీ 9 తెలుగు దృవీకరించలేదు.. అమలు చేయడానికి ముందుగా వైద్యులను సంప్రదించాలి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Also Read: KGF Chapter 2: బాక్సాఫీస్ వద్ద కేజీఎఫ్ 2 ఊచకోత.. ఆమీర్ ఖాన్ దంగల్ రికార్డ్ బ్రేక్..
Viral Video: నాటు నాటు పాటకు పెళ్లికూతురు అదిరిపోయే డ్యాన్స్.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..