Urine Color: 6 రంగుల్లోని మూత్రం మీ ఆరోగ్య స్థితిని చెబుతుంది.. మరి మీ ఆరోగ్యం ఎలా ఉందో ఇప్పుడే తెలుసుకోండి..

ప్రతి ఆరోగ్యవంతమైన వ్యక్తి 24 గంటల్లో కనీసం 7 నుంచి 8 సార్లు మూత్ర విసర్జన చేస్తాడు. ఇది సహజమైన ప్రక్రియ మన ఆరోగ్యానికి కూడా అవసరం. ఎందుకంటే మూత్రంతో పాటు శరీరంలో ఉత్పత్తి అయ్యే టాక్సిన్స్ కూడా బయటకు..

Urine Color: 6 రంగుల్లోని మూత్రం మీ ఆరోగ్య స్థితిని చెబుతుంది.. మరి మీ ఆరోగ్యం ఎలా ఉందో ఇప్పుడే తెలుసుకోండి..
Urine Color
Follow us

|

Updated on: May 05, 2022 | 8:01 PM

ప్రతి ఆరోగ్యవంతమైన వ్యక్తి 24 గంటల్లో కనీసం 7 నుంచి 8 సార్లు మూత్ర విసర్జన(Urine) చేస్తాడు. ఇది సహజమైన ప్రక్రియ మన ఆరోగ్యానికి కూడా అవసరం. ఎందుకంటే మూత్రంతో పాటు శరీరంలో ఉత్పత్తి అయ్యే టాక్సిన్స్ కూడా బయటకు వస్తాయి. అయితే, మూత్రం పని ఇక్కడితో ముగియదు. బదులుగా ఇది మీ ఆరోగ్య పరిస్థితి గురించి కూడా చెబుతుంది. మూత్రంను ల్యాబ్ పరీక్ష కాకుండా, మీరు మీ మూత్రం రంగు ఆధారంగా అనేక రకాల వ్యాధులను గుర్తించవచ్చు. ఈ కథనంలో దీని గురించి మరింత తెలుసుకోండి…

ముందు ఈ సంగతి తెలుసుకోండి

మూత్రం రంగు(Urine Color) గురించి మాట్లాడే ముందు, మీరు మూత్రం విసర్జించే పరిమాణంపై శ్రద్ధ వహించాలి. ఎందుకంటే మీరు రోజుకు ఎన్నిసార్లు మూత్రాన్ని విసర్జిస్తారు. ఈ మూత్రం రంగు ఏమిటి, ఈ విషయాలతో పాటు అది ఎంత మొత్తంలో ఉంటుందనేది కూడా చాలా ముఖ్యం. ఎందుకు కొందరికి పదే పదే మూత్రం వస్తుంది. కానీ వాష్‌రూమ్‌కి వెళ్లినప్పుడు చుక్కలు.. చుక్కలుగా మూత్రం వస్తుంది. ఈ పరిస్థితి చాలా సందర్భాలలో నిర్జలీకరణాన్ని కూడా చూపుతుంది.

ఇవి కూడా చదవండి

మూత్రం రంగు

ఆరోగ్యకరమైన వ్యక్తి మూత్రం రంగు నీరు లేదా చాలా లేత పసుపు రంగులో స్పష్టంగా ఉంటుంది. శరీరం లోపల నిరంతరం ఉత్పత్తి అయ్యే యూరోక్రోమ్ అనే రసాయనం దీనికి కారణం. ఇవి కాకుండా మూత్రం రంగు ఎలా ఉంది. ఎందుకు అలా వస్తోందో తెలుసుకోండి..

1. లేత పసుపు రంగు

లేత పసుపు రంగు కూడా ఒక రోజులో మీరు త్రాగే నీరు మీ శరీరానికి సరిపోదు అని సంకేతం. కాబట్టి మీరు ఎక్కువ మొత్తంలో నీరు తాగడం ప్రారంభించండి. ఇది కాకుండా, మూత్రపిండ వ్యాధి లేదా మధుమేహం కారణంగా కూడా మూత్రం రంగు లేత పసుపు రంగులో ఉంటుంది.

