Health: వీరు ఈ 5 ఫుడ్స్‌ను అస్సలు తినకూడదు.! లేదంటే పొట్ట కొబ్బరిబొండంలా అవ్వొచ్చు..

మారుతున్న జీవనశైలి కారణంగా ఇటీవల కాలంలో చాలామందికి థైరాయిడ్ సమస్యలు సర్వసాధారణమయ్యాయి. మందులతో పాటు ఆహారంపై కూడా శ్రద్ధ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయంలో వీరంతా ఏయే ఫుడ్స్ తినాలంటే..? ఓ సారి ఈ స్టోరీ చూసేయాల్సిందే మరి. ఆ వివరాలు..

Health: వీరు ఈ 5 ఫుడ్స్‌ను అస్సలు తినకూడదు.! లేదంటే పొట్ట కొబ్బరిబొండంలా అవ్వొచ్చు..

Updated on: Jan 10, 2026 | 1:50 PM

మారుతున్న జీవనశైలి, అధిక ఒత్తిడి, ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ఈ రోజుల్లో చాలామందికి థైరాయిడ్ సమస్యలు ఎదురవుతున్నాయి. థైరాయిడ్ గ్రంథి శరీరంలోని ముఖ్యమైన హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఇది జీవక్రియ, ఇమ్యూనిటీ స్థాయిలను పెంచుతుంది. థైరాయిడ్ స్థాయిలు కంట్రోల్‌లో ఉండాలంటే కేవలం మందులు వాడితే సరిపోదు. మనం రోజువారీ తీసుకునే ఆహారంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించడం అత్యవసరం. కొన్ని రకాల ఆహార పదార్థాలు థైరాయిడ్ గ్రంథి పనితీరును దెబ్బతీసి, హార్మోన్ల అసమతుల్యతను మరింత తీవ్రతరం చేస్తాయి. థైరాయిడ్ సమస్య ఉన్నవారు ఖచ్చితంగా ఈ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. అవేంటంటే..

ఇది చదవండి: ‘నారా లోకేష్, ఆ హీరో, నేను క్లాస్‌మేట్స్.. కాలేజీ రోజుల్లో మేమంతా..’

మొదటిది.. క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రోకోలీ లాంటి క్రూసిఫెరస్ కూరగాయలు. వీటిని పచ్చిగా తిన్నప్పుడు థైరాయిడ్ గ్రంథి అయోడిన్‌ను గ్రహించకుండా అడ్డుకుంటాయి. రెండోది.. సోయా ఉత్పత్తులు. సోయాలోని ఐసోఫ్లేవనోలు థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తాయి. మూడోది.. ప్రాసెస్ చేసిన ఆహారాలు, జంక్ ఫుడ్. వీటిలో అధిక సోడియం, ప్రిజర్వేటివ్స్ రక్తపోటు, బరువు పెరగడానికి కారణమవుతాయి. నాలుగోది.. చక్కెర అధికంగా ఉండే పదార్థాలు, స్వీట్లు. థైరాయిడ్ ఉన్నవారిలో జీవక్రియ మందగిస్తుంది కాబట్టి, చక్కెర కొవ్వుగా మారి ఊబకాయానికి దారితీస్తుంది. ఐదోది.. గ్లూటెన్ ఎక్కువగా ఉండే మైదా, గోధుమ ఉత్పత్తులు. గ్లూటెన్ వల్ల థైరాయిడ్ గ్రంథిలో వాపు వచ్చే అవకాశం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. మందులు వేసుకున్న వెంటనే కాఫీ, టీలకు దూరంగా ఉండటం కూడా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఆ సినిమానే చిరంజీవిని ఫ్లాప్‌ల నుంచి గట్టెక్కించింది.. ఓపెన్‌గా చెప్పేసిన టాలీవుడ్ దర్శకుడు

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.