పాలు తాగిన వెంటనే వీటిని తిన్నారో.. బాడీ షెడ్డుకే! జర పైలం..
రోజూ గ్లాసుడు పాలు తాగడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. అంతేకాకుండా పాలలో అధికంగా ఉండే కాల్షియం, భాస్వరం ఎముకలు, దంతాల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పాలు తాగడం వల్ల ఎముకలు బలపడటమే కాకుండా, బలహీనమైన ఎముకల సమస్యలు కూడా తగ్గుతాయి. ఇందులో ప్రోటీన్ పుష్కలంగా..

పాలు ఆరోగ్యానికి చాలా మంచిది. రోజూ గ్లాసుడు పాలు తాగడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. అంతేకాకుండా పాలలో అధికంగా ఉండే కాల్షియం, భాస్వరం ఎముకలు, దంతాల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పాలు తాగడం వల్ల ఎముకలు బలపడటమే కాకుండా, బలహీనమైన ఎముకల సమస్యలు కూడా తగ్గుతాయి. ఇందులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల శరీరానికి తగినంత ప్రోటీన్ లభిస్తుంది. కానీ పాలను సరైన టైంలో సరైన మోతాదులో తీసుకుంటేనే శరీరానికి ప్రయోజనాలను అందిస్తాయి. లేదంటే ఇవి ప్రయోజనాలకు బదులు హానికరంగా మారతాయి. కాబట్టి పాలు తాగడానికి ఉత్తమ సమయం ఏది? ఎలా తీసుకోవాలి? వంటి విషయాలు ఇక్కడ తెలుసుకుందాం..
పాలలోని పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వ్యాధులను దూరంగా ఉంచుతాయి. పాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత శక్తి అందిస్తుంది. గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కానీ పాలు సరైన విధంగా తాగినప్పుడు మాత్రమే ఈ ప్రయోజనాలు పొందడానికి అవకాశం ఉంటుంది. లేదంటే లేనిపోని సమస్యలను కలిగిస్తుంది. ముఖ్యంగా పాలు తాగిన తర్వాత కొన్ని ఆహారాలు తినడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
కారంగా ఉండే ఆహారాలు
చాలా మంది పాలు తాగిన తర్వాత చిప్స్, ఉప్పగా ఉండే బిస్కెట్లు, జంక్ ఫుడ్ తింటారు. ఈ అలవాటును వెంటనే మానేయడం మంచిది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పాలు తాగిన వెంటనే లేదా పాలతో పాటు ఉప్పు లేదా కారంగా ఉండే ఆహారాన్ని తినకూడదు. ఇవి కడుపు, జీర్ణ సమస్యలను కలిగిస్తాయి. అందువల్ల పాలు తాగిన వెంటనే ఇలాంటి స్నాక్స్ తీసుకోవడం మానేయాలి.
బెల్లం కలిపిన పాలు
సాధారణంగా చాలా మంది బెల్లం కలిపిన పాలు ఆరోగ్యానికి మంచివని నమ్ముతారు. వాస్తవానికి బెల్లం కలిపిన పాలు మంచివే. కానీ బెల్లం సరైన నాణ్యతతో, తాజాగా ఉండాలి. అదేవిధంగా, కొన్ని బెల్లంలలో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ విధమైన బెల్లం పాలలో కలపడం మంచిది కాదు. అలా చేయడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి.
సిట్రస్ పండ్లు
నారింజ, నిమ్మ వంటి సిట్రస్ పండ్లను పాలతో కలపవద్దు. ఈ పండ్లలో అధిక మొత్తంలో ఆమ్లం ఉంటుంది. ఇది పాలలోని ప్రోటీన్ గడ్డకట్టడానికి కారణమవుతుంది. ఇది జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. గ్యాస్, ఉబ్బరం, కడుపు తిమ్మిరి వంటి సమస్యలకు కూడా దారితీస్తుంది. అందువల్ల పిల్లలు, పెద్దలు పాలు తాగిన వెంటనే సిట్రస్ పండ్లను తినకూడదు. పాలు తాగిన 2 నుంచి 3 గంటల తర్వాత మాత్రమే ఈ రకమైన పండ్లను తినాలి.
చేప
సాధారణంగా చేపలు చాలా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. కానీ పాలు, చేపలను కలిపి తినకూడదు. దీనివల్ల కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి.
పుచ్చకాయ
పాలు తాగిన వెంటనే పుచ్చకాయ తినడం కూడా అంత మంచిది కాదు. పాలలోని ప్రోటీన్ పుచ్చకాయలోని ఆమ్లంతో కలిసి లేనిపోని సమస్యలను కలిగిస్తుంది. దీనివల్ల కడుపు నొప్పి, అజీర్ణం వంటి ఆరోగ్య ప్రమాదాలు పెరుగుతాయి. కాబట్టి పాలు తాగిన వెంటనే ఈ ఆహారాలను తీసుకోవడం మానేయడం మంచిది.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.








