కొప్పు ఉన్న అమ్మ ఎన్ని ముడులైనా వేస్తుంది అనే సామెత మన పల్లెటూళ్లల్లో వింటూనే ఉంటాం. గ్రామీణ ప్రాంతాల్లో జుట్టు ప్రాధాన్యతను ఇలాంటి సామెతల రూపంలో చెబుతుంటారు. అయితే ప్రస్తుతం పొల్యూషన్ కారణంగా కేశ సౌందర్యాన్ని కాపాడుకోవడం కష్టంగా మారింది. దాదాపు ప్రతి ఒక్కరూ చుండ్రు సమస్యతో బాధపడుతుంటారు. ఈ సమస్య నివారణకు రకరకాలైన షాంపూలను కచ్చితంగా వాడతారు. అయితే ఇందులో ఉండే రసాయనాలు జట్టుకు హానీ చేస్తాయా? తెలుసుకుందాం.
ఆడ, మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ రోజూ తమ జుట్టును దువ్వకునే సమయంలో డాండ్రఫ్ రాలుతుంది అనే ఫీలింగ్ ను అనుభవిస్తుంటారు. అయితే ఆడవాళ్లలో ఈ సమస్య అధికంగా ఉంటుందని నిపుణుల మాట. అయితే దీని నుంచి రక్షణకు వివిధ షాంపూలను తరచూ వాడుతుంటారు.
అయితే ఈ షాంపూలు కూడా జుట్టు తత్వం బట్టి పని చేస్తాయని హెయిర్ స్పెషలిస్టులు చెబుతున్నారు. అయితే మన జుట్టుకు ఏ రకమైన షాంపూ పని చేస్తుంది? అనే ఆలోచనతో షాంపూను ఎంచుకోవాలని సూచిస్తున్నారు.
యాంటీ డేండ్రఫ్ షాంపూ రోజు వాడితే జుట్టు రాలుతుందని కొంతమంది అభిప్రాయపడుతుంటారు. కానీ వైద్య నిపుణులు మాత్రం జుట్టు రాలే సమస్య ఉండదు కానీ మధ్య మధ్యలో మామూలు షాంపూను వాడడం కూడా మంచిదని అని సూచిస్తున్నారు. అయితే షాంపూలో వాడే కొన్ని రసాయనాలు జుట్టుకు కీడు చేసే అవకాశం ఉందని మాత్రం చెబుతున్నారు.
పాలిథిలిన్ గ్లైకాల్
ఇది పెట్రోలియానికి సంబంధించింది. దీన్ని హెయిర్ ప్రొడక్ట్స్‌లో గట్టిపడే ఏజెంట్‌గా ఉపయోగిస్తారు. అయితే ఇది మీ తల చర్మంపై హానికరమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
డైమెథికోన్
ఇది షాంపూల్లో వాడే ఓ రకమైన సిలికాన్ ఉత్పత్తి ఇది జుట్టును సిల్కీగా ఉంచడానికి రక్షణ పొరలా పని చేస్తుంది. కానీ కొంత సమయం తర్వాత డైమెథికోన్ కారణంగా జుట్టు పొడిబారిపోతుంది. జుట్టు చూడడానికి కూడా అందంగా కనిపించదు.
రెటినైల్ పాల్మిటేట్
ఇది రెటినోల్, పాల్మిటిక్ యాసిడ్ కు చెందిన ఈస్టర్ అనే పదార్ధం. దీని వల్ల చర్మ సంబంధిత సమస్యలైన ఎరుపు, దురద, స్కేలింగ్ మరియు పొట్టు రాలడం వంటి సమస్యలు వచ్చే అవకాశముంది.
ఈ చిట్కాలతో డేండ్రఫ్ సమస్య దూరం
తరచూ తల స్నానం చేయడం.
సరైన, రసాయనాలు లేని షాంపూలు ఉపయోగించాలి.
హెయిర్ డ్రయర్ ను వాడకుండా మామూలుగా జుట్టును ఆరబెట్టుకోవాలి.
తరచూ జుట్టుకు నూనె రాయాలి.
మగవారైతే జుట్టును ట్రిమ్ చేసుకోవడం మంచిది.
పోషకాహారం తీసుకోవడంతో పాటు ఎక్కువగా నీళ్లు తాగడం శ్రేయస్కరం.