Kiwi Fruit: ఈ పండు డయాబెటిస్ రోగులకు వరం.. మరెన్నో అద్భుతమైన ప్రయోజనాలు.. తెలిస్తే ఆశ్చర్యపోతారు

|

Aug 14, 2022 | 10:48 AM

Kiwi Fruit Benefits: బిజీ లైఫ్‌లో డయాబెటిస్ ఒక సాధారణ వ్యాధిగా మారింది. చిన్నా పెద్ద తేడా లేకుండా అందరిని వెంటాడుతోంది. మధుమేహం వచ్చిందంటే చాలు జీవనశైలి మార్చుకోవాల్సిందే..

Kiwi Fruit: ఈ పండు డయాబెటిస్ రోగులకు వరం.. మరెన్నో అద్భుతమైన ప్రయోజనాలు.. తెలిస్తే ఆశ్చర్యపోతారు
Kiwi Fruit
Follow us on

Kiwi Fruit Benefits: బిజీ లైఫ్‌లో డయాబెటిస్ ఒక సాధారణ వ్యాధిగా మారింది. చిన్నా పెద్ద తేడా లేకుండా అందరిని వెంటాడుతోంది. మధుమేహం వచ్చిందంటే చాలు జీవనశైలి మార్చుకోవాల్సిందే. లేకపోతే శరీరంలోని ఒక్కో అవయాశాన్ని నాశనం చేస్తుంది. ఆహారపు అలవాట్లను మెరుగుపరచుకోవాలి. మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ కివి పండు మధుమేమం ఉన్నవారికి అద్భుతమైన ప్రయోజనం కలిగిస్తుంది.

కివిలో విటమిన్-సి సమృద్ధిగా లభిస్తుందని అనేక అధ్యయనాలు తెలిపాయి. నారింజ, నిమ్మకాయల కంటే రెట్టింపు పరిమాణంలో ఈ పండులో విటమిన్ సి లభిస్తుంది. కేవలం ఒక సర్వింగ్ ప్రతి రోజు 117 శాతం విటమిన్ సి, 21 శాతం డైటరీ ఫైబర్ అందిస్తుంది. అంతే కాకుండా ఈ పండు తినడం వల్ల అనేక రకాల పోషకాలు లభిస్తాయి. దీని వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం..

కివితో రోగనిరోధక శక్తి:

ఇవి కూడా చదవండి

కివి పండు ఇందులో విటమిన్-సి సమృద్ధిగా లభిస్తుంది. ఇది కాకుండా కివీలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. రోగనిరోధక శక్తిని పెంపొందించడంతో పాటు, అనేక వ్యాధులతో పోరాడే శక్తిని శరీరానికి అందిస్తుంది. దీన్ని రోజూ తినడం వల్ల ఆస్తమా వంటి వ్యాధుల నుంచి చాలా వరకు ఉపశమనం పొందవచ్చు.

కివి గుండెకు మేలు:

విటమిన్ ఇ, పొటాషియం కూడా కివిలో పుష్కలంగా లభిస్తుంది. ఇది ధమనులను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా మీ గుండెను బలంగా చేస్తుంది. ఇది కాకుండా విటమిన్ E కూడా చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని ప్రతిరోజూ తినడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు.

మధుమేహాన్ని నియంత్రిస్తుంది:

మధుమేహ రోగులకు కివి చాలా మంచిదని చెబుతున్నారు నిపుణులు. ఈ పండు తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది. దీని కారణంగా రక్తంలో చక్కెర స్థాయి నియంత్రించబడుతుంది. కివి తినడం ద్వారా, సెరోటోనిన్‌ను పెంచే రసాయనాలు సక్రియం చేయబడతాయి. ఇది మంచి నిద్రకు దారితీస్తుంది. డయాబెటిక్ పేషెంట్ ప్రతిరోజూ కివీని తినాలి.

కివి ఆరోగ్యానికి నిధి లాంటిది:

కివి ఆరోగ్య నిధిగా పరిగణించబడుతుంది. ఈ పండులో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ల్యూటిన్, జియాక్సంతిన్, ఫైటోకెమికల్స్ లాగా ఉంటాయి. ఇవి శరీరంలో ఐరన్ శాతాన్ని పెంచడంలో సహాయపడుతుంది. రక్తహీనత సమస్యతో బాధపడేవారు ప్రయోజనం పొందుతారు. ప్రతిరోజూ కివీని తినడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ఇది కంటికి చాలా ముఖ్యమైన పండుగా కూడా పరిగణించబడుతుంది. ఇన్ని అద్భుతమైన ప్రయోజనాలు ఉండే ఈ పండులో ప్రతి రోజు తీసుకుంటే మీ ఆరోగ్యానికి కొదవ ఉండదు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి