వాతావరణం మారేటప్పుడు.. దానికి తగ్గట్టుగా ఆహారంలో కూడా మార్పులు చేర్పులు చేసుకోవాలి. అప్పుడే త్వరగా వ్యాధుల బారిన పడకుండా ఉంటాం. ప్రస్తుతం చలి కాలంలో రోగాలు త్వరగా వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది తగ్గి పోతుంది. దీని కారణంగా త్వరగా బ్యాక్టీరియా ఎటాక్ చేస్తూ ఉంటుంది. అందుకే చలి కాలంలో రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలు తీసుకోవాలి. అంతే కాకుండా సూర్యుని వేడి కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి.. భోజనం కూడా త్వరగా చేయాలి.
శీతా కాలంలో చలి కారణంగా బద్ధకంగా అనిపిస్తుంది. దీంతో చాలా మంది వ్యాయామాలు చేయడానికి ఆసక్తి చూపరు. దీని కారణంగా ఫిట్ నెస్ కోల్పోతారు. ఇలాంటి సమయంలో బెల్లం టీ తాగితే.. వెయిట్ లాస్ అవ్వడంతో పాటు కొన్ని దీర్ఘకాలిక సమస్యలకు కూడా దూరంగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ బెల్లం టీతో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
జీవక్రియను మెరుగు పరుస్తుంది:
చలి కాలంలో క్రమం తప్పకుండా బెల్లం టీ తాగడం వల్ల జీర్ణ క్రియ సమస్యలు అనేవి తగ్గుతాయి. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి కాబట్టి.. జీర్ణ క్రియ పెరుగుతుంది. దీంతో గ్యాస్, అజీర్తి, మల బద్ధకం వంటి సమస్యల తగ్గుముఖం పడతాయి.
ఇమ్యూనిటీ పెరుగుతుంది:
బెల్లంలో అనేక రకాలైన పోషకాలు ఉంటాయి. కాబట్టి చలి కాలంలో బెల్లంతో తయారు చేసిన ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. దీంతో శరీరంలో బలంగా మారుతుంది. కాబట్టి ఇతర వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది.
వెయిట్ లాస్ అవ్వొచ్చు:
చలి కాలంలో బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతే కాకుండా బరువు తగ్గాలనుకునే వారు కూడా చలి కాలంలో బరువు తగ్గే ఆహారాలను తీసుకోవాలి. ఈ క్రమంలో శరీరంలో కేలరీలను తగ్గించడంలో బెల్లం టీ బాగా పని చేస్తుంది.
పీరియడ్స్ నొప్పి తగ్గిస్తుంది:
కేవలం చలి కాలంలోనే కాకుండా ప్రతి రోజూ క్రమం తప్పకుండా మహిళలు బెల్లం టీని తాగడం వల్ల శరీరానికి అనేక రకాలైన పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా మహిళల్లో వచ్చే నెలసరి నొప్పులు కూడా బెల్లం టీతో తగ్గించుకోవచ్చు. పీరియడ్స్ లో వచ్చే నొప్పిని తగ్గించడంలో బెల్లం టీ అద్భుతంగా పని చేస్తుంది.
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.