వార్నీ ఇదేం టీ అనుకోకండి..! ఉదయాన్నే ఉల్లిపాయ టీ తాగితే దిమ్మ తిరిగే బెనిఫిట్స్.. తెలిస్తే అస్సలు విడిచిపెట్టరండోయ్…
మనలో చాలా మందికి ఉదయాన్నే టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కానీ, ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ, టీలు అతిగా తాగడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలకు దారి తీసే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే టీ, కాఫీలకు బదులుగా ఉదయాన్నే ఉల్లిపాయతో తయారు చేసిన టీ తాగటం ఉత్తమం అంటున్నారు.ఉల్లిపాయ టీ ఏంటని ఆశ్చర్యపోతున్నారు కాదా.. కానీ, ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని అంటారు.. అలాగే, ఉల్లిపాయ టీ ప్రయోజనాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు.

ఉల్లిపాయ టీ ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఉల్లిపాయ టీలో లభించే మూలకాలు శరీరాన్ని అనేక వ్యాధుల నుండి రక్షిస్తాయి. ఉల్లిపాయతో చేసిన టీ ఉదయాన్నే తాగడం వల్ల శరీరానికి ఫ్లెవనాల్ అనే పోషకం పుష్కలంగా లభిస్తాయి. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. ఇది నిద్రలేమి, అధిక రక్తపోటు, క్యాన్సర్, చక్కెర స్థాయి, రక్తహీనత, కడుపు సంబంధిత వ్యాధి, బరువును తగ్గించడంలో చాలా సహాయపడుతుంది.
ఉల్లిపాయ టీ తాగడం వల్ల గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఉల్లిపాయ టీ క్యాన్సర్‌లో సహాయపడుతుంది. మధుమేహం నుండి ఉపశమనం కలిగిస్తుంది. రక్తపోటు నివారణగా పనిచేస్తుంది. మీరు వ్యాధులను దూరంగా ఉంచుకోవాలనుకుంటే ఈరోజు నుండే ఉల్లిపాయ టీని క్రమం తప్పకుండా తాగడం అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ ఉల్లిపాయ టీ తయారీ కోసం ముందుగా ఓ పెద్ద బౌల్ తీసుకోవాలి. అందులో రెండు గ్లాసుల నీటిని పోసుకొని మసాలా దినుసులు అన్ని వేసుకొని, ఉల్లిపాయలు వేసుకొని బాగా ఉడకబెట్టుకోండి. ఇలా అన్నీ ఉడకబెట్టిన తర్వాత ఒక గాజు గ్లాసులోకి టీని సర్వ్ చేసుకుని, అందులో కావలసినంత తేనెను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉదయం ఖాళీ కడుపుతో తాగితే.. అన్ని రకాల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