2. చిక్కటి పసుపు రంగు మూత్రం ముదురు పసుపు రంగు మీ శరీరం డీహైడ్రేట్ అవుతుందనడానికి సంకేతం. అంటే శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. మీరు ప్రతిరోజూ 8 నుండి 10 గ్లాసుల నీరు త్రాగడం, పాలు, నిమ్మరసం, కొబ్బరి నీరు త్రాగటం ద్వారా మీ శరీరంలో హైడ్రేషన్ లోపాన్ని భర్తీ చేయవచ్చు. ఇలా చేయడం వల్ల మూత్రం రంగు మారిపోతుంది.

3. మేఘావృతం లేదా పొగమంచు రంగు

మూత్రం రంగు మారడం అనేది అనేక తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు సంకేతం. ఇది మూత్రాశయం ఇన్ఫెక్షన్ వల్ల.. అనేక ఇతర తీవ్రమైన వ్యాధుల వల్ల కూడా జరుగుతుంది. అందువల్ల, ఈ పరిస్థితిలో వైద్యుడిని సంప్రదించడం మంచిది.

4. ఎరుపు రంగు మూత్రం అనేక కారణాల వల్ల మూత్రం రంగు ఎరుపుగా ఉంటుంది. ముందుగా మీ ఆహారం, మీరు బీట్‌రూట్ తింటే లేదా డైట్‌లో దాని రసాన్ని తాగితే మూత్రం రంగు ఎర్రగా మారుతుంది. ఇది మందుల వల్ల కూడా జరగడానికి ఛాన్స్ ఉంది.  ఇంకా మూత్రం ఎరుపు రంగులో ఉంటే మూత్రంలో రక్తం వస్తున్నట్లు అర్థం. మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది కిడ్నీ వ్యాధి, కిడ్నీ ఇన్ఫెక్షన్, అంతర్గత గాయం లేదా క్యాన్సర్ వంటి తీవ్రమైన సమస్య వల్ల కూడా ఇలా జరగవచ్చు.

5. మూత్రం రంగు గోధుమ రంగులో ఉంటే.. కాలేయం లేదా పిత్తాశయం అంటే గాల్ బ్లాడర్‌లో ఇన్ఫెక్షన్ కారణంగా బ్రౌన్ కలర్ మూత్రం వస్తుంది. ఇవి కాకుండా, పిత్త వాహికలో ఏవైనా అడ్డుపడటం లేదా గాయం కారణంగా కూడా ఇలా జరగవచ్చు. బ్లాడర్ ఇన్ఫెక్షన్ కూడా దీనికి కారణం కావచ్చు.

6. ఆకుపచ్చ-గోధుమ రంగులో ఉండే మూత్రం ఎక్కువగా ఇంగ్లీషు మందులు తీసుకోవడం.. రంగు రంగుల ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం ఈ వింత రంగు మూత్రానికి కారణం కావచ్చు. కానీ మీరు ఇలా ఏమీ చేయకపోయినా ఇంకా ఆకుపచ్చ-గోధుమ రంగులో మూత్రం వస్తుంటే.. మీరు వెంటనే డాక్టర్ వద్దకు వెల్లండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

హెల్త్ వార్తల కోసం 

ఇవి కూడా చదవండి: PK Mission: కొత్త పార్టీ పెట్టడం లేదు.. పాదయాత్ర చేస్తాను.. ఆయన పాలనపై పీకే కీలక వ్యాఖ్యలు..

Terrorist Attack Plan: పాక్‌ నుంచి డ్రోన్‌ల సహాయంతో పేలుడు పదార్దాలు.. ఆదిలాబాద్‌లో భారీ ఉగ్ర కుట్రకు పాకిస్తాన్‌లో ప్లాన్‌..

ఉత్కంఠ పోరులో వైసీపీకే దుగ్గిరాల ఎంపీపీ పీఠం.. వ్యూహాత్మకంగా గెలిచిన రూపవాణి..

 

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.