Acidity Prevention Tips: మీరు ఎసిడిటితో బాధపడుతున్నారా..? ఇలాంటి చిట్కాలు పాటించినట్లయితే ఎంతో ప్రయోజనం..!

Acidity Prevention Tips: చాలా మందికి ఎసిడిటీ సమస్య ఉంటుంది. తినే ఆహార అలవాట్లు, రకరకాల ఆహార పదార్థాలు తినడం, సమయానికి భోజనం చేయకపోవడం ఇలా రకరకాల..

Acidity Prevention Tips: మీరు ఎసిడిటితో బాధపడుతున్నారా..? ఇలాంటి చిట్కాలు పాటించినట్లయితే ఎంతో ప్రయోజనం..!
Follow us

|

Updated on: Oct 19, 2021 | 3:31 PM

Acidity Prevention Tips: చాలా మందికి ఎసిడిటీ సమస్య ఉంటుంది. తినే ఆహార అలవాట్లు, రకరకాల ఆహార పదార్థాలు తినడం, సమయానికి భోజనం చేయకపోవడం ఇలా రకరకాల కారణాల వల్ల ఈ సమస్య వస్తుంటుంది. చాలా మంది ఏదైనా కాస్త తినగానే తేన్పులు, ఆవలింతలు వంటివి వస్తుంటాయి. ఎక్కువగా తినడం, సమయం కాని సమయంలో తినడం, భోజనాల మధ్య ఎక్కువ గ్యాప్​ పాటించడం వల్ల ఈ సమస్య తీవ్రమవుతుంది. మరోవైపు, ఒత్తిడితో కూడిన జీవనశైలి, హానికరమైన ఆహారం వంటి అనేక అంశాలు ఎసిడిటీకి దారితీస్తాయి. అయితే కొన్ని సాధారణ జీవనశైలి మార్పులతో ఎసిడిటీని నివారించవచ్చు. ఎసిడిటీ నివారణకు అనేక చిట్కాలను సూచిస్తున్నారు ఆయుర్వేద నిపుణులు.

ఎసిడిటీ రాకుండా పాటించాల్సిన చిట్కాలు ఇవే..

► ఎక్కువగా కారం, పులుపు, ఉప్పు, పులియబెట్టిన, వేయించిన, ఫాస్ట్ ఫుడ్ తినడాన్ని మానుకోండి.

► ఏ ఆహారమైనా సరే సమతుల్యంగా తినండి. అతిగా తింటే కూడా ప్రమాదమే.

► పుల్లని పండ్లకు సాధ్యమైనంత దూరంగా ఉండటం మంచిది.

► సమయానికి భోజనం చేయకుండా ఉండకపోవడం మంచిది.

► ధూమపానం, ఆల్కహాల్, టీ, కాఫీ, ఆస్పిరిన్ వంటి తరచూ తీసుకోవడం మానుకోండి.

► రాత్రి పడుకునే సమయంలో తినకండి. పడుకోవడానికి కనీసం గంట ముందు డిన్నర్​ చేయండి.

► మాంసాహారం ఎక్కువగా తినకపోవడమే మంచిది.

► మీ కూరల్లో అధిక మొత్తంలో వెల్లుల్లి, ఉప్పు, నూనె, మిరపకాయలు లేకుండా చూసుకోండి.

►  బిజీ పనుల వల్ల భోజనాన్ని ఆలస్యం చేయకండి.

► రోజూ క్రమ పద్ధతిలో సమయం ప్రకారం తినడం అలవాటు చేసుకోండి.

► భోజనం చేసిన వెంటనే, పడుకోవడం మానుకోండి. ఇది మీ పొట్ట భాగంలో ఆహారం మిగిలిపోయేలా చేస్తుంది. ఇది వల్ల ఎసిడిటి ఎదురవుతుంది.

ఇప్పటికే ఎసిడిటీతో బాధపడుతుంటే?

ఇప్పటికే ఎసిడిటీతో బాధపడుతున్న వారు కొన్ని సులభమైన ఇంటి నివారణ చిట్కాలను పాటించినట్లయితే మంచి ప్రయోజనం ఉంటుంది.

►  ప్రతి రోజూ కొన్ని కొత్తిమీర వాటర్​ తాగండి.

► ఖాళీ కడుపుతో కొన్ని నానబెట్టిన ఎండుద్రాక్షలను తినండి.

► భోజనం తర్వాత అర టీస్పూన్ సోంపు గింజలను నమలండి.

► మధ్యాహ్నం సమయంలో కొబ్బరి నీళ్లు లేదా షర్బత్ రసం తాగండి.

► తగినంత విశ్రాంతి తీసుకోండి, తగినంత నీరు తాగండి. మంచి నిద్ర, యోగా, ప్రాణాయామం, ధ్యానం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.

► నిద్రవేళలో 1 టీస్పూన్ ఆవు నెయ్యితో గోరువెచ్చని పాలు తీసుకోండి. ఇది మీ నిద్రలేమి, మలబద్ధకానికి చెక్​ పెడుతుంది.

► రోజ్ వాటర్, పుదీనా నీరు తాగండి, ఇది మీ జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది.

ఇవీ కూడా చదవండి:

Praising Children: పిల్లలను అతిగా ప్రశంసిస్తున్నారా..? అయితే జాగ్రత్త.. తాజా పరిశోధనలో కీలక విషయాలు..!

Vaccine: ఏయే వ్యాధులకు ఇంకా వ్యాక్సిన్లు అందుబాటులోకి రాలేదు.. ఎంతో మంది మరణిస్తున్నా.. తయారు కానీ టీకాలు!

Women Health Tips: మహిళలు ఈ ఆహార పదార్థాలను తీసుకుంటే ఆ సమస్యలు దూరం..!

Blood Sugar Levels: చెమటతో రక్తంలో షుగర్‌ లెవల్స్‌ గుర్తింపు.. కొత్త డివైజ్‌ను తయారు చేసిన అమెరికా పరిశోధకులు..!

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..