AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రోటీన్ ఫుడ్ అధికంగా తీసుకుంటున్నారా..? శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?

ప్రోటీన్ శరీరానికి అవసరమైన పోషకం అయినప్పటికీ, అధిక మోతాదులో తీసుకోవడం ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. శరీర బరువుకు తగిన మోతాదులోనే ప్రోటీన్ తీసుకోవాలి. ప్రోటీన్ అధికంగా తీసుకోవడం వల్ల దాహం, నీరసత, తలనొప్పి, మలబద్ధకం, నోటి దుర్వాసన వంటి సమస్యలు ఏర్పడతాయి. ఇది మూత్రపిండాలపై అధిక భారం వేస్తుంది. చికెన్, గుడ్లు, రొయ్యలు వంటి ఆహారాలు శరీరంలో వేడి పెంచి ఒంటినొప్పులు కలిగిస్తాయి.

ప్రోటీన్ ఫుడ్ అధికంగా తీసుకుంటున్నారా..? శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
Protein Rich Food
Prashanthi V
|

Updated on: Jan 23, 2025 | 8:26 PM

Share

ప్రోటీన్ శరీరానికి అత్యవసరమైన పోషకాల్లో ఒకటి. కండరాల నిర్మాణం, కణాల మరమ్మతు, శక్తి సాధనలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ప్రోటీన్ అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావాలను చూపుతుంది. ముఖ్యంగా జిమ్ ట్రైనింగ్ లేదా డైట్ కారణంగా ఎక్కువ ప్రోటీన్ తీసుకునే వారిలో ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ప్రతి వ్యక్తి శరీర బరువుకు తగినంత ప్రోటీన్ మాత్రమే తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ప్రోటీన్ లిమిటెడ్ గా తినకుంటే

మన శరీర బరువును బట్టి రోజుకు ఒక కిలోకు 0.8 గ్రాముల ప్రోటీన్ అవసరం. దీనికంటే అధికంగా తీసుకుంటే శరీరంలో ప్రోటీన్ విషపదార్థాలుగా మారి  అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం మూలంగా మూత్రపిండాలు అధికంగా పనిచేయాల్సి వస్తుంది. శరీరంలోని వ్యర్థాలు బయటకు పంపేందుకు ఇవి చాలా కష్టపడతాయి. దీని ఫలితంగా శరీరం నీరసిస్తుంది.

తీవ్రమైన దాహం

ప్రోటీన్ అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో నీటి అవసరం పెరుగుతుంది. దీనివల్ల ఎక్కువ దాహం వేయడమే కాకుండా.. తాగిన నీరు కూడా శరీరానికి సరిపోదు. ఈ పరిస్థితి శరీరానికి బలహీనతను తెస్తుంది. తలనొప్పి, ఒంటిలో అలసట వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇది ముఖ్యంగా ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకునే వారిలో కనిపించే సాధారణ సమస్య.

నోటి దుర్వాసన

ప్రోటీన్ అధికంగా తీసుకునే వారికి నోటి నుంచి దుర్వాసన సమస్య కలగడం సహజమే. ప్రోటీన్ డైజెస్ట్ అయినప్పుడు రెండు రకాల ఆమ్లాలు ఉత్పత్తి అవుతాయి. ఇవి తీవ్రమైన దుర్గంధాన్ని కలిగిస్తాయి. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఎక్కువగా నీళ్లు తాగడం మంచిది.

మలబద్ధకం, జీర్ణక్రియలో సమస్య

ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యలు, ముఖ్యంగా మలబద్ధకం ఎక్కువగా ఎదురవుతాయి. కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఈ సమస్య మరింత తీవ్రంగా మారుతుంది. కాబట్టి ప్రోటీన్ ఆహారంతో పాటు సరైన మోతాదులో కార్బోహైడ్రేట్లు ఉండే ఆహారాన్ని కూడా తీసుకోవడం మంచిది.

ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు

మటన్, చికెన్, గుడ్లు, చేపలు, పాలు, పెరుగు, చీజ్, బాదం, జీడిపప్పు, వాల్నట్స్, బీన్స్, శెనగలు వంటి ఆహారాలలో ప్రోటీన్ పుష్కలంగా లభిస్తుంది. ఇవి తగిన మోతాదులో తీసుకుంటేనే శరీరానికి మేలు చేస్తాయి. మరీ అధికంగా తీసుకుంటే మాత్రం పలు సమస్యలు తలెత్తుతాయి.

ఒంటినొప్పులు, వేడి ప్రభావం

చికెన్, గుడ్లు, రొయ్యలు వంటి ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారాలు శరీరానికి వేడి కలిగిస్తాయి. వీటిని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల ఒంటి నొప్పులు, అలసట వంటి సమస్యలు ఏర్పడతాయి. అందువల్ల ప్రోటీన్‌తో కూడిన ఆహారాన్ని సమతులంగా తీసుకోవడమే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రోటీన్ శరీరానికి ఎంతో ముఖ్యమైన పోషకం అయినప్పటికీ, దానిని లిమిటెడ్ గా తీసుకోవడం అనేది ఆరోగ్యానికి ఎంతో మంచిది.