Constipation Relief Foods: పాప్ కార్న్ తినండి.. మలబద్ధకానికి చెక్ పెట్టండి!

మారిన ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది విసర్జన చేయడానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మలబద్ధకంగా ఉంటే ఆకలి వేసినా.. ఏమీ తినాలని, తాగాలని అనిపించదు. ఒక రకంగా చెప్పాలంటే ఇది కూడా పొట్ట సమస్యే అనొచ్చు. మలబద్ధకం కారణంగా మానసిక సమస్యలు కూడా ఎదురవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వీలైనంత వరకూ ఈ సమస్య నుంచి ఎంత సులభంగా ఉపశమనం పొందితే అంత మంచిది. ఇలాంటి సమస్యలను..

Constipation Relief Foods: పాప్ కార్న్ తినండి.. మలబద్ధకానికి చెక్ పెట్టండి!
Popcorn

Edited By: Ravi Kiran

Updated on: Dec 17, 2023 | 12:36 PM

మారిన ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది విసర్జన చేయడానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మలబద్ధకంగా ఉంటే ఆకలి వేసినా.. ఏమీ తినాలని, తాగాలని అనిపించదు. ఒక రకంగా చెప్పాలంటే ఇది కూడా పొట్ట సమస్యే అనొచ్చు. మలబద్ధకం కారణంగా మానసిక సమస్యలు కూడా ఎదురవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వీలైనంత వరకూ ఈ సమస్య నుంచి ఎంత సులభంగా ఉపశమనం పొందితే అంత మంచిది. ఇలాంటి సమస్యలను ఎదుర్కొనడానికి ముఖ్య కారణం ఆహారపు అలవాట్లు.

మీరు తీసుకునే ఆహారంలో ఫైబర్, నీటి శాతం తక్కువగా ఉన్న ఆహారాలు తీసుకుంటే.. తిన్న ఆహారం జీర్ణం కాక మలబద్ధకం సమస్యను ఎదుర్కొనాల్సి ఉంటుంది. కాబట్టి మీ ఆహారంలో ఖచ్చితంగా మార్పులు చేసుకోండి. ఈ సమస్య నుంచి బయట పడేయటంలో పాప్ కార్న్ బాగా సహాయ పడుతుంది. అదెలా అనుకుంటున్నారా.. ఇప్పుడు చూద్దాం.

పాప్ కార్న్:

చాలా మంది సినిమాలకు వెళ్లినప్పుడు లేదా టైమ్ పాస్ గా కూడా పాప్ కార్న్ తింటూ ఉంటారు. చాలా మంది ఇది తింటే కడుపు ఉబ్బరంగా ఉంటుందనుకుంటారు. కానీ నిజానికి పాప్ కార్న్ తీసుకోవడం వల్ల మల బద్ధకం సమస్య నుంచి త్వరగా బయట పడొచ్చు. ఎందుకంటే ఇందులో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి రోజూ సాయంత్రం పూట పాప్ కార్న్ తింటే చాలా మంచిది.

ఇవి కూడా చదవండి

ఓట్స్:

తరుచుగా ఓట్స్ తినడం వల్ల కూడా మల బద్ధకం సమస్య నుంచి బయట పడొచ్చు. ఓట్స్ లో ఫైబర్ అనేది అధికంగా ఉంటుంది. దీని కారణంగా తిన్న ఆహారం త్వరగా జీర్ణమైన.. మల విసర్జన అవుతుంది. అంతే కాకుండా జీర్ణ, పొట్ట సమస్యల నుంచి కూడా ఉపశమనం పొంద వచ్చు. మల బద్ధకం సమస్యతో ఇబ్బంది పడేవారు తరుచుగా ఓట్స్ ని తీసుకోవడం బెటర్.

చిలగడ దుంప:

శీతా కాలంలో మాత్రమే కేవలం ఈ చిలగడ దుంప లభ్యమవుతుంది. కాబట్టి వీలైనంత వరకు దీన్ని తీసుకోవడానికి ట్రై చేయండి. ఇది తినడం వల్ల మల బద్ధకం సమస్యల తగ్గుముఖం పడుతుంది. ఇందులో ఫైబర్ కంటెంట్, నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా చిలగడ దుంపలో ఉండే గుణాలు.. ప్రేగులను శుభ్రం చేసేందుకు హెల్ప్ చేస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.