Winter Health Tips: చలికాలంలో ఈ పండు అమృతం కంటే ఎక్కువే.. ఒక్కటి తింటే చాలు ఆ సమస్యల బాధే ఉండదు..

|

Nov 16, 2022 | 12:31 PM

తాకాలం ప్రారంభమైంది. ముఖ్యంగా ఈ సీజన్‌లో అనేక వ్యాధులు చుట్టుముడుతుంటాయి. జలుబు, జ్వరం వంటి వ్యాధులు త్వరగా వస్తాయి. వాతావరణ మార్పుల వల్ల కూడా అనేక ఇన్ఫెక్షనల్ వ్యాధులు కూడా సంక్రమిస్తాయి.

Winter Health Tips: చలికాలంలో ఈ పండు అమృతం కంటే ఎక్కువే.. ఒక్కటి తింటే చాలు ఆ సమస్యల బాధే ఉండదు..
Cold In Winter
Follow us on

Winter Health Tips: శీతాకాలం ప్రారంభమైంది. ముఖ్యంగా ఈ సీజన్‌లో అనేక వ్యాధులు చుట్టుముడుతుంటాయి. జలుబు, జ్వరం వంటి వ్యాధులు త్వరగా వస్తాయి. వాతావరణ మార్పుల వల్ల కూడా అనేక ఇన్ఫెక్షనల్ వ్యాధులు కూడా సంక్రమిస్తాయి. దీనితో పాటు ఈ రోజుల్లో బ్యాక్టీరియా, వైరస్లు కూడా చాలా వేగంగా వ్యాప్తి చెందుతాయి. ఈ రోజుల్లో వ్యాధులు రాకుండా ఉండాలంటే రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మనం ఆహారంలో కొన్ని ఆరోగ్యకరమైన పదార్థాలను చేర్చుకోవడం ద్వారా శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకొని శరీరాన్ని వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ముఖ్యంగా చలికాలంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి.. ఏదీ తీసుకుంటే మంచిది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

శీతాకాలంలో ఈ సూపర్ ఫుడ్ తీసుకోండి..

శీతాకాలంలో పలు రకాల వ్యాధులకు దూరంగా ఉండాలనుకుంటే.. అంజీర్ పండ్లను తినడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అంజీర్ ఒక సూపర్ ఫుడ్.. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. అందుకే ఈ రోజుల్లో అంజీర పండ్లను తినాలని పేర్కొంటున్నారు. మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం వంటి ఖనిజాలు అంజీర్‌లో ఉంటాయి. అత్తి పండ్లలో ఫైబర్, ప్రొటీన్లు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు (A – B కాంప్లెక్స్) పుష్కలంగా ఉన్నాయి. జలుబు, ఫ్లూ వంటి అనేక వ్యాధులను దూరంగా ఉంచడానికి ఇది మంచిగా పనిచేస్తుంది.

చలిని దూరం చేస్తాయి

అత్తి పండ్లు వేడెక్కించే ప్రభావాన్ని కలిగి ఉంటాయి. చలికాలంలో అత్తి పండ్లను తినడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అత్తి పండ్లను తీసుకోవడం వల్ల జలుబు, ఫ్లూ, సీజనల్ ఇన్‌ఫెక్షన్ల వల్ల వచ్చే వ్యాధులను దూరం చేస్తుంది.

ఇవి కూడా చదవండి

జలుబు – దగ్గు నుంచి ఉపశమనం..

అత్తి పండ్లలో ఉండే పోషకాలు శ్వాసకోశ వ్యవస్థకు మేలు చేస్తాయి. విటమిన్లు, ప్రొటీన్లు, ఫైబర్, కాల్షియం వంటి ఖనిజాలు అంజీర్‌లో ఉంటాయి. చలికాలంలో అంజీర పండ్లను తీసుకోవడం వల్ల కఫం, గొంతునొప్పి తొలగిపోతాయి. ఇది దగ్గు, జలుబు సమస్యను దూరం చేస్తుంది.

చర్మానికి మేలు చేస్తుంది..

చలికాలంలో చర్మం మెరుపు కూడా పోతుంది. ఈ రోజుల్లో చర్మం పొడిబారుతుంది. అంజీర్ పండ్లలో విటమిన్ సి, విటమిన్ ఇ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని తేమగా మార్చడానికి పని చేస్తాయి. పొడి చర్మం వదిలించుకోవడానికి, అత్తి పండ్లను తీసుకోవడం మంచిది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం..