Triple E Mosquito Virus: ముంచుకొస్తున్న మరో ముప్పు.. దోమల ద్వారా మరో ప్రాణాంతక వైరస్
ప్రపంచవ్యాప్తంగా కరోనా సృష్టించిన విలయాన్ని ఎవరూ మర్చిపోరు. ఆ దెబ్బకు ఎవరైనా వైరస్ అంటే వణికిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే తాజాగా ట్రిపుల్ ఈ మస్కిటో వైరస్ ప్రపంచాన్ని భయపెడుతుంది. దోమల ద్వారా సంక్రమించే ఈ అరుదైన వైరస్‌తో ద్వారా యునైటెడ్ స్టేట్స్‌లో ఓ వ్యక్తి మరణించాడు న్యూ హాంప్‌షైర్‌లోని అధికారులు ఈ మరణాన్ని అధికారికంగా ప్రకటించారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా సృష్టించిన విలయాన్ని ఎవరూ మర్చిపోరు. ఆ దెబ్బకు ఎవరైనా వైరస్ అంటే వణికిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే తాజాగా ట్రిపుల్ ఈ మస్కిటో వైరస్ ప్రపంచాన్ని భయపెడుతుంది. దోమల ద్వారా సంక్రమించే ఈ అరుదైన వైరస్‌తో ద్వారా యునైటెడ్ స్టేట్స్‌లో ఓ వ్యక్తి మరణించాడు న్యూ హాంప్‌షైర్‌లోని అధికారులు ఈ మరణాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ వైరస్‌ను అధికారికంగా ఈస్టర్న్ ఈక్విన్ ఎన్‌సెఫాలిటిస్ వైరస్ (ఈఈఈవీ) అని పిలుస్తారు. దీనిని “ట్రిపుల్ ఈ” అని కూడా పిలుస్తారు. ఈ వైరస్‌ను మొదటిసారిగా 1938లో మసాచుసెట్స్‌లోని గుర్రాల్లో గుర్తించారు. మసాచుసెట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నుంచి వచ్చిన డేటా ఆధారంగా రాష్ట్రంలో 118 మందికి రాగా 64 మంది ఈ వైరస్ కారణంగా మరణించారు. ఈ నేపథ్యంలో ట్రిపుల్ ఈ వైరస్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
ఉత్తర అమెరికా, కరేబియన్ ప్రాంతాల్లో ఎక్కువ మంది ఈ వైరస్ బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఆ ప్రాంతంలోని పక్షులు, దోమల కారణంగా వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటుందని యేల్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో అసోసియేట్ రీసెర్చ్ సైంటిస్టులు చెబుతున్నారు. అంతేకాకుండా బ్లాక్-టెయిల్డ్ దోమ ఈ వైరస్‌కు ప్రధాన క్యారియర్‌గా ఉంటుంది. ప్రధానంగా తూర్పు యూఎస్, మెక్సికో, కరేబియన్ ప్రాంతాల్లో ఈ వైరస్‌ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ వైరస్ సాధారణంగా చిత్తడి నేలల్లో ఉండే పక్షులలో వ్యాపిస్తుంది. ముఖ్యంగా దోమలు ఆ పక్షిని కుట్టాక మనషులను కుడితే వైరస్ వ్యాప్తి చెందుతుంది.
ఈ వైరస్ వచ్చిన వారికి అకస్మాత్తుగా చలి జ్వరం వస్తుంది. అలాగే తలనొప్పి, వాంతులు, విరేచనాలు, మూర్ఛ వంటి లక్షణాలు కనిపిస్తాయి. మగతతో పాటు ఒక్కోసారి మెదడు వాపు వచ్చే అవకాశం ఉంటుంది.2024లో యునైట్ స్టేట్స్‌లో ఐదుగురు ఈఈఈవీ వైరస్‌కు గురయ్యారు. మసాచుసెట్స్, న్యూజెర్సీ, వెర్మోంట్, విస్కాన్సిన్, న్యూ హాంప్‌షైర్ ప్రాంతాల్లో ఈ వైరస్ కేసులు నమోదయ్యాయి. మసాచుసెట్స్‌లోని ఆక్స్‌ఫర్డ్‌లో ఆగస్టు మధ్యలో 80 ఏళ్ల వ్యక్తికి సోకింది. మానవుల్లో ఈఈఈ చాలా అరుదు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డేటా ప్రకారం 2003 నుంచి 2023 వరకు యూఎస్ అంతటా 196 కేసులు నమోదయ్యాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..