షుగర్ ఉన్నవారికి డేంజర్ బెల్స్ మోగించే 5 పండ్లు.. వీటిని మీరు తింటున్నారా..?
మధుమేహం ఉన్నవాళ్లు ఏం తినాలి, ఏం తినకూడదు అనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కార్బోహైడ్రేట్లు, చక్కెరలు ఉన్న ఆహారం పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. వాటిని కొంచెం అటూ ఇటూగా తీసుకున్నా.. బ్లడ్ షుగర్ లెవెల్స్ అమాంతం పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది.

పండ్లు ఆరోగ్యానికి మంచివే కానీ.. కొన్ని పండ్లలో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాంటి పండ్లు తినడం వల్ల ఇన్సులిన్ లెవెల్స్ పెరిగి బ్లడ్ షుగర్ కంట్రోల్ తప్పిపోతుంది. అందుకే షుగర్ ఉన్నవాళ్లు అస్సలు తినకూడని ఐదు పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మామిడి.. మామిడిలో సహజంగానే షుగర్ కంటెంట్ ఎక్కువ. ఒక మామిడిలో దాదాపు 40 నుంచి 45 గ్రాముల షుగర్ ఉంటుంది. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) 51 నుంచి 60 మధ్య ఉంటుంది. అంటే ఇది తిన్న వెంటనే రక్తంలో షుగర్ లెవెల్స్ వేగంగా పెరుగుతాయి. ఇందులో ఫైబర్ తక్కువగా ఉండటం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడం కష్టం.
అరటిపండు.. అరటిపండు పండిన కొద్దీ దానిలోని స్టార్చ్ షుగర్ గా మారుతుంది. బాగా పండిన అరటిపండు GI విలువ 60కి పైగా ఉంటుంది. దీని వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరుగుతాయి.
సపోటా.. సపోటా తీయగా ఉండటానికి కారణం అందులో ఉన్న అధిక షుగర్. 100 గ్రాముల సపోటాలో దాదాపు 20 గ్రాముల షుగర్ ఉంటుంది. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ 65 నుంచి 70 మధ్య ఉంటుంది. ఇది షుగర్ పేషెంట్స్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ను ఫాస్ట్‌గా పెంచుతుంది.
ద్రాక్ష.. ద్రాక్షలో కూడా షుగర్ తక్కువేం కాదు. 100 గ్రాముల ద్రాక్షలో సుమారు 16 నుంచి 18 గ్రాముల షుగర్ ఉంటుంది. దీని GI 50 నుంచి 59 మధ్య ఉంటుంది. ద్రాక్ష తొక్క సన్నగా ఉండడం వల్ల ఫైబర్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే కొద్దిగా తిన్నా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ వేగంగా పెరుగుతాయి.
పైనాపిల్.. ఈ పండులో షుగర్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ 66 నుంచి 94 వరకు మారుతుంది. భోజనం తర్వాత దీన్ని తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగిపోవచ్చు. అందుకే షుగర్ ఉన్నవాళ్లు ఈ పండును అస్సలు తినకపోవడమే మంచిది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




